తెలంగాణ కలెక్టర్: మైక్ పట్టుకుని జనం మధ్య ప్రచారం: విదేశాల నుంచి వచ్చే వారిపై నిఘా..

కరీంనగర్: మైక్ పట్టుకుని జనం మధ్య కలియ తిరుగుతూ ఓ యువకుడు హల్‌చల్ చేశారు. బస్టాండ్ సహా ప్రజలు పెద్ద ఎత్తున గుమికూడి ఉండే ప్రాంతాల్లో తిరుగుతూ ప్రజలకు అవగాహన కల్పిస్తూ.. వారిని చైతన్య పరుస్తూ కనిపించారు. ప్రాణాంతక కరోనా వైరస్‌ ఒకరి నుంచి ఒకరికి సోకకుండా తీసుకోవాల్సిన ముందుజాగ్రత్త చర్యలపై రెండు, మూడు గంటల పాటు ఆయన ఇలా ప్రజల మధ్యే కనిపించారు. ఆ యువకుడు మరెవరో కాదు.. సాక్షాత్తూ జిల్లా కలెక్టర్. పేరు కృష్ణ భాస్కర్. తెలంగాణలోని రాజన్న సిరిసిల్ల జిల్లా పరిపాలనాధికారి.

కలెక్టర్ విస్తృత పర్యటన..

కలెక్టర్ విస్తృత పర్యటన..

కరోనా వైరస్‌పై ప్రజల్లో అవగాహన కల్పించడానికి ఆయన సిరిసిల్లలో విస్తృతంగా ప్రచారం చేశారు. సిరిసిల్ల బస్టాండ్ సహా ప్రజలు పెద్ద ఎత్తున గుమికూడి ఉండే ప్రాంతాల్లో డిప్యూటీ కలెక్టర్, జిల్లా వైద్యాధికారులు, రెవెన్యూ సిబ్బందితో కలిసి ఆయన పర్యటించారు. స్వయంగా మైక్ పట్టుకుని ప్రజలకు అవగాహన కల్పించారు. జనసమ్మర్థం ఉన్న ప్రాంతాల్లో ప్రజలు ఏం చేయాలో? ఏం చేయకూడదో వివరించారు. కొన్ని రకాల ముందుజాగ్రత్తలను తీసుకోవడం వల్ల కరోనా వైరస్‌‌ సోకకుండా అరికట్టవచ్చని చెప్పారు.

చికిత్స కన్నా ముందుజాగ్రత్తే నయం..

ప్రజలు బహిరంగ ప్రదేశాల్లో ముఖానికి మాస్క్‌లను ధరించాలని సూచించారు. ఎవరైనా దగ్గినా లేదా తుమ్మినా.. చేతులు అడ్డు పెట్టుకోవాలని అన్నారు. ఇంటికి వెళ్లిన తరువాత శానిటైజర్‌తో చేతులను శుభ్రం చేసుకోవాలని కలెక్టర్ విజ్ఙప్తి చేశారు. కరోనా వైరస్‌ సోకిన తరువాత చికిత్స తీసుకోవడం కంటే.. అది రాకుండా ముందుజాగ్రత్త చర్యలను చేపట్టడమే మేలు అని కృష్ణ భాస్కర్ తెలిపారు. దగ్గు, జలుబు, జ్వరం వంటి లక్షణాలు ఉన్న వెంటనే సమీపంలోని ఆసుపత్రికి వెళ్లాలని, రక్త పరీక్షలను చేయించుకోవాలని, జిల్లా వైద్యాధికారులను సంప్రదించాలని అన్నారు.

విదేశాల నుంచి వచ్చే వారిపై నిఘా..

విదేశాల నుంచి వచ్చే వారిపై నిఘా..

ఉమ్మడి కరీంనగర్, నిజామాబాద్ వంటి జిల్లాల నుంచి పెద్ద ఎత్తున స్థానికులు జీవనోపాధి కోసం దుబాయ్, సౌదీ అరేబియా, ఖతర్ వంటి గల్ప్ దేశాలకు తరలి వెళ్తుంటారని, ఈ మధ్యకాలంలో అలా విదేశాల నుంచి వచ్చిన వారిపై నిఘా ఉంచాలని కృష్ణ భాస్కర్ సూచించారు. ఇప్పటిదాకా తెలంగాణలో నమోదైన కరోనా వైరస్ పాజిటివ్ కేసుల్లో స్థానికులు ఎవరూ లేరని చప్పారు. పాజిటివ్ లక్షణాలు కనిపించిన వారంతా విదేశాల నుంచి వచ్చిన వారేనని గుర్తు చేశారు. కరోనా వైరస్ సోకిన దేశాల నుంచి వస్తోన్న వారిపై నిఘా ఉంచాలని, అలాంటి వారు వచ్చిన వెంటనే పోలీసులకు గానీ, రెవెన్యూ అధికారులకు గానీ తెలియజేయాలని చెప్పారు.

Recommended Video

    5 Minutes 10 Headlines || KCR Nominates Kavitha As MLC || Virus Impact On Indians Abroad
    కలెక్టర్ చొరవపై ప్రశంసలు..

    కలెక్టర్ చొరవపై ప్రశంసలు..

    ప్రాణాంతక కరోనా వైరస్ వ్యాప్తి చెందుతోన్న ప్రస్తుత పరిస్థితుల్లో జిల్లా కలెక్టర్ తీసుకున్న చొరవ పట్ల నెటిజన్లు ప్రశంసిస్తున్నారు. స్వయంగా జిల్లా కలెక్టరే తమ వద్దకు వచ్చి, జాగ్రత్తలను సూచించడం వల్ల ప్రజల్లో మార్పు వస్తుందని చెబుతున్నారు. కృష్ణ భాస్కర్‌ను ఆదర్శంగా తీసుకుని ఇతర జిల్లాల కలెక్టర్లు.. అత్యున్నత స్థాయి పరిపాలనా అధికారులు ప్రజల్లో అవగాహన కల్పించడానికి ముందుకు రావాలని సూచిస్తున్నారు.

    Notifications
    Settings
    Clear Notifications
    Notifications
    Use the toggle to switch on notifications
    • Block for 8 hours
    • Block for 12 hours
    • Block for 24 hours
    • Don't block
    Gender
    Select your Gender
    • Male
    • Female
    • Others
    Age
    Select your Age Range
    • Under 18
    • 18 to 25
    • 26 to 35
    • 36 to 45
    • 45 to 55
    • 55+