Telangana: ఆ విషయంలో రెండో స్థానంలో నిలిచిన తెలంగాణ..
చోరీకి గురైన సెల్ ఫోన్ల రికవరీ చేయడంలో తెలంగాణలో దేశంలోనే రెండో స్థానం దక్కించుకుంది. 19 ఏప్రిల్ 2023 నుంచి ఇప్పటి వరకు 30,049 మొబైళ్లు తిరిగి రికవరీ చేసినట్లు అదనపు డీజీ మహేశ్ భగవత్ ప్రకటించారు. సైబరాబాద్ కమిషనరేట్ పరిధిలో 3,078 ఫోన్లు, హైదరాబాద్ కమిషనరేట్ పరిధిలో 4,869 ఫోన్లు రికవరీ చేశారు. ఇక రాచకొండ కమిషనరేట్ పరిధిలో 3,042 మొబైల్ ఫోన్లు పట్టుకున్నట్లు మహేశ్ భగవతి వివరించారు.
తెలంగాణలో 780 పోలీస్ స్టేషన్లలో సీఈఐఆర్ యూనిట్లు అందుబాటులో ఉన్నట్లు పేర్కొన్నారు. పోయిన ఫోన్లను రికవరీ చేసిన రాష్ట్రాల్లో కర్ణాటక మొదటి స్థానంలో ఉంది. కర్ణాటక పోలీసులు 35,945 ఫోన్లు రికవరీ చేశారు. ఆంధ్రప్రదేశ్ పోలీసులు 7,387 ఫోన్లు రికవరీ చేసి నాలుగో స్థానంలో నిలిచారు. తెలంగాణలో గత తొమ్మిది రోజుల్లోనే 1000 ఫోన్లు రికవరీ చేసినట్లు అదనపు డీజీ తెలిపారు.

పోయిన ఫోన్లు దొరకలంటే బాధితులు కొన్ని పను చేయాలి. ఫోన్ పోయిన వెంటనే సెంట్రల్ ఎక్విప్మెంట్ ఐడెంటిటీ రిజిస్టర్ (CEIR) ద్వారా వెంటనే దాన్ని బ్లాక్ చేయాలి. అయితే మన వద్ద పోయిన ఫోన్ ఐఎంఈఐ నంబర్ ఉండాలి. ఐఎంఈఐ నంబర్ తో సీఈఐఆర్ పోర్టులో ఫిర్యాదు చేయాలి. పోర్టల్ ద్వారా ఇప్పటి వరకు 15,43,666 ఫోన్లను బ్లాక్ చేయగా.. 8,47,140 ఫోన్లను రికవరీ చేశారు. అయితే కొంత మంది సెకండ్ హ్యాండ్ లో ఫోన్ కొంటారు.
ఇలా కొనేవారు జాగ్రతగా ఉండాలి. ఫోన్ నో యువర్ మొబైల్(KYM) చెక్ చేయాలి. ఫోన్ ఐఎంఈఐ నంబర్ ను కేవైఎం పోర్టల్ లో ఎంటర్ చేయాలి. అప్పుడు బ్లాక్ లిస్టెడ్, డూప్లికేట్, ఆల్ రెడి ఇన్ యూజ్ అని వస్తే ఓ ఫోన్ కొనుగోలు చేయకూడదు. మీ ఫోన్ ఐఎంఈఐ నంబర్ లో ఫోన్ లోనే ఉంటుంది. లేకుంటే *#06# డయల్ చేస్తే మీ ఐఎంఈఐ నంబర్ వస్తుంది.












Click it and Unblock the Notifications