తెలంగాణలో కొత్తగా 1197 కరోనా పాజిటివ్ కేసులు... మరో 9 మంది మృతి...

తెలంగాణలో గడిచిన 24 గంటల్లో కొత్తగా 1197 కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. మరో 9 మంది కరోనాతో మృతి చెందారు. తాజా కేసులతో కలిపి మొత్తం పాజిటివ్ కేసుల సంఖ్య 6,14,399కి చేరింది. మొత్తం మృతుల సంఖ్య 3576కి చేరింది.

గడిచిన 24 గంటల్లో 1,19,537 శాంపిల్స్‌ను పరీక్షించారు. కొత్తగా మరో 1,707 మంది బాధితులు కరోనా నుంచి కోలుకోగా... ఇప్పటివరకూ కరోనా నుంచి కోలుకున్న వారి సంఖ్య 5,93,577కు చేరింది.రాష్ట్రంలో ప్రస్తుతం 17,246 కోవిడ్‌ యాక్టివ్‌ కేసులున్నాయి.

telangana reported 1197 fresh covid cases and 9 deaths

కొత్తగా నమోదైన పాజిటివ్ కేసుల్లో జీహెచ్‌ఎంసీ పరిధిలో 137,నల్గొండ జిల్లాలో 84,సూర్యాపేట జిల్లాలో 72,మేడ్చల్ మల్కాజ్‌గిరి,భద్రాద్రి కొత్తగూడెం జిల్లాల్లో 71 కేసుల చొప్పున నమోదయ్యాయి.

వ్యాక్సిన్ విషయానికి వస్తే సోమవారం(జూన్ 21) 22 మంది హెల్త్ కేర్ వర్కర్లు రెండో డోసు తీసుకున్నారు. ఇప్పటివరకూ మొత్తం 2,51,216 మంది హెల్త్ కేర్ వర్కర్లు మొదటి డోసు తీసుకోగా... 1,92,425 మంది రెండో డోసు తీసుకున్నారు. 31 మంది ఫ్రంట్ లైన్ వర్కర్లు ఇవాళ మొదటి డోసు తీసుకోగా 15 మంది రెండో డోసు తీసుకున్నారు. మొత్తంగా ఇప్పటివరకూ 2,66,799 మంది ఫ్రంట్ లైన్ వర్కర్లు మొదటి డోసు తీసుకున్నారు. 1,00,390 మంది హెల్త్ కేర్ వర్కర్లు రెండో డోసు తీసుకున్నారు.

18-44 వయసు వారిలో 80,653 మంది ఇవాళ మొదటి డోసు తీసుకోగా 1,415 మంది రెండో డోసు తీసుకున్నారు. ఈ ఏజ్ గ్రూప్‌‌లో ఇప్పటివరకూ 26,03,737 మంది మొదటి డోసు తీసుకోగా... 7513 మంది రెండో డోసు తీసుకున్నారు. 45 ఏళ్లు పైబడినవారిలో ఇవాళ కొత్తగా 22461 మంది మొదటి డోసు తీసుకోగా 1613 మంది రెండో డోసు తీసుకున్నారు.ఈ ఏజ్ గ్రూపులో మొత్తంగా 44,90,136 మంది మొదటి డోసు తీసుకోగా 12,60,869 మంది రెండో డోసు తీసుకున్నారు.

సోమవారం ఒక్కరోజే 103145 మంది కోవిడ్ వ్యాక్సిన్ మొదటి డోసు తీసుకోగా 3065 మంది రెండో డోసు తీసుకున్నారు. రాష్ట్రంలో ఇప్పటివరకూ 76లక్షల పైచిలుకు ముందు మొదటి డోసు తీసుకోగా 15లక్షల పైచిలుకు మంది రెండో డోసు తీసుకున్నారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+