"2047 నాటికి 3 ట్రిలియన్ ఎకానమీ లక్ష్యంగా తెలంగాణ"
డిసెంబర్ 8,9 తేదీల్లో ఫోర్త్ సిటీ వేదికగా నిర్వహించబోతున్న 'తెలంగాణ రైజింగ్ గ్లోబల్ సమ్మిట్ - 2025' సదస్సులో భాగంగా ఆవిష్కరించబోతున్న 'తెలంగాణ రైజింగ్ -2047' విజన్ డాక్యుమెంట్ పై పలు శాఖల అధికారులతో సీఎం రేవంత్ రెడ్డి సమీక్ష నిర్వహించారు. 2034 నాటికి 1 ట్రిలియన్, 2047 నాటికి 3 ట్రిలియన్ ఎకానమీ లక్ష్యాన్ని సాధించడానికి ఈ విజన్ డాక్యుమెంట్ రోడ్ మ్యాప్ గా ఉండబోతోందని స్పష్టం చేశారు.
తెలంగాణ కోర్ అర్బన్, అర్బన్, రూరల్ ఏరియాల్లో రాబోయే పరిశ్రమలు, మౌలిక సదుపాయాలు, వ్యవసాయ అభివృద్ధి, విద్య, వైద్యం, పేదల సంక్షేమం, విద్యుత్, సాగునీరు, గ్రామీణాభివృద్ధి.. తదితర రంగాల విజన్ డాక్యుమెంట్స్ రూపకల్పనలో పాలసీ పెరాలసిస్ లేకుండా చూడాలని ఈ మేరకు అధికారులను సీఎం రేవంత్ రెడ్డి ఆదేశించారు.
తెలంగాణ రైజింగ్- 2047 పాలసీ డాక్యుమెంట్ పై అధికారులతో సీఎం రేవంత్ రెడ్డి సమీక్ష నిర్వహించారు. పాలసీ డాక్యుమెంట్ పై అధికారులకు పలు సూచనలు చేశారు. తెలంగాణ అభివృద్ధిని ప్రతిబింబించేలా తెలంగాణ రైజింగ్-2047 పాలసీ డాక్యుమెంట్ ఉండాలని అధికారులను సీఎం రేవంత్ సూచించారు. 2034 నాటికి 1 ట్రిలియన్, 2047 నాటికి 3 ట్రిలియన్ డాలర్ల ఎకానమీగా తెలంగాణను తీర్చిదిద్దేందుకు స్పష్టమైన రోడ్ మ్యాప్ పాలసీ డాక్యుమెంట్ లో కనిపించాలని ఆదేశించారు.
"రాష్ట్ర ఆర్థికాభివృద్ధిని మూడు రీజియన్లుగా విభజించి అభివృద్ధి చేసుకోవాలి. కోర్ అర్బన్ రీజియన్ ఎకానమి (CURE), పెరీ అర్బన్ రీజియన్ ఎకానమీ (PURE), రూరల్ అగ్రికల్చర్ రీజియన్ ఎకానమీ (RARE) గా మూడు రీజియన్లను విభజించుకోవాలి. ఈ మూడు రీజియన్లలో ఎక్కడెక్కడ ఎలాంటి అభివృద్ధి ఉండాలో డాక్యుమెంట్ లో పొందుపరచాలి. హెల్త్, ఎడ్యుకేషన్, టెక్నాలజీ, జీసీసీలు, ఫార్మా, అగ్రికల్చర్ తో పాటు వివిధ రంగాల్లో ఎక్కడెక్కడ ఏయే రంగం అభివృద్ధి ఉండాలో ప్రణాళిక రూపొందించాలి" అని సీఎం రేవంత్ రెడ్డి స్పష్టం చేశారు.

"ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ రోడ్, పోర్ట్, కనెక్టివిటీ ముఖ్యమైనవి. సంక్షేమం, టెంపుల్ టూరిజం, ఎకో టూరిజం, ఎనర్జీ డిపార్ట్ మెంట్.. ఇలా ప్రతీ రంగానికి సంబంధించి పాలసీ డాక్యుమెంట్ లో స్పష్టత ఉండాలి. తెలంగాణ పాలసీ, భవిష్యత్ ప్రణాళికలు వివరించేలా పాలసీ డాక్యుమెంట్ ఉండాలి. తెలంగాణ రాష్ట్రంలో పాలసీ పెరాలసిస్ ఉండదని చాటి చెప్పేలా తెలంగాణ రైజింగ్ పాలసీ డాక్యుమెంట్ ఉండాలి. కొత్తగా ఏర్పాటయ్యే ఎయిర్ పోర్టులలో ప్రయాణీకులతో పాటు కార్గో సర్వీసెస్ కూడా అందుబాటులో ఉంచేలా ప్రణాళికలు సిద్ధం చేయండి. వాస్తవిక దృక్పథం కనిపించేలా డిజైన్లు ఉండేలా జాగ్రత్తలు తీసుకోవాలి" అని సీఎం రేవంత్ రెడ్డి అధికారులకు కీలక సూచనలు చేశారు.
-
పులుల గర్జనతో గ్రీన్ తెలంగాణ! నల్లమల అడవుల్లో అరుదైన రికార్డ్ -
పెళ్లికి రెడీ అయిన యంగ్ కపుల్.. -
తమిళనాడు, బెంగాల్, అసోం, కేరళలో గెలిచేది వీళ్లే? ఆత్మసాక్షి సర్వేలో..! -
లబ్దిదారులకు రెండు ఉచిత వంటగ్యాస్ సిలిండర్లు, రూ. 2,500 రీఛార్జ్ రేషన్ కార్డ్ -
బంగారం ధరల్లో వరస్ట్ డౌన్ ఫాల్- 2008 తర్వాత -
40 దేశాల్లో.. అండర్ వరల్డ్ డాన్‌గా జూనియర్ ఎన్టీఆర్ విశ్వరూపం -
కోట్లకు పడగెత్తిన విజయ్ రైట్ హ్యాండ్ -
సిమెంట్- స్టీల్ ధరలు భారీగా పెంపు, ఇక నుంచి..!? -
ఏపీ ప్రభుత్వం మరో ఎన్నికల హామీ అమలు, రేపే ప్రారంభం..!! -
తిరుపతిలో ఎయిర్ పోర్టును తలదన్నేలా..!! -
ఏపీ ప్రజలకు డిసెంబర్ లోగా మరో బహుమానం.. ఫిక్స్ చేసిన సీఎం చంద్రబాబు -
బిగ్ షాక్: ఏప్రిల్ 1 నుంచి పెరగనున్న పెట్రోల్, డీజిల్ ధరలు..












Click it and Unblock the Notifications