వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

పథకాల అమలులో తెలంగాణ దేశానికే రోల్ మోడల్.!ప్లీనరీలో కేసీఆర్ ప్రసంగంపై సర్వాత్రా ఆసక్తి.!

|
Google Oneindia TeluguNews

హైదరాబాద్ : తెలంగాణ రాష్ట్ర సమితి 21వ ఆవిర్బావ దినోత్సవాన్ని ప్రతిష్టాత్మకంగా నిర్వహించాలని గులాబీ దళపతి భావిస్తున్నట్టు తెలుస్తోంది. ప్రధానంగా కేంద్రంతో తలెత్తిన వివాదాలు, గవర్నర్ అంశంలో ఘర్షణ వాతావరణం, బీజేపి తెలంగాణ ఛీఫ్ బండి సంజయ్ పాదయాత్రలో సీఎం చంద్రశేఖర్ రావు పై చేస్తున్న ఘాటు వ్యాఖ్యలు, న్యాయపరమైన చర్యలకు వెనుకాడబోమన్న కలమలం నేతల హెచ్చరికలు, కాంగ్రెస్ దూకుడు వ్యవహారం నేపథ్యంలో నిర్వహిస్తున్న టీఆర్ఎస్ పార్టీ వ్యవస్థాపక దినోత్సవంలో సీఎం చంద్రశేఖర్ రావు ఎలా ప్రతిస్పందిస్తారనే అంశంపై సర్వత్రా ఉత్కంఠ నెలకొంది.

 వన్ షాట్ టూ బర్డ్స్ .. ప్లీనరీలో బీజేపి, కాంగ్రెస్ పార్టీలను టార్గెట్ చేయనున్న కేసీఆర్

వన్ షాట్ టూ బర్డ్స్ .. ప్లీనరీలో బీజేపి, కాంగ్రెస్ పార్టీలను టార్గెట్ చేయనున్న కేసీఆర్

తెలంగాణలో బీజేపి, టీఆర్ఎస్, కాంగ్రెస్ పార్టీలు నువ్వా నేనా అనుకుంటూ వచ్చే ఎన్నికల్లో సత్తా చాటేందుకు వ్యూహాత్మకంగా అడుగులు వేస్తున్నాయి. అధికారాన్ని నిలుపుకుని ముచ్చటగా మూడో సారి రాష్ట్రాన్ని పరిపాలించాలని గులాబీ పార్టీ ప్రణాళికలు రచిస్తుంటే, అందుకు ధీటుగా బీజేపి వ్యూహాలు రచిస్తోంది. బీజేపి తెలంగాణ అద్యక్షుడు బండి సంజయ్ అధికారంలో రావడమే లక్ష్యంగా పాదయాత్రకు కూడా శ్రీకారం చుట్టారు. గ్రామాలను, పల్లెలను చుట్టేస్తూ చంద్రశేఖర్ రావు విధానాలను ఎండగడుతున్నారు బండి సంజయ్.

 తెలంగాణ దేశానికే ఆదర్శం.. తెలంగాణలో అమలవుతున్న పథకాలు ఎక్కడా లేవంటున్న సీఎం

తెలంగాణ దేశానికే ఆదర్శం.. తెలంగాణలో అమలవుతున్న పథకాలు ఎక్కడా లేవంటున్న సీఎం

ఈ రెండు పార్టీల వ్యవహారం ఇలా ఉంటే తెలంగాణ ఇచ్చిన పార్టీగా కాంగ్రెస్ ను ఈ సారి తెలంగాణ ప్రజలు ఆదరిస్తారని కాంగ్రెస్ పార్టీ ముఖ్య నేతలు విశ్లేషిస్తున్నారు. కాంగ్రెస్, బీజేపి పార్టీల అంచనాలు తలకిందులయ్యేలా ప్లీనరీలో సీఎం చంద్రశేఖర్ రావు ఏం ప్రసంగించబోతున్నారనే అంశంపై ఆసక్తి నెలకొంది. సీఎం చంద్రశేఖర్ రావు ఎప్పుడైనా వన్ షాట్ టూ బర్డ్స్ అనే లక్ష్యంతో రాజకీయాలు నెరుపుతుంటారు. అదే కోణంలో రేపు ప్రీనరీలో చంద్రశేఖర్ రావు ఉపన్యాసం ఉంటుందని పార్టీ వర్గాలనుండి తెలుస్తోంది.

 తెలంగాణ పథకాలను అమలు చేయండి.. బీజేపి సూచించనున్న కేసీఆర్

తెలంగాణ పథకాలను అమలు చేయండి.. బీజేపి సూచించనున్న కేసీఆర్

తెలంగాణలో అమలవుతున్న పథకాల గురించి గతంలో చాలా వేదికల మీద ఎంతో గొప్పగా అభివర్ణించారు సీఎం చంద్రశేఖర్ రావు. మిషన్ భగీరథ, మిషన్ కాకతీయ, కల్యాణ లక్ష్మి, షాదీ ముబారక్, రైతు బంధు, రైతు భీమా, వృద్యాప్య పించన్, దళిత బంధు, వ్యవసాయానికి ఉచిత విద్యుత్, డబుల్ బెడ్ రూం ఇళ్లు, కేసీఆర్ కిట్, కేజీ టు పీజి ఉచిత విద్య,ఉచిత వైద్యం వంటి పధకాలతో తెలంగాణ ప్రభుత్వం ప్రజలకు సుపరిపాలన అందిస్తుందని, దేశంలో ఏ రాష్ట్రంలో ఐనా ఇలాంటి పథకాలు అమలవుతున్నాయా అని గతంలో కేంద్ర ప్రభుత్వాన్ని చంద్రశేఖర్ రావు సూటిగా ప్రశ్నించిన సందర్బాలు కూడా ఉన్నాయి.

 కాంగ్రెస్, బీజేపి అభివృద్ది గిట్టని పార్టీలు.. ప్లీనరీలో ఈ రెండు పార్టీలను టార్గెట్ చేయనున్న సీఎం

కాంగ్రెస్, బీజేపి అభివృద్ది గిట్టని పార్టీలు.. ప్లీనరీలో ఈ రెండు పార్టీలను టార్గెట్ చేయనున్న సీఎం


ప్రస్తుతం గులాబీ శ్రేణుల జెండా పండుగ రోజున కూడా ముఖ్యమంత్రి చంద్రశేఖర్ రావు ఇవే అంశాలను ప్రస్తావిస్తూ కేంద్ర బీజేపి ప్రభుత్వానికి సవాల్ విసరబోతున్నట్టు తెలుస్తోంది. తెలంగాణ ప్రభుత్వం పథకాల రూపకల్పనలో గానీ, వాటి అమలులో గానీ రాజీ పడే ప్రసక్తే లేదని, పథకాల అమలులో దేశానికే తెలంగాణ రోల్ మోడల్ గా ఉందని, కేంద్రానికి చేతనైతే తెలంగాణ అమలవుతున్న పధకాలను బీజేపి పాలిత రాష్ట్రాల్లో అమలు చేయాలని సవాల్ విసరనున్నారు. ఇదే అంశం పట్ల ప్లీనరీలో చంద్రశేఖర్ రావు ప్రసంగించనున్నట్టు తెలుస్తోంది. దేశంలో గరీబీ హటావో అన్న కాంగ్రెస్ పార్టీకి పేదరికాన్ని రూపుమాపేందుకు ఇంకెన్ని సంవత్సరాలు కావాలని నిలదీసే అవకాశం ఉంది. అంటే గులాబీ పార్టీ వ్యవస్ధాపక దినోత్సవం రోజున బీజేపి, కాంగ్రెస్ రెండు జాతీయ పార్టీలను ఇరుకున పెట్టే విధంగా చంద్రశేఖర్ రావు ప్రసంగం ఉండబోతున్నట్టు చర్చ జరుగుతోంది.

English summary
There is an interest in what CM Chandrasekhar Rao is going to address in the plenum to upset the expectations of the Congress and BJP parties. CM Chandrasekhar Rao has always taught politics with the goal of one shot to two birds. It is learned from party sources that Chandrasekhar Rao will address the Prenari tomorrow in the same vein.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X