TSRTC: దసరా సందర్భంగా ప్రయాణికులకు శుభవార్త.. టికెట్లపై 10 శాతం రాయితీ ఇవ్వనున్న ఆర్టీసీ..TSRTC: దసరా సందర్భంగ

తెలంగాణ ఆర్టీసీ ప్రయాణికులకు శుభవార్త చెప్పింది. దసరా సందర్భంగా ముందస్తు టికెట్ బుక్ చేసుకునే వారికి 10 శాతం రాయితీ ఇస్తున్నట్లు ప్రకటన చేసింది. అక్టోబర్ 15 నుంచి 29 వరకు ఆర్టీసీలో అప్ అండ్ రెండూ ఒకేసారి టికెట్లు బుక్ చేసుకుంటే తిరుగు ప్రయాణంలో టికెట్ పై 10 శాతం రాయితీ ఇవ్వనున్నట్లు తెలిపింది. సెప్టెంబర్ 30వ తేదీలోపు టికెట్ రిజర్వేషన్ చేసుకున్న వారికి ఈ డిస్కౌంట్ వర్తిస్తుందని ఆర్టీసీ పేర్కొంది.

సుదూర ప్రాంతాలకు వెళ్లే ప్రయాణికులు ఈ రాయితీ సదుపాయాన్ని ఉపయోగించుకోవాలని టీఎస్‌ఆర్టీసీ ఎండీ వీసీ సజ్జనార్‌ కోరారు. టికెట్లను ముందస్తు రిజర్వేషన్ల కోసం ఆర్టీసీ అధికారిక వెబ్‌సైట్‌ సందర్శించాలని కోరారు. మరోవైపు దసరాకు విలునైన్ని ఎక్కువ బస్సుల నడపాలని ఆర్టీసీ యోచిస్తోంది. ముఖ్యంగా హైదరాబాద్ నుంచి వివిధ జిల్లాలకు బస్సుల సంఖ్య పెంచాలని భావిస్తోంది. అటు ఏపీకి కూడా బస్సులు పెంచే అవకాశం ఉంది.

Telangana RTC has announced 10 percent discount if you book tickets for Dussehra

గత నెలలో రాఖీ సందర్భంగా ఆర్టీసీకి భారీగా ఆదాయం వచ్చింది. ఆగస్టు 31న రూ. 22.65 కోట్ల ఆదాయం సమకూరింది. ఆర్టీసీ చ‌రిత్ర‌లో ఇదే ఆల్‌టైమ్ రికార్డుగా ఉంది. గ‌తేడాది రాఖీ పండుగ రోజున రూ. 21.66 కోట్ల ఆదాయం వ‌చ్చింది. ఈ సారి రూ. కోటి వ‌ర‌కు అద‌నంగా ఆదాయం వచ్చిన సంగతి తెలిసిందే. ఆగస్టు 30న తెలంగాణ వ్యాప్తంగా 9 వేల బస్సులు నడపగా.. రూ.18.25 కోట్ల ఆదాయం వచ్చినట్లు ఆర్టీసీ అధికారులు అప్పుడే ప్రకటించారు.

రాఖీ పండుగ రోజు 40.91 ల‌క్ష‌ల మంది ప్ర‌యాణికులు ఆర్టీసీ బ‌స్సుల్లో ప్ర‌యాణించారని. గ‌తేడాదితో పోల్చితే అద‌నంగా ల‌క్ష మంది రాక‌పోక‌లు చేశారు వివరించారు. ఆక్యుపెన్సీ రేషియో విష‌యంలో ఉమ్మ‌డి న‌ల్ల‌గొండ జిల్లా గ‌తేడాది రికార్డును అధిగ‌మించింది. దసరా కూడా భారీగా ప్రయాణికులు ఆర్టీసీలో ప్రయాణించే అవకాశం ఉంది ఈ నేపథ్యంలోనే ఆర్టీసీ అప్ అండ్ డౌన్ టికెట్లు బుక్ చేసుకుంటే 10 శాతం రాయితీ ఇస్తామని వెల్లడించింది.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+