తెలంగాణాలో అధికార కాంగ్రెస్ ఆందోళనల బాట.. ఎందుకంటే!

మహాత్మా గాంధీ జాతీయ ఉపాధి హామీ చట్టం పథకాన్ని పేరు మారుస్తూ కేంద్రం తీసుకున్న నిర్ణయంపైన కాంగ్రెస్ పార్టీ మండిపడుతుంది. జాతీయ ఉపాధి హామీ చట్టం పథకంలో మహాత్మా గాంధీ పేరును తొలగించి వికసిత్ భారత్ జి.రామ్.జి పేరు తో కొత్త పథకాన్ని తెస్తూ బిజెపి నిర్ణయం తీసుకోవడంపైన కాంగ్రెస్ ఆగ్రహం వ్యక్తం చేస్తుంది. పేరు జాతీయ ఉపాధి హామీ పథకాన్ని 2005లో యూపీఏ ప్రభుత్వం తీసుకువచ్చింది.

రాష్ట్ర వ్యాప్తంగా అధికార కాంగ్రెస్ నిరసనలు
తమ హయాంలో తీసుకువచ్చిన ఈ చట్టం నుండి మహాత్మా గాంధీ పేరును తొలగించడం కావాలని బిజెపి చేస్తున్న కుట్ర అని , కేంద్రంలో అధికారంలో ఉన్న బిజెపి తీరును నిరసిస్తూ ఏఐసీసీ పిలుపు మేరకు రాష్ట్ర వ్యాప్తంగా నిరసన కార్యక్రమాలు చేపట్టాలని టీపీసీసీ అధ్యక్షులు మహేష్ కుమార్ గౌడ్ క్యాడర్ కు పిలుపునిచ్చారు. ఈ క్రమంలో రేపు, ఎల్లుండి తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా నిరసనలకు అధికార పార్టీ శ్రీకారం చుట్టింది.

telangana ruling party protests Against BJP Over Removal of Mahatma Gandhi Name in MGNREGA

Take a Poll

రేపు హైదరాబాద్ లో నిరసనలు
రేపు శనివారం నాడు హైదరాబాద్ గాంధీ ఆసుపత్రి దగ్గర ఉన్న గాంధీవిగ్రహం వద్ద టీపీసీసీ ఆధ్వర్యంలో నిరసన కార్యక్రమం నిర్వహించనున్నారు. జాతీయ ఉపాధి హామీ పథకానికి మహాత్మా గాంధీ పేరు నే కొనసాగించాలని ప్రధానంగా డిమాండ్ చేయనున్నారు. రేపు శనివారం ఉదయం 10గంటలకు సికింద్రాబాద్ లోని గాంధీ ఆసుపత్రి వద్ద ఉన్న మహాత్మగాంధీ విగ్రహం వద్ద మహాత్మ గాంధీ చిత్రపటాలతో బీజేపీ ప్రభుత్వంపై నిరసన వ్యక్తం చేస్తూ ప్రదర్శన చేయనున్నారు.

ఎల్లుండి జిల్లాలలో నిరసనలు
ఎల్లుండి జిల్లాలలో నిరసన కార్యక్రమాలు నిర్వహించి బిజెపి తీరును ఎండగట్టాలని కాంగ్రెస్ నేతలు నిర్ణయించారు. రాష్ట్రవ్యాప్తంగా అన్ని జిల్లాలలో ఆదివారం నాడు మహాత్మా గాంధీ చిత్రపటాలతో కార్యక్రమాలు నిర్వహించనున్నారు. కార్యకర్తలు, నాయకులు, అభిమానులు పెద్ద ఎత్తున పాల్గొని బీజేపీ ప్రభుత్వ కుట్రలను తిప్పికొట్టాలని టిపిసిసి అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్ క్యాడర్ కు పిలుపునిచ్చారు. దీంతో రేపు, ఎల్లుండి తెలంగాణ రాష్ట్రంలో అధికార కాంగ్రెస్ నిరసన కార్యక్రమాలను నిర్వహించనుంది. ఇప్పటికే దేశ వ్యాప్తంగానూ కాంగ్రెస్ ఈ నిర్ణయం పట్ల తమ నిరసన వ్యక్తం చేస్తుంది.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+