ప్రభుత్వ స్కూళ్లకు మహార్దశ.. సీఎం రేవంత్ సంచలన నిర్ణయం

తెలంగాణలో విద్యావ్యవస్థను పటిష్టం చేసేందుకు రాష్ట్ర ప్రభుత్వం సంచలన నిర్ణయాలు తీసుకుంటోంది. జూన్ 12న తెలంగాణ వ్యాప్తంగా పాఠశాలలు ప్రారంభం కావడంతో విద్యా వ్యవస్థపై రేవంత్ సర్కార్ దృష్టి సారించింది. తాజాగా ప్రభుత్వ పాఠశాలల్లో ఎల్ కేజీ, యూకేజీ, ప్రీ ప్రైమరీ క్లాసులు ప్రారంభించింది. ఈ విద్యా సంవత్సరం నుంచే ఈ విధానం అమలు కానుంది.

రాష్ట్రంలో ఈ ఏడాది కొత్తగా 571 పాఠశాలలు నిర్మించనున్నట్లు సీఎం రేవంత్ రెడ్డి తెలిపారు. జూన్ 12 నుంచి పాఠశాలలు ప్రారంభం అయిన నేపథ్యంలో కమాండ్‌ కంట్రోల్‌ కార్యాలయంలో విద్యాశాఖ అధికారులతో సీఎం రేవంత్ ఉన్నతస్థాయి సమీక్ష నిర్వహించారు. ఈ మేరకు అధికారులకు పలు సూచనలు చేశారు.

ప్రభుత్వ పాఠశాలల్లో మౌలిక వసతులను కల్పించి.. విద్యా ప్రమాణాలను పెంచడమే లక్ష్యమని సీఎం రేవంత్ అన్నారు." తెలంగాణ రాష్ట్రంలో ఈ ఏడాది కొత్తగా 571 పాఠశాలలను నిర్మించనున్నాం. ప్రతి విద్యార్థికి నాణ్యమైన విద్య అందించేందుకు కృషి చేస్తున్నాం. విద్యా ప్రమాణాలను పెంచడమే తమ ప్రభుత్వ లక్ష్యం. పాఠశాలల్లో మౌలిక వసతులు, ఉపాధ్యాయులకు శిక్షణ, ఇతర సదుపాయాల కల్పనకు ఎంత ఖర్చయినా వెనుకాడేది లేదు. రాష్ట్రంలో 20 మంది కన్నా ఎక్కువ పిల్లలున్న గ్రామాలు, పట్టణాల్లో ఈ ఏడాది కొత్తగా 571 పాఠశాలలను ప్రారంభిస్తున్నాం. విద్యార్థులకు విషయ పరిజ్ఞానంతో పాటు నైపుణ్యాలను పెంచాలి" అని సీఎం రేవంత్ రెడ్డి తెలిపారు.

రాష్ట్రంలో నూతనంగా నిర్మించనున్న పాఠశాలలను హెచ్‌ఎండీఏ, మున్సిపల్‌ లేఅవుట్లు, ప్రజా అవసరాల కోసం కేటాయించిన స్థలాల్లో పాఠశాలలు ఏర్పాటు చేయాలని అధికారులను సీఎం రేవంత్ రెడ్డి ఆదేశించారు. పాఠశాల స్థాయి నుంచే పిల్లలకు స్కిల్స్ పై అవగాహన కల్పించాలని తెలిపారు. అంతేకాక ప్రతి పాఠశాలలో నిర్దిష్టమైన సంఖ్యలో విద్యార్థులు ఉండేలా చూసుకోవాలని సీఎం ఆదేశాలు జారీ చేశారు. సీఎం రేవంత్ రెడ్డి నిర్వహించిన ఈ సమీక్షలో రాష్ట్ర ప్రభుత్వ స‌ల‌హాదారులు వేం న‌రేంద‌ర్ రెడ్డి, కే. కేశ‌వ‌రావు, సీఎంఓ, విద్యా శాఖ ఉన్నతాధికారులు పాల్గొన్నారు.

Telangana s Education Leap CM Revanth Reddy Announces 571 New Schools for 2025

మరోవైపు తెలంగాణలో జూన్ 10 నుంచి అంగన్ వాడీ కేంద్రాలు ప్రారంభం అయ్యాయి. చిన్నారులకు తెలంగాణ ప్రభుత్వం, అంగన్వాడీ టీచర్లు, హెల్పర్లు గ్రాండ్ వెల్ కమ్ చెప్పారు. మొదటి రోజు ఎగ్ బిర్యానీని చిన్నారులు తిన్నారు. మహిళా శిశు సంక్షేమ శాఖ మంత్రి సీతక్క ఆదేశాల మేరకు తొలి రోజు పిల్లలకు ఎగ్ బిర్యానీ పెట్టారు. అంగన్ వాడీ కేంద్రాల్లో ఎగ్ బిర్యానీ పెట్టడం తెలంగాణ చరిత్రలో ఇదే మొదటిసారని పలువురు అభిప్రాయపడుతున్నారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+