Unesco Heritage: తెలంగాణకు మరో యునెస్కో గుర్తింపు.. నిలువు రాళ్లకు చోటు.. అంత ప్రత్యేకత ఏంటి?
Unesco Heritage: యునెస్కో వారసత్వ జాబితాలో తెలంగాణలోని రామప్ప ఆలయం 2021లో చోటు దక్కించుకున్న సంగతి తెలిసిందే. ఇప్పుడు నారాయణపేట జిల్లాలోని ముడమాల్ నిలువురాళ్లు ఆ జాబితాలో చోటు దక్కించుకునేందుకు ఓ అడుగుదూరంలో ఉన్నాయి. తెలంగాణలోని నారాయణపేట జిల్లాలోని ముడమాల్ మెగాలిథిక్ మెన్‌హిర్లు లేదా నిలబడి ఉన్న రాళ్లు సుమారు 3,500 నుంచి 4,000 సంవత్సరాల నాటివి. భారత్ నుంచి యునెస్కో ప్రపంచ వారసత్వ ప్రదేశాల తాత్కాలిక జాబితాలో చేర్చబడ్డాయి. భవిష్యత్‌లో యునెస్కో గుర్తింపు కోసం నామినేట్ చేయాలనుకుంటున్న ముఖ్యమైన వారసత్వ ప్రదేశాల జాబితాగా ఈ తాత్కాలిక జాబితా పని చేస్తుంది. యునెస్కో వారసత్వం ట్యాగ్ కోసం స్థలాన్ని పరిగణించే ముందు తాత్కాలిక జాబితాలో చేర్చడం తప్పనిసరి దశ కావడం గమనార్హం.
ముడమాల్ నిలువు రాళ్లు ఆదిమ మానవుల ఖగోళ పరిజ్ఞానానికి నిలువెత్తు నిదర్శనమని పరిశోధకలు చెబుతున్నారు. శిలాయుగంలో వాతావరణ మార్పులు, రుతువులు, కాలాలను గుర్తించడానికి ఆదిమ మానవులు వీటిని ఏర్పాటు చేసుకున్నట్లు తెలుపుతున్నారు. ముడమాల్ యునెస్కో ప్రపంచ వారసత్వం ట్యాగ్ ను తీసుకొచ్చేందుకు తాము ప్రయత్నాలు చేస్తున్నట్లు ప్రొఫెసర్ కేపీ రావు వెల్లడించారు. ప్రపంచ వారసత్వ ట్యాగ్ కోసం ప్రతిపాదనను ఇప్పటికే భారత పురావస్తు సర్వేకు పంపినట్లు తెలిపారు. 2025లో యునెస్కో ప్రపంచ వారసత్వ కేంద్ర భారతదేశ తాత్కాలిక జాబితాలో ఆరు ఆస్తులలో ముడమాల్ నిలువు రాళ్లు ఒకటి. మిగిలిన ఐదు ఆస్తులు ఛత్తీస్‌గఢ్ లోని కంగేర్ వ్యాలీ నేషనల్ పార్క్, పలు రాష్ట్రాలలోని అశోకన్ ఎడిక్ట్ సైట్లు, మధ్యప్రదేశ్,ఒడిశాలోని చౌసత్ యోగిని దేవాలయాలు, పలు రాష్ట్రాలలోని గుప్త దేవాలయాలు, మధ్యప్రదేశ్-ఉత్తరప్రదేశ్ లో బుందేలా ప్యాలెస్ కోటలు ఉన్నాయి. కేంద్ర ప్రభుత్వం ఫిబ్రవరి 11న యునెస్కో వారసత్వ సదస్సుకు ముడమాల్ నిలువురాళ్లపై పత్రాలు సమర్పించింది. భారత్ నుంచి ఇప్పుడు 62 స్థలాలు తాత్కాలిక జాబితాలో ఉన్నాయి.

హైదరాబాద్ విశ్వవిద్యాలయం ప్రొఫెసర్ కేపీ రావు ప్రకారం.. 3,500 ఏళ్ల నాటి ముడమాల్ నిలువురాళ్ల దక్షిణ భారతదేశలోం అతిపెద్ద మెగాలిథక్ యుగం శ్మశానవాటికగా ఉండవచ్చని పేర్కొన్నారు. రాష్ట్ర పురావస్తు శాఖ మాజీ డైరెక్టర్ కేపీ రావు 2003 నుంచి నిలువురాళ్లపై పరిశోధన చేస్తున్నారు. అంతర్జాతీయ వేదికలలో అనేత పరిశోధనా పత్రాలను సమర్పించారు. పురావస్తు ఔచిత్యంతో పాటు ఈ రాళ్లకు ఖగోళ ప్రాముఖ్యత కూడా ఉందని ఆయన చెప్పారు. నిలువు రాళ్లతో పాటు.. వృత్తాకార నిర్మాణాలలో ఉంచబడిన చిన్న రాళ్లు, 80 ఎకరాల విస్తీర్ణంలో కొన్ని అమరికలలో ఉంచబడినట్లు కనిపించే వేలాది బండరాళ్లు కూడా ఉన్నాయి. ఇవన్నీ ఆ ప్రదేశం ప్రత్యేకతను సూచిస్తాయి. 10 నుంచి 14 అడుగుల ఎత్తు ఉన్న 80 నిలువురాళ్లు ఉన్నాయి. ఈ రాళ్లను 20 నుంచి 25 అడుగుల దూరంలో వరుసగా అమర్చబడి ఉన్నాయి.
స్థానికంగా ఉండే ముడమాల్ గ్రామస్థులు.. స్థానిక దేవతను కొందరు అగౌరవపరిచిన తర్వాత రాళ్లుగా మారిపోయారని నమ్ముతారు. కాలక్రమేణా స్థానిక సమాజాలు ఈ రాళ్లను వారి సాంస్కృతిక వారసత్వంతో ముడిపెట్టాయి. వాటిని వారి నమ్మకాలు, ఆచారాలలో చేర్చారు. స్థానిక ప్రజలు ఈ రాళ్లను పవిత్రంగా భావిస్తున్నారు. వారు వాటిని "నిలువురాళ్ల తిమ్మప్ప" అని పిలుస్తున్నారు. ఓ ప్రత్యేక ఆకారంలో ఉన్న రాయిని ఎల్లమ్మగా పూజిస్తున్నారు. రాళ్లకు, స్థానిక నమ్మకాలకు మధ్య ఉన్న ఈ సంబంధం ఆ ప్రాంతం యొక్క సాంస్కృతిక ప్రాముఖ్యతను ప్రదర్శిస్తుంది.
-
రేషన్ లబ్దిదారులకు కేంద్రం గుడ్ న్యూస్- మూడు నెలల కోటా ఒకేసారి పంపిణీ -
బంగారం ధరల అంచనాలు తలకిందులు -
మేషరాశి, సింహరాశి, వృశ్చిక రాశి, ధనుస్సు రాశులకు ఏప్రిల్ నెలలో రాజయోగం -
బంగాళాఖాతంపై ఆవర్తనం- ఏపీలోని ఈ జిల్లాల్లో భారీ వర్షాలు -
తులారాశి వార్షిక ఫలం 2026-27: ఈ ఏడాది వీరికి తిరుగేలేదు.. ఈ విషయంలో జాగ్రత్త! -
త్వరలో తిరుపతి, హైదరాబాద్కు నేరుగా రైళ్లు: ఆ జిల్లాకు కేంద్రమంత్రి తీపికబురు! -
రామ్ చరణ్ బర్త్ డేకు బిగ్ సర్ ప్రైజ్: `పెద్ది` నుంచి -
తిరుమలలో సీఎం చంద్రబాబుకు భక్తుల స్పెషల్ రిక్వెస్ట్, అక్కడే ఆదేశాలు..!! -
మహేష్ బాబు కాకుండా ఆ హీరో అంటే చాలా ఇష్టం - కృష్ణ -
ఇరాన్ కు ట్రంప్ డెడ్ లైన్- కౌంట్ డౌన్ బిగిన్స్ -
'ధురంధర్' యలీనా గుట్టురట్టు: నిజమా.. కల్పితమా? -
ఎట్టకేలకు జీవన్ రెడ్డి చేరే పార్టీ ఖరారు, అదే బాటలో..!!












Click it and Unblock the Notifications