బస్సులెవ్.. కానీ బడికి పోవాలే: రెయిలింగ్ పై నిల్చుని వేలాడుతూ (వీడియో)
తెలంగాణలో మహిళలకు ఉచిత బస్సు పథకం అమలులో ఉంటోంది. రాష్ట్రంలో ఏ మూల నుంచి ఏ మూలకైనా టీజీఎస్ఆర్టీసీ ఆర్డినరీ, ఎక్స్ ప్రెస్ మహిళలు, విద్యార్థినులు.. ఉచితంగా ప్రయాణం సాగించవచ్చు. దీనికోసం రూపొందించిన మహాలక్ష్మి పథకం 2023 డిసెంబర్ లో అమలులోకి వచ్చింది. ఈ పథకం అమలులోకి వచ్చి రెండు సంవత్సాలు దాటిపోయినప్పటిెకీ.. చాలినన్ని బస్సులను అందుబాటులోకి తీసుకుని రావడంలో ప్రభుత్వం విఫలమైందనే ఆరోపణలు చాలాకాలం నుంచీ వినిపిస్తోన్నాయి.
ఈ ఆరోపణలకు మరింత బలాన్ని ఇచ్చే ఉదంతం తాజాగా నారాయణపేట్ జిల్లాలోని మద్దూరు మండలంలో చోటు చేసుకుంది. మద్దూరులో కొందరు పాఠశాల విద్యార్థులు అత్యంత ప్రమాదకరంగా ప్రయాణం సాగించడానికి సంబంధించిన వీడియో క్లిప్ ఒకటి సోషల్ మీడియాలో హల్ చల్ చేస్తోంది. బస్సులు అందుబాటులో లేకపోవడం వల్ల సమయానికి పాఠశాలకు వెళ్లాలనే ఉద్దేశంతో ఓ ప్రైవేట్ వాహనం ఎక్కారు.

అందులో స్థలం చాలకపోవడంతో దాని వెనుక వైపు ఉన్న రెయిలింగ్ పై నిల్చుని వేలాడుతూ ప్రయాణించారు. ఒకవైపు పుస్తకాల బ్యాగ్ బరువు, మరోవైపు కనీసం నిల్చోడానికి కూడా కష్టంగా అనిపించే రెయిలింగ్ పై అష్టకష్టాలు పడుతూ ఆ పిల్లలు స్కూల్ కు బయలుదేరి వెళ్లారు. ఇబ్బందులు పడుతూ వారు ప్రయాణించడం ఈ వీడియోలో స్పష్టంగా రికార్డయింది. వారిలో విద్యార్థినులే అధికంగా ఉన్నారు. ఇలా వేలాడుతున్న ఆ పిల్లల వాహనం పక్కనుంచే ఓ మారుతి వ్యాన్ దూసుకెళ్లడం ఇందులో చూడొచ్చు.
On time to school, dangling between life and death.
— Ashish (@KP_Aashish) January 5, 2026
School girls in Narayanapet’s Maddur mandal are seen dangerously dangling from a Bolero reportedly due to a lack of buses. While safety is ignored many ask if remedial action will come only after a tragedy? #Telangana pic.twitter.com/aCEpQYoFeD
ఈ ప్రయాణం నెటిజన్లను ఆందోళనకు గురి చేసింది. పాఠశాలలు తెరిచే సమయానికి బస్సులు అందుబాటులో లేకపోవడం, సర్వీసుల కొరత వల్లే ఇలా ప్రాణాలకు తెగించి ప్రయాణిస్తున్నామని విద్యార్థులు చెబుతున్నారు. అధికారులు స్పందించి అదనపు బస్సులు ఏర్పాటు చేయాలని వారి తల్లిదండ్రులు కోరుతున్నారు. ఉదయం, సాయంకాలం వేళ పాఠశాల సమయానికి అనుగుణంగా బస్సు సర్వీసులు అందుబాటులో ఉండేలా చర్యలు తీసుకోవాలని చెబుతున్నారు.
-
తులా రాశి, వృశ్చిక రాశి ఏప్రిల్ నెల జాతక ఫలం -
సికింద్రాబాద్ స్టేషన్ సిద్దం, ప్రధాని మోదీ ప్రారంభం - ముహూర్తం ఫిక్స్..!! -
తెలంగాణ నుంచి తిరుపతి వెళ్లే వారికి గుడ్ న్యూస్.. అందుబాటులోకి కొత్త ఎన్ హెచ్ 565 -
బంగారం ధరలు అధోగతి- కనీవినీ ఎరుగనంత పతనం -
PM Modi: అన్నింటికీ సిద్దం అయిపోండి..! ప్రధాని మోడీ షాకింగ్ పిలుపు..! -
సికింద్రాబాద్- విశాఖ ఎక్స్ ప్రెస్ ఇక విజయవాడ వెళ్లదు- డైవర్షన్ రూట్ -
ప్రతీ ఇంటికీ రెండు ఫ్రీ గ్యాస్ సిలెండర్లు-ఇరాన్ వార్ వేళ సర్కార్ ఆఫర్..! -
రైతు భరోసా నిధులు జమ కాలేదా, ఇలా చేయండి- వెంటనే..!! -
మకరరాశి వార్షిక జాతకం ఇలా.. ఈ ఏడాది విశేష లాభాలు! -
ఏపీలో ఉద్యోగులకు సర్కార్ గుడ్ న్యూస్..! ఇకపై ఈ మార్పు..! -
తమిళనాడులో సీన్ రివర్స్-తాజా సర్వేలో హోరాహోరీ-ఎడ్జ్ మాత్రం..! -
విజయ్‌కు షాకిచ్చిన సర్వే!: ఆ పార్టీకి 180+ సీట్లు












Click it and Unblock the Notifications