అమావాస్య వేళ తెరుచుకుంటున్న స్కూల్స్! ఆర్టీసీ స్పెషల్ బస్సులు

తెలంగాణ రాష్ట్రవ్యాప్తంగా రేపటి (సోమవారం) నుంచి పాఠశాలలు తిరిగి ప్రారంభం కానున్నాయి. షెడ్యూల్ ప్రకారం జూన్ 12 వరకే వేసవి సెలవులు ఉన్నప్పటికీ.. రాష్ట్రంలో ఎండల తీవ్రత దృష్ట్యా ప్రభుత్వం సెలవులను నేటి (ఆదివారం) వరకు పొడిగించిన సంగతి తెలిసిందే. దీంతో సుదీర్ఘ వేసవి సెలవుల అనంతరం విద్యార్థులు రేపటి నుంచి మళ్లీ పాఠశాలల బాట పట్టనున్నారు. ఒకవైపు విద్యాశాఖ, మరోవైపు రవాణా శాఖ విద్యార్థుల కోసం అన్ని ఏర్పాట్లు పూర్తి చేశాయి.

పాఠశాలలు ప్రారంభమవుతున్న నేపథ్యంలో విద్యార్థుల సురక్షిత ప్రయాణానికి అన్ని రకాల చర్యలు చేపట్టినట్లు తెలంగాణ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ (TGSRTC) మేనేజింగ్ డైరెక్టర్ వై. నాగిరెడ్డి తెలిపారు. ఈ విద్యాసంవత్సరంలో ఉండబోయే 227 పనిదినాల్లో.. పాఠశాలల వేళలకు అనుగుణంగా అన్ని రూట్లలో ప్రత్యేక బస్సులను నడపనున్నట్లు ఆయన వెల్లడించారు. ముఖ్యంగా హైదరాబాద్‌తో పాటు రాష్ట్రవ్యాప్తంగా విద్యార్థులు ఎక్కువగా ప్రయాణించే రూట్లను పునరుద్ధరించామని, ఉదయం, సాయంత్రం వేళల్లో అదనపు బస్సులను అందుబాటులో ఉంచాలని అధికారులను ఆదేశించినట్లు చెప్పారు. విద్యార్థులు ఎలాంటి ఇబ్బందులు లేకుండా సురక్షితంగా స్కూళ్లకు చేరుకునేలా ఆర్టీసీ సిబ్బంది పర్యవేక్షించనున్నారు.

Telangana Schools Reopen Tomorrow TGSRTC Deploys Special Student Buses Across All Major Routes
దసరా, సంక్రాంతి సెలవులు లిస్ట్ వచ్చేసింది. అకడమిక్ క్యాలెండర్ ఇదే
దసరా, సంక్రాంతి సెలవులు లిస్ట్ వచ్చేసింది. అకడమిక్ క్యాలెండర్ ఇదే

రేపటి నుంచే పాఠ్యపుస్తకాల పంపిణీ.. సిద్ధమైన విద్యాశాఖ

కొత్త విద్యాసంవత్సరం మొదటి రోజు నుంచే విద్యార్థులకు పాఠ్యపుస్తకాలు, నోట్ బుక్స్ పంపిణీ చేసేందుకు విద్యాశాఖ పక్కా ఏర్పాట్లు చేసింది. ఇప్పటికే దాదాపు 80 శాతం పుస్తకాలు అన్ని ప్రభుత్వ పాఠశాలలకు చేరుకున్నాయి. ఇక ప్రభుత్వం అందించే ఉచిత యూనిఫామ్స్, షూస్‌తో కూడిన 'ఎడ్యుకేషన్ కిట్'ను ఈ నెలాఖరులోగా విద్యార్థులకు పంపిణీ చేసే అవకాశం ఉందని అధికారులు అంచనా వేస్తున్నారు.

Schools closed news: రాష్ట్ర ప్రభుత్వం కీలక నిర్ణయం.. మరోసారి వేసవి సెలవులు పొడిగింపు..
Schools closed news: రాష్ట్ర ప్రభుత్వం కీలక నిర్ణయం.. మరోసారి వేసవి సెలవులు పొడిగింపు..

పేరెంట్స్‌ను వేధిస్తున్న అమావాస్య, మంగళవారం సెంటిమెంట్లు!

ఇదిలా ఉంటే, స్కూళ్ల ప్రారంభం రోజునే తల్లిదండ్రులను ఒక విచిత్రమైన సెంటిమెంట్ వేధిస్తోంది. రేపు సోమవారం 'అమావాస్య' కావడంతో, మొదటి రోజే పిల్లలను బడికి పంపడానికి కొందరు పేరెంట్స్ సంకోచిస్తున్నారు. పోనీ మరుసటి రోజు (మంగళవారం) పంపుదామా అంటే.. సాధారణంగా మంగళవారాన్ని కొత్త పనులకు శుభప్రదమైన రోజుగా భావించరు. దీంతో అటు అమావాస్య, ఇటు మంగళవారం సెంటిమెంట్ల కారణంగా చాలామంది తల్లిదండ్రులు తమ పిల్లలను నేరుగా బుధవారం (జూన్ 17) నుంచి పాఠశాలలకు పంపాలని భావిస్తుండటం గమనార్హం. దీనివల్ల మొదటి రెండు రోజులు పాఠశాలల్లో హాజరు శాతం కాస్త తక్కువగా ఉండే అవకాశం కనిపిస్తోంది.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+