వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

కేసీఆర్ సర్కారుకు మళ్లీ షాక్.. సచివాలయం కూల్చివేత ఇంకా ఆలస్యం.. స్టే పొడగించిన హైకోర్టు..

|
Google Oneindia TeluguNews

సచివాలయం కూల్చివేత అంశంలో దూకుడు ప్రదర్శించిన కేసీఆర్ సర్కారుకు మరోసారి ఎదురుదెబ్బ తగిలింది. సచివాలయం కూల్చివేత పనులు నిలిపేయాలంటూ హైకోర్టు గతంలో జారీ చేసిన స్టే ఉత్తర్వులను మరికొంతకాలానికి పొడిగించింది. దీంతో పనులు ఇంకా ఆలస్యం కానున్నాయి. అంతేకాదు, సెక్రటేరియట్ కూల్చివేతకు సంబంధించి కేబినెట్ తీసుకున్న నిర్ణయాన్ని, విధివిధానాలు ఫాలో అయింది, లేనిది కూడా ఉన్నతన్యాయస్థానం పరిశీలించనున్నది.

సచివాలయం కూల్చివేత పనులను సోమవారం దాకా నిలిపేయాలంటూ జస్టిస్ ఆర్ఎస్ చౌహాన్, జస్టిస్ విజయ్ సేన్ రెడ్డి నేతృత్వంలోని ధర్మాసనం గత శుక్రవారం ఆదేశాలిచ్చింది. ఇవాళ్టి విచారణలో.. భవనాల కూల్చివేత అనుమతులపై రాష్ట్ర ప్రభుత్వం దాఖలు చేసిన కౌంటర్‌ను పరిశీలించిన జడ్జిలు.. పిటిషనర్ వాదనకే మొగ్గుచూపుతూ.. స్టే ఉత్తర్వులను ఈనెల 15 వరకు పొడగించారు. తదుపరి విచారణను కూడా అదే రోజుకు వాయిదా వేశారు.

కొవిడ్-19: హైదరాబాద్‌లో హైరిస్క్ జోన్లు ఇవే.. 100కుపైగా కంటైన్మంట్లకు అధికారుల కసరత్తు..

telangana secretariat demolition: high court extends stay order until 15th july

కూల్చివేత పనుల్లో నిబంధనలు పాటించడం లేదని, అసలు కేబినెట్ తీసుకున్న నిర్ణయంలోనే లోపాలున్నాయంటూ ప్రొఫెసర్ పీఎల్ విశ్వేశ్వరరావు హైకోర్టును ఆశ్రయించడంతో తాజా పరిణామాలు చోటుచేసుకున్నాయి. కూల్చివేతు సంబంధించి కేబినెట్ తీసుకున్న నిర్ణయం తాలూకు వివరాలను సీల్డ్ కవర్ లో సమర్పించాల్సిందిగా జడ్జిలు ఆదేశించారు. మొత్తంగా సచివాలయ భవనాల కూల్చివేత ప్రక్రియ మరింత ఆలస్యం కానుంది.

పాత సచివాలయ భవనాల్లో పార్కింగ్ మొదలుకొని వీడియో కాన్ఫరెన్స్, మీటింగ్ హాల్స్, ఫైళ్ల తరలింపు లాంటి సౌకర్యాలేవీ సరిగా లేవని, అవి గ్రీన్ బిల్డింగ్ ప్రమాణాలకు లోబడి లేవన్న ఉద్దేశంతో వాటిని కూల్చేసి కొత్త భవంతుల్ని నిర్మించాలని సీఎం కేసీఆర్ నిర్ణయించారు. పలు అడ్డంకుల్ని దాటుకుని, గత వారమే కూల్చివేతకు గ్రీన్ సిగ్నల్ లభించగా పనులు మొదలయ్యాయి.

Recommended Video

తెలంగాణ కాంగ్రెస్‌ సీనియర్ నాయకుడు, టీపీసీసీ కార్యదర్శి జీ నరేందర్ యాదవ్ కరోనా వైరస్‌కు బలి!

కానీ అంతలోనే అదే హైకోర్టు.. కూల్చివేతపై స్టే ఇచ్చింది. ఇప్పుడా స్టేను మరో రెండ్రోజులు పొడగించింది. హుస్సేన్ సాగర్ క్యాచ్ మెంట్ ఏరియాలో ఉన్న ఆ ప్రాంతంలో కాంక్రీట్ నిర్మాణం అసాధ్యమని, అందుకు ఏ చట్టమూ అంగీకరించదని, ప్రసాద్ ఐమాక్స్ సహా ట్యాంక్ బండ్ చుట్టుపక్కలున్నవన్నీ తాత్కాలిక నిర్మాణాలేనన్న సంగతి తెలిసి కూడా కేసీఆర్ సర్కారు దూకుడు ప్రదర్శిస్తున్నదని ప్రతిపక్షనేతలు విమర్శిస్తున్నారు.

English summary
Telangana High Court on Monday extended the stay over the demolition of TS secretariat till July 15, initially the stay was till July 13.. Though Government had filed reply before the court but a bench comprising Chief Justice Raghavendra Singh Chauhan and Justice B Vijay Sen Reddy after hearing the argument of the petitioner’s counsel extended stay.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X