మెక్ డొనాల్డ్స్ కంపెనీతో తెలంగాణ ప్రభుత్వం డీల్.. భారీగా పెట్టుబడులు

రాష్ట్రంలోని యువతీ యువకులకు ఉద్యోగ, ఉపాధి అవకాశాలను పెంచి నిరుద్యోగాన్ని రూపుమాపేందుకు తెలంగాణ ప్రభుత్వం అడుగులు వేస్తోంది. ఇప్పటికే గ్రూప్స్ ఫలితాలు విడుదల చేసింది. కొత్త నోటిఫికేషన్స్ ను విడుదల చేసేందుకు కసరత్తులు చేస్తోంది. ఇందులో భాగంగానే తాజాగా అమెరికాకు చెందిన మల్టీ నేషనల్ సంస్థ మెక్ డోనాల్డ్స్ తో తెలంగాణ ప్రభుత్వం కీలక ఒప్పందం చేసుకుంది.

ఈమేరకు 2,000 మంది ఉద్యోగులతో మెక్ డొనాల్డ్ గ్లోబల్ ఇండియా ఆఫీసును ప్రారంభించనుంది. రాష్ట్ర రాజధాని హైదరాబాద్ లోనే ఈ సంస్థను నెలకొల్పనున్నట్లు ప్రకటించింది. ఈ మేరకు సీఎం రేవంత్ రెడ్డి.. అసెంబ్లీలోని ఛాంబర్ లో మెక్‌ డొనాల్డ్స్ ఛైర్మన్, సీఈవో క్రిస్ కెంప్కెజెన్స్కీతో పాటు సంస్థ ప్రతినిధులతో చర్చలు జరిపారు. అనంతరం పెట్టుబడులకు సంబంధించి ఒప్పందం చేసుకున్నారు. మెక్‌డొనాల్డ్స్ గ్లోబల్ ఆఫీస్ హైదరాబాద్‌లో ఏర్పాటు చేసేందుకు ముందుకు రావటంపై సీఎం రేవంత్ సంతోషం వ్యక్తం చేశారు.

"ఈ గ్లోబల్ సెంటర్ తమ రాష్ట్రంలోనే పోటీ చేయాలని పలు రాష్ట్రాలు పోటీ పడుతున్న సందర్భంలో మెక్ డొనాల్డ్ సంస్థ తెలంగాణను తమ పెట్టుబడులకు గమ్యస్థానంగా ఎంచుకోవటం గర్వంగా ఉంది. ప్రభుత్వం తరఫున ఉత్తమమైన సహకారం అందిస్తాం. సంస్థకు అవసరమైన శిక్షణ నైపుణ్యమైన ఉద్యోగులను నియమించుకునేందుకు యంగ్ ఇండియా స్కిల్స్ యూనివర్సిటీ సేవలు వినియోగించుకోవాలి. యూనివర్సిటీని స్కిల్ జోన్ గా ఉపయోగించుకొని, ఇక్కడ శిక్షణ పొందిన వారికి గ్లోబల్ ఆఫీస్ లోనే కాకుండా, దేశ విదేశాల్లో తమ ఆఫీసులు, అవుట్​ లెట్లలో ఉద్యోగాలు కల్పించాలి" అని సీఎం రేవంత్ అన్నారు.

రైతుల ఆదాయం పెరుగుదల..

మెక్‌డొనాల్డ్స్‌కు అవసరమైన మొత్తం వ్యవసాయ ఉత్పత్తులను స్థానిక రైతులు సమకూర్చేలా అవకాశం కల్పించాలని ముఖ్యమంత్రి రేవంత్​ రెడ్డి కోరారు. దీంతో రైతుల ఆదాయం పెరుగుతుందని, రాష్ట్ర వ్యవసాయ ఆర్థిక వ్యవస్థకు తోడ్పడుతుందని అభిప్రాయపడ్డారు.

Telangana Signs Landmark Deal with McDonald s Global India Office to Open in Hyderabad with 2 000 Jobs

బెంగళూరు లాంటి ఇతర సిటీలతో పోలిస్తే హైదరాబాద్‌లో ప్రతిభావంతులైన నిపుణులతో పాటు మెరుగైన మౌలిక సదుపాయాలు, నాణ్యమైన జీవన ప్రమాణాలున్నాయని మెక్ డొనాల్డ్ సీఈవో క్రిస్ కెంప్కెజెన్స్కీ అన్నారు. అందుకే హైదరాబాద్ ను తమ గ్లోబల్ ఇండియా ఆఫీస్ సెంటర్ గా ఎంచుకున్నట్లు చెప్పారు.

ప్రస్తుతం తెలంగాణలో 38 మెక్‌డొనాల్డ్స్ అవుట్‌ లెట్లున్నాయి. ప్రతి ఏడాది మరో 3 లేదా 4 కొత్త అవుట్ లెట్లను విస్తరించే ప్రణాళికలున్నాయి. కొత్తగా గ్లోబల్ ఇండియా ఆఫీసు ఏర్పాటుతో రాష్ట్రంలోని యువతకు ప్రత్యక్షంగా పరోక్షంగా మరిన్ని ఉపాధి అవకాశాలు లభిస్తాయి. ఇక ఈ సమావేశంలో ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతికుమారి, పరిశ్రమల శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి జయేష్ రంజన్, సీఎం ప్రత్యేక కార్యదర్శి అజిత్ రెడ్డి పాల్గొన్నారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+