వీడియో: గవర్నర్ తమిళిసైకి అపూర్వ కానుక
రాజన్న సిరిసిల్ల: సిరిసిల్ల..నేత కార్మికుల ఖిల్లా. అగ్గిపెట్టెలో ఇమిడిపోయేంతటి సూక్ష్మ పట్టు చీరెలను ఇక్కడి నేత కార్మికులు అవలీలగా నేస్తారు. పట్టువస్త్రాలను ఆధారంగా చేసుకున్ని ఎన్నో అద్భుతాలను సృష్టిస్తుంటారు. వాటిని ప్రపంచం ముందు ఆవిష్కరిస్తుంటారు. సుగంధ ద్రవ్యాల మిశ్రమంతో పట్టువస్త్రాలను నేయడంలో వారు సిద్ధహస్తులు. నేతన్నకు బీమా పథకాన్ని ప్రకటించిన తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్, మంత్రి కేటీఆర్ బొమ్మలతో మొన్నీ మధ్యే పట్టు వస్త్రాలను తయారు చేశారు.
సిరిసిల్లకే చెందిన ప్రముఖ నేత కార్మికుడు, కళాకారుడు వెల్ది హరిప్రసాద్ తన నైపుణ్యంతో మగ్గంపై ఆయన అగ్గిపెట్టెలో ఇమిడే చొక్కా, లుంగీని నేశాడు. వారం రోజుల పాటు పాటు శ్రమించి ఆయన వీటిని తయారు చేశారు. జాతీయ చేనేత దినోత్సవం సందర్భంగా వీటిని సిరిసిల్లలో ప్రదర్శించారు. ఇప్పుడు ఆయన మరోసారి తన కళా నైపుణ్యాన్ని ప్రదర్శించారు. దేశానికి స్వాతంత్ర్యం సిద్ధించి 75 సంవత్సరాలు పూర్తి కానున్న సందర్భాన్ని పురస్కరించుకుని సరికొత్త ప్రయత్నం చేశారు.

పట్టువస్త్రంపై జాతీయ గీతాన్ని నేశారాయన. ఈ పట్టువస్త్రం పొడవు రెండు మీటర్ల 47 అంగుళాలు. ఎలాంటి కుట్లు గానీ, ప్రింట్ గానీ లేకుండా పూర్తిగా మగ్గంపైనే జాతీయ గీతాన్ని నేశారు. జనగణమన.. అంటూ సాగే ఈ జాతీయ గీతంలోని ప్రతి అక్షరాన్నీ బంగారు వర్ణంలో మెరిసిపోయేలా రూపొందించారు. దీనికోసం ప్రత్యేక పట్టును ఉపయోగించారు. భారతదేశ చిత్రపటం, ఆజాదీ కా అమృత్ మహోత్సవ్ లోగోను ఈ పట్టువస్త్రంపై ముద్రించారు.

ముదురు నీలం రంగు గల ఈ పట్టువస్త్రం పైభాగంలో ఆజాదీ కా అమృత్ మహోత్సవ్ లోగో, ఆ పేరు ఇంగ్లీష్‌లో నేశారు. దాని కింద భారతదేశ చిత్రపటాన్ని మువ్వన్నెలతో తయారు చేశారు. అనంతరం జనగణమన.. అనే అక్షరాలను నేశారు. ఈ పట్టువస్త్రానికి రెండు అంచుల్లో స్వాగతం పలుకుతున్న బొమ్మలను నేశారు. అవన్నీ బంగారు రంగుతో మెరిసిపోతూ కనిపించాయి. ఈ పట్టువస్త్రాన్ని గవర్నర్ తమిళిసై సౌందరరాజన్‌కు అందజేయాలని వెల్ది హరిప్రసాద్ భావిస్తోన్నారు.
Recommended Video

వీడియో: గవర్నర్ తమిళిసైకి అపూర్వ కానుక#IndiaAt75 #Independenceday2022 #TamilisaiSoundararajan pic.twitter.com/LfRAtE5vXf
— oneindiatelugu (@oneindiatelugu) August 14, 2022












Click it and Unblock the Notifications