మరోసారి వాట్సాప్ ద్వారా పేపర్ లీకేజీ కలకలం, ఇద్దర్ని పట్టుకున్న పోలీసులు
జగిత్యాల: తెలంగాణలో మరోసారి పదో తరగతి పేపర్ లీకేజీ కలకలం చోటు చేసుకుంది. గురువారం నాడు జగిత్యాలలో మ్యాథ్స్ పేపర్ లీక్ చేస్తుండగా పోలీసులు కొందరిని పట్టుకున్నారు.
రెండు రోజుల క్రితమే ఇంగ్లీష్ పేపర్ లీక్ కలకలం చెలరేగింది. అదిలాబాద్, వనపర్తిలలో ఈ సంఘటనలు చోటు చేసుకున్నాయి. ఇప్పుడు జగిత్యాలలో మ్యాథ్స్ పేపర్ లీకేజి కలకలం చోటు చేసుకుంది.

వాట్సాప్ ద్వారా పేపర్ లీక్ చేస్తున్న ఇద్దరిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. మరో నలుగురు పరారయ్యారు. పట్టుకున్న వారి నుంచి పోలీసులు వివరాలు రాబడుతున్నారు.












Click it and Unblock the Notifications