"పవన్ కల్యాణ్ పుట్టక ముందే... కించపరిస్తే ఊరుకునేది లేదు"

హైదరాబాద్ : కాకినాడలో జరిగిన సీమాంధ్ర ఆత్మగౌరవ సభలో తెలంగాణ విషయంలో పవన్ కల్యాణ్ చేసిన వ్యాఖ్యలపై కూడా విమర్సలు వస్తున్నాయి. పోరాటాలు, త్యాగాలు, ఆత్మబలిదానాలతో తెలంగాణ రాష్ట్రం ఏర్పడిందని, తెలంగాణపై అనుచిత వ్యాఖ్యలు చేసిన పవన్ కల్యాణ్ పుట్టకముందే ప్రత్యేక రాష్ట్రోద్యమం ప్రారంభమైందన్న సత్యాన్ని గ్రహించాలని తెలంగాణ రాష్ట్ర సినిమా అభిమానుల ఐక్య వేదిక అధ్యక్షుడు పూర్ణచందర్ రావు అన్నారు.

కాకినాడలో ఇటీవల జరిగిన సీమాంధ్రుల ఆత్మగౌరవ సభలో ఉమ్మడి రాష్ట్రాన్ని గడ్డం గీసినంత సులభంగా విడగొట్టారంటూ చేసిన వ్యాఖ్యలను ఖండిస్తూ హైదరాబాదులోని సోమాజిగూడలో ప్రకటన విడుదల చేశారు. దేశ చరిత్రలోనే అత్యధిక కాలం కొనసాగిన ఉద్యమం తెలంగాణలో సాగిందని, ఆ చరిత్రను పవన్ తెలుసుకోవాలని ఆయన అన్నారు.

Telangana state cine fans condemns Pawan Kalyan

జైఆంధ్ర ఉద్యమంలో చనిపోయిన వారిగురించి ప్రస్తావించిన పవన్ తెలంగాణ కోసం ఆత్మత్యాగాలు చేసిన వారి గురించి మాట్లాడకపోవడం శోచనీయమని ఆయన అన్నారు. సినిమా వాళ్లలో ఎక్కువ మంది సీమాంధ్రుల పక్షపాతులేనన్న సత్యం పవన్ కల్యాణ్ వ్యాఖ్యల ద్వారా స్పష్టమైందన్నారు.

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి న్యాయం కోసం పవన్ ఉద్యమిస్తే సాటి తెలుగు వారిగా మద్ధతునిస్తామని, కానీ.. తెలంగాణను కించపరిస్తే ఊరుకు నేది లేదన్నారు. ఇప్పటికైనా పవన్ మాట్లాడే ముందు చరిత్రను తెలుసుకొని మాట్లాడాలని సూచించారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+