హైదరాబాద్ వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

Telangana Model Schoolsలో అడ్మిషన్స్‌కు నోటిఫికేషన్: ప్రత్యేకతలు ఇవే..!

|
Google Oneindia TeluguNews

హైదరాబాదు: విద్యార్థులకు చక్కటి బోధన అందించి వారిని భవిష్యత్తులో మంచి ప్రయోజకర్తలుగా తీర్చి దిద్దాలనే ఉద్దేశంతో తెలంగాణ ప్రభుత్వం తెలంగాణ మోడల్ స్కూళ్లను ప్రారంభించింది. ఈ మోడల్ స్కూళ్లు ప్రారంభించాక విజయవంతంగా నిర్వహిస్తున్నారు. తాజాగా 2021-22 విద్యా సంవత్సరంకు గాను తెలంగాణ మోడల్ స్కూళ్లలో ప్రవేశాలకు నోటిఫికేషన్ విడుదలైంది. 6వ తరగతి నుంచి ఇంటర్మీడియట్‌ వరకు విద్యార్థుల ప్రవేశాల కోసం నోటిఫికేషన్ విడుదల చేసింది తెలంగాణ ప్రభుత్వం. తెలంగాణలో మొత్తం 194 మోడల్ స్కూళ్లలో ప్రవేశాలకు నోటిఫికేషన్ విడుదలైంది. ఇందులో ఇంగ్లీషు మీడియంలో విద్యను బోధిస్తారు.

మోడల్ స్కూళ్లు ప్రత్యేకతలు
ఈ మోడల్ స్కూళ్లలో అడ్మిషన్ పొందిన విద్యార్థులకు ఎలాంటి ఫీజు వసూలు చేయబడదు. ఇంగ్లీషు మీడియంలో విద్యాబోధన ఉంటుంది. మోడల్ స్కూల్ బిల్డింగ్‌లు అన్నీ పక్కా భవనాలే ఉండటం విశేషం. 6వ తరగతి నుంచి ఇంటర్మీడియట్ వరకు విద్యార్థులకు ఉచితంగా పాఠ్యపుస్తకాలను సరఫరా చేస్తారు. 6వ తరగతి నుంచి 10వ తరగతి విద్యార్థులకు ఉచితంగా మధ్యాహ్న భోజనం పెడతారు. ఇక విద్యార్థులందరికీ ఉచితంగా స్కూలు యూనిఫారంలను ప్రభుత్వమే ఇస్తుంది. 100 మంది బాలికలకు హాస్టల్ వసతి ఉంటుంది. సైన్స్ మరియు కంప్యూటర్ ల్యాబులు, లైబ్రరీ, స్పోర్ట్స్ ఇక్కడ ప్రత్యేకతలు. ఇక విద్యార్థులకు డిజిటల్ క్లాసులు ఉంటాయి. ఇక రిజర్వేషన్లను అనుసరించి మెరిట్ ప్రకారం సీట్లను భర్తీ చేస్తారు. ఇక ఐఐటీ/జేఈఈ/నీట్/ఎంసెట్/సీఏ/టీపీటీ/సీఎస్‌తో పాటు ఇతర పోటీ పరీక్షలకు ఉచితంగా కోచింగ్ ఇస్తారు.

Telangana state Model School Admissions 2021: How to Apply for Model schools,Here is all

6వ తరగతి నుంచి 10వ తరగతి అంటే ఒక్కో తరగతికి 100 సీట్లను కేటాయించారు. ఒక్కో తరగతికి రెండు సెక్షన్లు ఉంటాయి. కేవలం అడ్మిషన్ టెస్టు ద్వారానే ప్రవేశాలను కల్పిస్తారు. ఇక ఏడవ తరగతిలో విద్యార్థులు చేరాలంటే ఆ తరగతిలో ఖాళీలను అనుసరించి అడ్మిషన్ ఇవ్వడం జరుగుతుంది. తెలంగాణ మోడల్ స్కూళ్లలో అడ్మిషన్ ప్రక్రియ, ముఖ్యతేదీలు ఇలా ఉన్నాయి.

ఆన్‌లైన్ ద్వారా అప్లికేషన్ సబ్మిట్ చేసేందుకు: 15 ఏప్రిల్ 2021 నుంచి 30 ఏప్రిల్ 2021

ఆన్‌లైన్‌లో ఫీజు కట్టేందుకు: 15 ఏప్రిల్ 2021 నుంచి 30 ఏప్రిల్ 2021

హాల్ టికెట్ డౌన్‌లోడ్: 1 జూన్ 2021 నుంచి 6 జూన్ 2021 వరకు

రాతపరీక్ష : ఆరవ తరగతికి 6 జూన్ 2021
7వ తరగతి నుంచి 10వ తరగతికి 5 జూన్ 2021.

ఉదయం 10 గంటల నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకు పరీక్ష జరుగుతుంది.

పరీక్ష ఫలితాలు వెల్లడి: 14 జూన్ 2021

సర్టిఫికేట్ వెరిఫికేషన్ : 18 జూన్ 2021 నుంచి 20 జూన్ 2021 వరకు

తరగతులు ప్రారంభ తేదీ: 21 జూన్ 2021.

మరి ఇంకెందుకు ఆలస్యం ఇంగ్లీషు మీడియంలో మంచి విద్యాబోధన కావాలంటే వెంటనే మీ పిల్లలకు ఈ మోడల్ స్కూల్స్‌లో అప్లయ్ చేయండి. వారికి మంచి భవిష్యత్తును ఇవ్వండి. మరిన్ని వివరాలకు : https://telanganams.cgg.gov.in/

English summary
Telangana govt had issued admission notification for providing admissions into 6th standard in Telangana Model schools.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X