కేసీఆర్ కు గుడి: తెలంగాణా రాష్ట్రవ్యాప్తంగా కడతానన్న అభిమాని; కేసీఆర్ పై ప్రేమ పీక్స్!!
భారతదేశంలో కేవలం బాలీవుడ్ మరియు సౌత్ ఇండియన్ సూపర్ స్టార్‌లను మాత్రమే దేవుళ్లుగా చూస్తారని మీరు అనుకుంటే పొరబాటే. భారతదేశం అత్యంత భావోద్వేగాన్ని, భావ వ్యక్తీకరణను కలిగిన దేశం. దైవం పట్ల తమ భక్తిని మరియు విశ్వాసాన్ని వ్యక్తీకరించడానికి ప్రజలు దేశవ్యాప్తంగా లక్షలాది దేవాలయాలను నిర్మించినప్పటికీ, తమ అభిమాన నటులపై, అభిమాన రాజకీయ నాయకులపై భక్తిని తెలియజేయటానికి కూడా ఆలయాలు నిర్మించి తమ భావోద్వేగాన్ని తెలియజేస్తుంటారు. ఇక అదే కోవలో తాజాగా తెలంగాణ సీఎం కేసీఆర్ కు రాష్ట్ర వ్యాప్తంగా ఆలయాలు నిర్మించాలని నిర్ణయించారు ఓ అభిమాని. ఇక ఇదే విషయాన్ని ప్రకటన కూడా చేశారు.

గతంలో తెలంగాణాలో సోనియా గాంధీకి గుడి కట్టిన అభిమాని
ప్రజలు ఎప్పుడూ ప్రముఖ రాజకీయ నాయకులకు తమ ప్రేమను తెలియజేయడానికి శతవిధాలా ప్రయత్నం చేస్తూ ఉంటారు. ఇక ఆ ప్రేమ వ్యక్తీకరణలో భాగంగా రాజకీయ నాయకులకు ఆలయాలను నిర్మిస్తున్న సాంప్రదాయం చాలా కాలంగా కొనసాగుతోంది. గతంలో కాంగ్రెస్ పార్టీ అధినేత్రి సోనియా గాంధీకి గుడి కట్టి, తెలంగాణలోని కరీంనగర్‌లో ఆమె విగ్రహాన్ని స్థాపించారు ఒక అభిమాని. ప్రజలు ప్రతిరోజూ సోనియాగాంధీ గుడి వద్దకు వెళ్లి తమ ప్రార్థనలు చేయడానికి వీలుగా ఈ ఆలయం నిర్మించబడింది. కాంగ్రెస్ పార్టీకి దశాబ్దాల క్రితం ఉన్న ఆదరణ లేకపోయినా, సోనియా గాంధీకి ఇప్పటికీ విధేయులు చాలా మంది ఉన్నారు అని చెప్పడానికి ఆ ఆలయమే సాక్ష్యం.

ప్రధాని మోడీకి గుజరాత్ లో, అలాగే యూపీలో గుడులు
ప్రధానమంత్రి నరేంద్ర మోడీకి భారీ సంఖ్యలో అభిమానులు ఉన్న విషయం తెలిసిందే. దేశంలో మోడీ మేనియా కొనసాగుతుంది. ఆయన దేశంలోనే కాకుండా ప్రపంచవ్యాప్తంగా ప్రజాదరణ పొందాడు. గుజరాత్‌లోని రాజ్‌కోట్‌లో ప్రధానమంత్రి నరేంద్రమోడీ పేరు మీద ఆలయాన్ని నిర్మించారు ఆయన అభిమానులు . ఇదొక్కటే కాదు ఉత్తరప్రదేశ్‌లో కూడా అభిమానులు మరో నరేంద్ర మోదీ గుడి కట్టారు. నేటికీ ఆయన అభిమానులు ఆయా గుడులలో మోడీకి పూజలు నిర్వహిస్తున్నారు.

తమిళనాట ఎంజీఆర్ కు, ఖుష్భూకు గుడి
ఇక తమిళనాడు రాష్ట్రంలో అత్యంత ప్రసిద్ధ వ్యక్తులలో ఒకరైన దివంగత ఎంజీఆర్ నటుడిగా, దర్శకుడిగా, నిర్మాతగా మూడుసార్లు రాష్ట్ర ముఖ్యమంత్రిగా పనిచేశారు. ఆయనకు కూడా అభిమానులు ఆలయాన్ని నిర్మించారు. నేటికీ ఆయన అభిమానులు ఎం.జి.ఆర్ ఆలయాన్ని సందర్శిస్తారు. ఇక ప్రస్తుతం తమిళనాడు రాజకీయాలలో బిజెపి నాయకురాలిగా పనిచేస్తున్న కుష్బూ సుందర్ కు కూడా ఆమె అభిమానులు గుడి నిర్మించి పూజలు చేసిన విషయం తెలిసిందే.

తెలంగాణాలోనూ కేసీఆర్ కు గుళ్ళు నిర్మిస్తానని ప్రకటన చేసిన అభిమాని
ఇక ఇదే కోవలో తెలంగాణ సీఎం కేసీఆర్ కు రాష్ట్రవ్యాప్తంగా గుళ్ళు నిర్మిస్తానని ఓ అభిమాని సంచలన ప్రకటన చేశారు. ముఖ్యమంత్రి కేసీఆర్ ను దైవస్వరూపంగా భావించి గుళ్ళు నిర్మిస్తామని చెబుతున్నారు హైదరాబాద్ కు చెందిన శ్రీ షిరిడి సాయి బృందావనం పీఠం వ్యవస్థాపక చైర్మన్ కె.జె కిషోర్ కుమార్ . మొదట మేడ్చెల్ లో ముఖ్యమంత్రి కేసీఆర్ కు గుడి మొదలుపెట్టి రాష్ట్ర వ్యాప్తంగా అన్ని నియోజకవర్గాల్లో ఒక్కో గుడి నిర్మించాలని భావిస్తున్నట్లు ప్రకటించారు. తెలంగాణ పోరాట యోధుడిగా, రాష్ట్ర సాధకుడుగా కెసిఆర్ ప్రజలకు గుర్తుండడం కోసం రాష్ట్ర వ్యాప్తంగా గుడులు నిర్మిస్తామని ప్రకటించారు.

గతంలో కేసీఆర్ కు గుడి.. ఆపై అమ్మకానికి పెట్టిన అభిమాని
అయితే తెలంగాణ లో సీఎం కేసీఆర్ కు గుడి కట్టడం ఇదే మొదటిది కాదు. ఇప్పటికే మంచిర్యాల జిల్లా దండేపల్లి కి చెందిన ఉద్యమకారులు గుండ రవీందర్ కెసిఆర్ పై అమితమైన అభిమానంతో ఆయనకు గుడి కట్టాడు. సొంత ఖర్చులతో గుడిని నిర్మించి అందులో కేసీఆర్ పాలరాతి విగ్రహాన్ని ప్రతిష్టించి రోజు పూజలు చేశారు. ఆపై కేసీఆర్ పార్టీలో తనను పట్టించుకోవడం లేదని, కెసిఆర్ ని కలవాలన్న తన ఆకాంక్ష తీరడం లేదని, తనను కెసిఆర్ కష్టాలనుంచి గట్టెక్కించటం లేదని భావించిన సదరు వ్యక్తి తాను కట్టిన కెసిఆర్ గుడిని అమ్మకానికి పెట్టాడు. అప్పట్లో ఇది సోషల్ మీడియాలో వైరల్ అయింది. ఇక ఇప్పుడు మరో అభిమాని తెలంగాణ సీఎం కేసీఆర్ కు రాష్ట్రవ్యాప్తంగా గుళ్లు నిర్మిస్తా అంటూ బయలు దేరాడు.
-
కుప్పకూలుతున్న బంగారం ధరలు- రాక్ బాటమ్ -
లోకసభ, అసెంబ్లీ స్థానాల పెంపు - ఏపీ..తెలంగాణలో పెరిగేది ఇలా, మహిళల స్థానాలు ఇవే..!! -
PM Modi: ఇరాన్ వార్ తో మనకు కష్టాలే..! సిద్ధంగా ఉండాలన్న మోడీ..! -
కొత్త సినిమాలపై పవన్ కల్యాణ్ సంచలన నిర్ణయం, ఇక నుంచి..!! -
రైతు రుణమాఫీ లేదు.. తేల్చి చెప్పిన నిర్మలమ్మ! -
భారత్.. పాకిస్థాన్ లా 'బ్రోకర్' కాదు.. ఇచ్చిపడేసిన జై శంకర్.. -
టీడీపీ కంచుకోటలో వైసీపీ అభ్యర్ధి ఫిక్స్, 2024 నిర్ణయాల దిద్దుబాటు..!! -
ఇంటర్ ఫలితాల డేట్ వచ్చేసింది- ఏపీ, తెలంగాణలో ఇలా..!! -
వెండి విలయ తాండవం: నిలిచిపోయిన ట్రేడింగ్! -
"ధురంధర్" దెబ్బకి "పాకిస్థాన్" లో కలకలం.. నయా ఆపరేషన్ షురూ..!! -
మీనరాశి వార్షిక ఫలం 2026-27: ఈ ఏడాది కార్యసిద్ధి, ఆర్థిక లాభం.. పూర్తి వివరాలివే! -
అమెరికాకు ఎదురుదెబ్బ? యుద్ధక్షేత్రం నుంచి వైదొలిగిన ఫోర్డ్.. కారణం ఏంటి?











Click it and Unblock the Notifications