లండన్‌లో తెలంగాణ విద్యార్ధి మిస్సింగ్.. కాపాడాలంటూ సీఎంకు రిక్వస్ట్
లండన్‌లో తెలంగాణకు చెందిన విద్యార్థి మిస్సింగ్ వ్యవహారం సర్వత్రా కలకలంగా మారింది. దీంతో తన కుమారుడిని వెతికించి, స్వదేశానికి రప్పించాలని కోరుతూ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి వినతి పత్రం ఇవ్వడం హాట్ టాపిక్ గా మారింది.
ఈ ఘటనకు సంబంధించి పూర్తి వివరాల్లోకి వెళ్తే.. నిజామాబాద్ జిల్లా ముప్కాల్ మండలం రెంజర్లకు చెందిన నల్ల అనురాగ్ రెడ్డి స్టూడెంట్ వీసాతో జనవరిలో లండన్‌కు వెళ్లారు. ఈ నెల 25వ తేదీన కార్దీప్ ప్రాంతానికి స్నేహితులతో కలిసి వెళ్లి అదృశ్యమైనట్టు అతని స్నేహితులు కుటుంబ సభ్యులకు సమాచారం ఇచ్చారు. కుమారుడు అదృశ్యం కావడంతో తల్లి హరిత, కుటుంబ సభ్యులు ఆందోళన చెందుతున్నారు.

ఈ క్రమంలోనే తమ బిడ్డను వెతికి ఇండియాకు తీసుకురావాలని కోరుతూ అనురాగ్ రెడ్డి కుటుంబ సభ్యులు సీఎం రేవంత్ తో లేఖ రాశారు. ఖనిజాభివృద్ధి కార్పొరేషన్ చైర్మన్ అనిల్ కు ఆ వినతి పత్రాన్ని అందించారు. దీనిపై ప్రభుత్వం తరపున వెంటనే స్పందించిన ఆయన సీఎంఓ, జీఏడీ, ఎన్ఆర్ఐ అధికారులతో మాట్లాడారు. అంతే కాకుండా ఢిల్లీలోని విదేశాంగ శాఖకు, లండన్ లోని ఇండియన్ హై కమీషన్ కు సంబంధిత ఘటనపై సమాచారం ఇచ్చారు. విద్యార్థి ఆచూకీ తెలుసుకొని ఇండియాకు రప్పిస్తామని హామీ ఇచ్చారు.












Click it and Unblock the Notifications