కెటిఆర్ డైనమెట్: నరసింహన్, తెలంగాణదే కాదు: కెటిఆర్, దానిపై టాటా నో! (పిక్చర్స్)
హైదరాబాద్: స్టార్టప్‌లు భవిష్యత్ భారతానికి నూతన ముఖ చిత్రమని టాటా గ్రూపు సంస్థల మాజీ అధినేత, ప్రముఖ పారిశ్రామికవేత్త రతన్ టాటా గురువారం అభివర్ణించారు. భారతదేశ సత్తాను చాటేందుకు త్రికరణ శుద్ధిగా పని చేసేందుకు యువత సిద్ధం కావాలన్నారు.
ఉత్తమ ఆలోచనలకు టీ-హబ్ సరైన వేదికగా నిలుస్తుందని చెప్పారు. హైదరాబాద్ ఐఐఐటీ ఆవరణలో ప్రభుత్వ-ప్రైవేటు భాగస్వామ్యంతో నిర్మించిన అతిపెద్ద ఇంక్యూబేటర్ టీ-హబ్‌ను గవర్నర్ నరసింహన్‌తో కలసి రతన్ టాటా ప్రారంభించారు.
అనంతరం రతన్ టాటా మాట్లాడారు. దేశంలో వైద్య, ఆరోగ్య రంగాలకు సంబంధించిన స్టార్టప్‌లకు ఉజ్వల భవిష్యత్తు ఉందన్నారు. బయో టెక్నాలజీ, లైఫ్‌సైన్సెస్, స్టెమ్‌సెల్ వంటి వాటిపై పరిశోధనలు అత్యంత కీలకమన్నారు. మొండి వ్యాధులను నయంచేసే ఆవిష్కరణల అవసరం చాలా ఉందన్నారు.
కొత్త సాంకేతిక పరిజ్ఞానం వచ్చినంత మాత్రాన పాతవి నిరర్థకం కాబోవని, నవభారత నిర్మాణ కలలు సాకారమయ్యేందుకు యువ శాస్త్రవేత్తలు, పారిశ్రామికవేత్తలు దోహదపడాలని, అందుకు నిరంతర ప్రోత్సాహం ఉంటుందన్నారు. ఈ కార్యక్రమంలో మంత్రి కెటిఆర్, సిఎస్ రాజీవ్ శర్మ, నాస్కాం చైర్మన్ మోహన్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.

టి హబ్
రతన్ టాటా మాట్లాడుతూ... టీ హబ్ అద్భుత నిర్మాణమని కొనియాడారు. ప్రపంచస్థాయి ప్రమాణాలతో యువతను ఆకట్టుకునే ఇంటీరియర్ డిజైన్లతో భవనాన్ని తీర్చిదిద్దారన్నారు. కాటలిస్ట్ భవనాన్ని చూసిన తర్వాత దేశం కొత్త కోణం వైపు చొరవ తీసుకుంటున్నదనే భావన కలిగిందని చెప్పారు.

టి హబ్
ఇప్పటిదాకా దేశంలో దుకాణదారులు, పరిశ్రమలవారు, వ్యవసాయ ఉత్పత్తులు అమ్ముకునేవారు వంటి సంప్రదాయ వ్యాపారవేత్తలు ఉన్నారని, ఇపుడు అందుకు భిన్నంగా, సాంకేతికత ఆలంబనగా చేసుకుని భవిష్యత్తులో కీలక భూమిక పోషించగల ఆవిష్కరణలు జరగాల్సిన అవసరం వచ్చిందన్నారు.

టి హబ్
అలాంటి ఆవిష్కరణలకు ఈ టీ హబ్ ఒక చక్కటి వేదిక అన్నారు. ఈ-కామర్స్, లైఫ్‌సైన్సెస్, మెడికల్, ఈ రీటైలింగ్ రంగాల్లో ఇపుడు మంచి అవకాశాలున్నాయని, వీటిని యువత ఒడిసిపట్టుకోవాలన్నారు. ప్రస్తుతం దేశంలో కొత్త ఆవిష్కరణలకు ఏర్పడుతున్న ప్రతిబంధకాలను వివరించారు.

టి హబ్
కొత్త ఆలోచనతో బాస్ వద్దకు వెళ్తే ఇంకా అనుభవం కావాలని చెబుతాడని, దాంతో ఉద్యోగి ఆలోచన ఆగిపోతుందని, అలా అని ముందుకు అడుగు వేసేందుకు ఆర్థిక స్థోమత ఉండదని, కాబట్టిఆ ఆవిష్కరణ అక్కడితో ముగిసిపోతుందని ప్రస్తుత ప్రతిబంధకాలను వివరించారు.

టి హబ్
ఇవాళ టీ హబ్ ద్వారా అలాంటి ప్రతిబంధకాలకు పరిష్కారం దొరికిందన్నారు. ఇక్కడ ఆలోచనలతో వచ్చిన వారికి మార్గదర్శనం చేసేందుకు మెంటార్లు ఉన్నారని, వెంచర్ కాపిటలిస్టులు సైతం రెడీగా ఉన్నారని, ఈ అవకాశాన్ని ఔత్సాహికులు వినియోగించుకుని దూసుకువెళ్లాలన్నారు

టి హబ్
గవర్నర్ నరసింహన్ మాట్లాడుతూ... 17నెలల 4 రోజుల్లోనే స్టార్టప్‌ల కేంద్రాన్ని ఏర్పాటు చేయడం అభినందనీయమన్నారు. మంత్రి కేటీఆర్ మదిలో రూపుదిద్దుకున్న టీ హబ్ గ్రేట్ ఐడియా అని చెప్పారు. ఇలాగే మిగతా మంత్రులు కూడా వినూత్నంగా ఆలోచించాలన్నారు. తాను వివిధ అంశాలపై విద్యాసంస్థలను సందర్శించినపుడు విద్యార్థుల్లో ఎన్నో ఆలోచనలు ఉండటాన్ని చూసి అశ్చర్యపోయేవాడినని చెప్పారు.

టి హబ్
అలాంటి వారు తమ సత్తాను నిరూపించుకునేందుకు ఇలాంటి టీ హబ్ గొప్ప వేదికగా ఉంటుందని, నిర్వాహకులు అన్ని వైస్‌చాన్స్‌లర్లు, కాలేజీ ప్రిన్సిపాల్స్‌ను ఇక్కడికి పిలిపించి టీ హబ్ విశిష్టత, ప్రత్యేకతలపై అవగాహన కలిగించాలని కోరారు.

టి హబ్
గ్రామీణ ప్రాంతాల్లో గొప్పగొప్ప ఆలోచనలు ఉన్నాయని, వాటికి కార్యరూపం ఇచ్చేలా ప్రోత్సాహం అందించాలని, విదేశాల్లో అద్భుతాలు సృష్టిస్తున్న వారు టీ హబ్‌కు వచ్చి ఇక్కడే ఆవిష్కరణలు చేసే స్థాయికి ఎదగాలని, నీరు, విద్యుత్తు, విద్యారంగాలమీద కొత్త స్టార్టప్‌లు దృష్టి పెడితే అవి బాగా విజయం సాధిస్తాయని భావిస్తున్నానని చెప్పారు. కొత్త రాష్ట్రమైనప్పటి 17 నెలల్లో టీ హబ్ వంటి అద్భుత వేదిక ఏర్పాటుచేసి రికార్డ్ సృష్టించిందన్నారు. మంత్రి కేటీఆర్‌ను డైనమైట్ మంత్రి అని గవర్నర్ సంబోధించడంతో సభలో కేరింతలు వినిపించాయి.

టి హబ్
మంత్రి కేటీఆర్ మాట్లాడుతూ... హైదరాబాద్‌ను భారతదేశపు స్టార్టప్‌ల రాజధానిగా రూపొందించాలనేదే తమ ప్రభుత్వ ధ్వేయమన్నారు. భారతీయులు ప్రపంచవ్యాప్తంగా అన్నిదేశాల్లోనూ సాంకేతిక సేవలను అందిస్తున్నారు.

టి హబ్
ప్రపంచంలో ఎవరితోనైనా పోటీపడగలిగే సత్తా ఉన్నప్పటికీ మనవాళ్లు కేవలం ప్రోగ్రామర్లు లేదా బ్యాక్‌ఎండ్ సిబ్బందిగా మాత్రమే గుర్తింపు పొందుతున్నారని, అంతే తప్ప గర్వించదగిన ఎంటర్‌ప్రెన్యూర్లుగా ఎదగలేకపోతున్నారని, అవకాశాలు లభిస్తే గూగుల్, వాట్సప్, ట్విటర్, ఇన్‌స్టాగ్రామ్ వంటి వాటిని కూడా మన భారతీయులు ఆవిష్కరించగలరని, ఇవాళ టీ హబ్ ద్వారా ఆ కల సాకారం కాబోతుందన్నారు.

టి హబ్
భారతీయ యువత అలాంటి సాంకేతిక ఆవిష్కరణలు చేయగలదనే దృఢ విశ్వాసంతో టీ హబ్‌కు శ్రీకారం చుట్టామన్నారు. ఇది కేవలం ప్రారంభం మాత్రమేనని, టీ హబ్‌ను మరింత ముందుకు తీసుకువెళ్లేందుకు ప్రభుత్వం తరఫున కావాల్సినవన్నీ చేస్తామన్నారు. హైదరాబాద్ భారతదేశపు స్టార్టప్‌ల రాజధానిగా తీర్చిదిద్దుతామన్నారు. టీ హబ్ ఒక్క తెలంగాణవారిది మాత్రమే కాదని, భారతీయులందరిదీ అన్నారు.

టి హబ్
ఢిల్లీ, బెంగళూరు, మీరట్... ఇలా అందరిదీ అన్నారు. అద్భుతమైన ఆలోచనలు ఉన్న వారికి అపరిమితమైన అవకాశాలను టీ హబ్ అందిస్తుందని చెప్పారు. వీటినీ సద్వినియోగం చేసుకొని రాబోయే ఐటీ విప్లవానికి హైదరాబాద్‌ను వేదిక చేయాలన్నారు.

టి హబ్
ఆవిష్కరణలకు అండగా నిలిచేందుకు దేశంలో ప్రభుత్వపరంగా కొత్త రాష్ట్రమైనప్పటికీ తెలంగాణ చొరవ తీసుకొని టీ హబ్‌ను ఏర్పాటు చేసిందన్నారు. టీ హబ్‌లో భాగస్వామ్యం అయ్యేందుకు ఇప్పటికే అమెరికా, యూరప్‌ల నుంచి పలు కంపెనీలు ముందుకు వచ్చాయని తెలిపారు. నాస్కాం సైతం సంసిద్ధత వ్యక్తం చేసిందన్నారు.

టి హబ్
స్టార్టప్‌లకు కొండంత అండగా నిలిచే రతన్ టాటా ఈ కార్యక్రమానికి విచ్చేయడం శుభపరిణామమన్నారు. టెక్నాలజీ దిగ్గజాలైన గూగుల్, మైక్రోసాఫ్ట్ తమ స్టార్టప్‌ల కేంద్రాలను టీ హబ్‌లో ఏర్పాటు చేసేందుకు సంసిద్ధత వ్యక్తం చేశాయని, మైక్రోసాఫ్ట్ సీఈవో సత్యనాదెళ్ల, మాస్టర్‌కార్డ్ సీఈవో అజయ్ బంగా, అడోబ్ సీఈవో శంతను నారాయణ్‌లు త్వరలోనే టీ హబ్‌ను సందర్శిస్తామన్నారు. వారు మార్గదర్శకం చేస్తారన్నారు.

టి హబ్
ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి రాజీవ్ శర్మ మాట్లాడుతూ... ప్రభుత్వపరంగా ఓ వైపు సంప్రదాయాలను పరిరక్షించుకుంటూనే మరోవైపు వినూత్నమైన టీ హబ్‌కు సైతం కేటాయింపులు చేయడం, ఆవిష్కరణలకు వేదికగా ఉపయోగించడం సంతోషకరమన్నారు. టీ హబ్ వల్ల స్టార్టప్‌లకు కొత్త ఉత్సాహం వచ్చి తద్వారా మంచి ఫలితాలు సాధించగలమని ఆశాభావం వ్యక్తం చేశారు. ఆలోచలను ఆవిష్కరణలుగా మార్చేలా వివిధ సంస్థల సమన్వయంతో ముందుకెళ్లేందుకు టీ-హబ్ దోహదపడుతుందన్నారు.

టి హబ్
నాస్కాం ఛైర్మన్ మోహన్‌రెడ్డి మాట్లాడుతూ... టీ హబ్‌కు తాము తోడ్పాటును అందిస్తామన్నారు. పదివేల స్టార్టప్‌లు స్థాపించే లక్ష్యంలో భాగంగా, టీ-హబ్‌ను నాస్కాం వినియోగించుకుంటుందన్నారు.

టి హబ్
టీ-హబ్ ప్రారంభోత్సవం అనంతరం స్టార్టప్ సంస్థల భాగస్వాములతో రతన్ టాటా ప్రత్యేకంగా ముచ్చటించారు. దేశంలో మత అసహనం పారిశ్రామిక రంగంపై ఎలాంటి ప్రభావం చూపుతుందని ఈ సందర్భంగా ప్రశ్న అడగ్గా... ఆయన స్పందించేందుకు నిరాకరించారు. అయితే, భారతదేశం శతాబ్దాలుగా మతసామరస్యానికి ప్రతీకగా నిలుస్తోందనీ, భిన్న మతాలకు చెందినవారు కలిసిమెలిసి జీవిస్తున్నారని, ఇది ఇలాగే కొనసాగాలన్నారు.
-
ఉస్తాద్ భగత్ సింగ్ ట్విట్టర్ రివ్యూ: బొమ్మ బ్లాక్ బస్టర్..!! -
కుంభరాశి వారికి ఉగాది నుండి జరిగేదిదే! -
తీవ్ర సంక్షోభంలో పాకిస్తాన్- ప్రధాని షరీఫ్ అనూహ్య ఆదేశాలు -
విశాఖపట్నం-తిరుపతి మధ్య మరో రెగ్యులర్ ఎక్స్ ప్రెస్-ఈ రోజుల్లో..! హాల్ట్ లు ఇవే..! -
Tenth Exams: కన్నీళ్లు తెప్పిస్తున్న దృశ్యం. ఆక్సిజన్ సాయంతో పరీక్ష రాసిన విద్యార్ధి -
`ఉస్తాద్` కోసం పవన్ రెమ్యునరేషన్ -
ఈ సీన్ పై సస్పెన్స్ వీడింది- క్లారిటీగా చెప్పిన శ్రీలీల -
H-1B Visa ఫీజు వ్యవహారం భారీ ట్విస్ట్- బ్యాక్ ఫైర్ -
ఐటెం సాంగ్ బ్యాన్ చేసిన కేంద్రం, పాన్ ఇండియా మూవీకి బిగ్ షాక్ -
వైసీపీలోకి రీ ఎంట్రీ పై తేల్చేసిన బాలినేని, ఆయన నాయకుడు మాత్రమే కాదు..!! -
యుద్ధం వేళ.. మోదీ మంత్రివర్గం సంచలన నిర్ణయాలు -
ఓటీటీలో దడ పుట్టించే హారర్ థ్రిల్లర్.. ఇప్పుడే చూసేయండి..












Click it and Unblock the Notifications