కేసీఆర్ దెబ్బతీస్తున్నారంటే..: రేవంత్-రమణపై లోకేష్ అసహనం

Posted By:
Subscribe to Oneindia Telugu

హైదరాబాద్: తెలంగాణలో తెలుగుదేశం పార్టీ చాలా బలహీనంగా మారింది. ఇలాంటి సమయంలోను నేతల మధ్య విభేదాలు కనిపిస్తున్నాయని అంటున్నారు. దీని పైన టిడిపి జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ అసంతృప్తి వ్యక్తం చేశారని తెలుస్తోంది. కలిసి ముందుకు సాగాలని సూచించారు.

పార్టీ తెలంగాణ అధ్యక్షులు ఎల్ రమణ, తెలంగాణ వర్కింగ్ ప్రెసిడెంట్ రేవంత్ రెడ్డి మధ్య సైలెంట్ వార్ ఉందని అంటున్నారు. ఈ విషయం తెలిసిన లోకేష్ వారి వైఖరి పైన తన అసంతృప్తిని వ్యక్తం చేస్తూ, కలిసి సాగాలని హితవు పలికారు.

Also Read: మా ఆఫీస్‌లో దౌర్జన్యం, దాడి చేశారు: కేసీఆర్‌కు రేవంత్ హెచ్చరిక

ఇటీవల లోకేష్ తెలంగాణ టిడిపి నేతలతో ఎన్టీఆర్ భవన్లో సమావేశం నిర్వహించారు. ఈ సమయంలో రేవంత్, రమణల మధ్య ఉన్న గ్యాప్ పైన ఆగ్రహం వ్యక్తం చేశారని తెలుస్తోంది. ఇరువురి మధ్య సమన్వయం లేకపోవడాన్ని లోకేష్ తీవ్రంగా తప్పుబట్టారని అంటున్నారు.

Also Read: కేసీఆర్ పాలనపై లోకేష్ ఆరా, బాధ్యతల అప్పగింత (పిక్చర్స్)

Telangana TDP leaders told to stop infighting

ఇరువురి మధ్య ఉన్న విభేదాలను వెంటనే పరిష్కరించుకోవాలని సూచించారు. ఇప్పటికే అధికార తెరాస టిడిపిని పూర్తిగా నిర్వీర్యం చేసే ప్రయత్నాలు చేస్తోందని, అలాంటప్పుడు పార్టీలో కూడా ఇలాంటి విభేదాలు సరికాదని చెప్పారని తెలుస్తోంది. ఇగోలు పక్కన పెట్టి పార్టీ కోసం కలిసి పని చేయాలని సూచించారు.

కాగా, రేవంత్ - ఎల్ రమణల మధ్య విభేదాల అంశాన్ని కొందరు ఇతర నేతలు లోకేష్ దృష్టికి తీసుకు వెళ్లారని తెలుస్తోంది. వారి వైఖరి కారణంగా పార్టీ క్రాస్ రోడ్డులో ఉందని చెప్పారని సమాచారం. ఇరువురు నేతలు ఒకరితో మరొకరు సమన్వయం లేకుండా సమావేశాలు నిర్వహిస్తున్నారని కూడా చెప్పారని తెలుస్తోంది. దీంతో లోకేష్ కల్పించటుకున్నారు.

ఇంకా వివాహం చేసుకోలేదా? తెలుగు మ్యాట్రిమోనిలో నేడే రిజిస్టర్ చేసుకోండి - రిజిస్ట్రేషన్ ఉచితం!

English summary
The infighting between senior party leaders in Telangana state has not gone down well with TD national general secretary Nara Lokesh, who asked these leaders to mend their ways.

Oneindia బ్రేకింగ్ న్యూస్
రోజంతా తాజా వార్తలను పొందండి

X