వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

టిడిపిలోకి రేవంత్ ఇలా: బాబుకు నమ్మినబంటు, అనతికాలంలోనే కీలకపదవి

By Narsimha
|
Google Oneindia TeluguNews

హైదరాబాద్: తెలుగుదేశం పార్టీలో రేవంత్ రెడ్డి చేరిక అనుకోకుండానే జరిగింది. ఎమ్మెల్సీగా ఎన్నికయ్యాక టిడిపిలో చేరుతానని రేవంత్‌రెడ్డి చెప్పారు. అయితే ఆ ఎన్నికల్లో టిడిపి రేవంత్‌రెడ్డికి మద్దతు ప్రకటించింది.

ఎమ్మెల్సీగా ఎన్నికైన తర్వాత రేవంత్‌రెడ్డి టిడిపిలో చేరారు.మరో వైపు అనతికాలంలోనే టిడిపిలో ఎదిగారు. పార్టీ నాయకత్వం కూడ ఆయనకు అవకాశాలు కల్పించింది.రేవంత్‌రెడ్డి టిడిపిని వీడి కాంగ్రెస్ పార్టీలో చేరుతారనే ప్రచారం సాగుతోంది.

కారణమిదే: బాబు ముందు రేవంత్ 3 ప్రతిపాదనలు, జైపాల్‌రెడ్డి చక్రం తిప్పారా?కారణమిదే: బాబు ముందు రేవంత్ 3 ప్రతిపాదనలు, జైపాల్‌రెడ్డి చక్రం తిప్పారా?

తెలుగుదేశం పార్టీలో చేరడమే కాదు అంచెలంచెలుగా అనతికాలంలోనే పార్టీలో అత్యున్నత స్థానానికి రేవంత్ రెడ్డి చేరుకొన్నారు. పార్టీలో సీనియర్లను పక్కనపెట్టి రేవంత్‌రెడ్డికి టిడిపి నాయకత్వం ప్రాధాన్యత ఇచ్చింది.

రాహూల్‌తో రేవంత్ భేటీ, నవంబర్ 9న, కాంగ్రెస్‌లోకి?రాహూల్‌తో రేవంత్ భేటీ, నవంబర్ 9న, కాంగ్రెస్‌లోకి?

తెలంగాణ టిడిపి వర్కింగ్ ప్రెసిడెంట్ పదవిని రేవంత్‌రెడ్డికి చంద్రబాబునాయుడు కట్టబెట్టారు. రెండో దఫా టిడిపి వర్కింగ్ ప్రెసిడెంట్ పదవిలో రేవంత్‌రెడ్డి కొనసాగుతున్నారు.

అయితే ఢిల్లీలో ఎఐసిసి ఉపాధ్యక్షుడు రాహూల్ గాంధీని టిడిపి తెలంగాణ వర్కింగ్ ప్రెసిడెంట్ రేవంత్ రెడ్డి కలిశారని ప్రచారం సాగుతోంది. ఈ ప్రచారం టిడిపి వర్గాల్లో కలకలాన్ని రేపుతోంది.

టిడిపిలోకి రేవంత్‌రెడ్డి ఎలా చేరాడంటే

టిడిపిలోకి రేవంత్‌రెడ్డి ఎలా చేరాడంటే

ఉమ్మడి ఏపీ రాష్ట్రంలో టిడిపిలోకి రేవంత్‌రెడ్డి అనుహ్యంగా చేరారు. 2004 తర్వాత కల్వకుర్తి నియోజకవర్గంలో జరిగిన జడ్‌పిటిసి ఎన్నికల్లో స్వతంత్ర్య అభ్యర్థిగా రేవంత్‌రెడ్డి బరిలోకి దిగారు. అప్పటి కల్వకుర్తి ఎమ్మెల్యే ఎడ్మ కిష్టారెడ్డికి వ్యతిరేకంగా టిడిపి, సిపిఐ, సిపిఎం, బిజెపి, టిఆర్ఎస్‌ పక్షాలను కూడగట్టారు.

ఆ ఎన్నికల్లో జడ్‌పిటిసిగా రేవంత్‌రెడ్డి విజయం సాధించారు.స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఎన్నికల్లో కాంగ్రెస్ అభ్యర్థి జగదీశ్వర్‌రెడ్డిపై 2008లో రేవంత్‌రెడ్డి విజయం సాధించారు. ఈ ఎన్నికల్లో రేవంత్‌రెడ్డికి టిడిపి మద్దతిచ్చింది. ఎన్నికల్లో ఎమ్మెల్సీగా విజయం సాధిస్తే టిడిపిలో చేరుతానని రేవంత్‌రెడ్డి చంద్రబాబుకు చెప్పారు.

తొలుత చంద్రబాబుతో ఈ విషయమై రేవంత్‌రెడ్డి ఫోన్‌లో మాట్లాడారు. బాబు గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు. అంచనాలను తలకిందులు చేస్తూ రేవంత్ స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఎన్నికల్లో మహబూబ్ నగర్ నుండి విజయం సాధించారు.. ఎమ్మెల్సీగా విజయం సాధించాక రేవంత్ రెడ్డి టిడిపిలో చేరారు.కాంగ్రెస్ పార్టీకి బలం ఉండి కూడ ఈ స్థానంలో ఓటమిపాలు కావడం గమనార్హం.

పార్టీలో అత్యున్నత స్థానానికి రేవంత్ రెడ్డి

పార్టీలో అత్యున్నత స్థానానికి రేవంత్ రెడ్డి


తెలంగాణ టిడిపిలో రేవంత్‌రెడ్డి అనతికాలంలోనే అత్యున్నతస్థాయికి ఎదిగారు. ఉమ్మడి ఏపీ రాష్ట్రంలో టిడిపి కమిటీలో కూడ రేవంత్‌కు పార్టీలో ప్రాధాన్యత లభించింది. తెలంగాణ ఉద్యమం సాగుతున్న సమయంలో తెలంగాణ ప్రాంతానికి చెందిన కొందరు సీనియర్లు పార్టీని వీడడం కూడ రేవంత్‌రెడ్డికి కలిసివచ్చింది. తెలంగాణ ఉద్యమం విషయమై పార్టీ సీనియర్ నాయకుడు నాగం జనార్థన్‌రెడ్డి పార్టీకి దూరమయ్యారు. అయితే రేవంత్‌కు పార్టీలో ప్రాధాన్యత పెరగడం , తనకు ప్రాధాన్యత తగ్గిందనే భావనతో నాగం ఆ సమయంలో చంద్రబాబుతో అగాధం పెరిగిందనే ప్రచారం కూడ పార్టీలో ఉంది.

2009లో కొడంగల్ నుండి ఎమ్మెల్యేగా పోటీ

2009లో కొడంగల్ నుండి ఎమ్మెల్యేగా పోటీ


ఎమ్మెల్సీగా ఉంటూనే 2009 ఎన్నికల్లో ఉమ్మడి మహబూబ్‌నగర్ జిల్లా కొడంగల్ అసెంబ్లీ స్థానం నుండి టిడిపి అభ్యర్థిగా రేవంత్‌రెడ్డి పోటీ చేసి విజయం సాధించారు. ఈ ఎన్నికల్లో రేవంత్‌రెడ్డి కాంగ్రెస్ పార్టీకి చెందిన గుర్నాథ్‌రెడ్డిపై పోటీ చేసి విజయం సాధించారు. ఈ నియోజకవర్గం నుండి బలమైన అభ్యర్థిని నిలపాలని చంద్రబాబునాయుడు భావించారు. అయితే గుర్నాధ్‌రెడ్డిని ఎదుర్కోవాలంటే రేవంత్‌రెడ్డి ప్రయోగం పలితాన్ని ఇచ్చింది. స్థానిక టిడిపి నేతలను కలుపుకొని రేవంత్ విజయం సాధించారు. 2014 ఎన్నికల్లో కూడ రేవంత్ రెడ్డి ఇదే నియోజకవర్గం నుండి మరోసారి టిడిపి అభ్యర్థిగా పోటీచేసి విజయం సాధించారు..

ఓటుకు నోటు కేసు పెద్ద దెబ్బ

ఓటుకు నోటు కేసు పెద్ద దెబ్బ


2014 ఎన్నికల ఫలితాలు వచ్చాక తెలంగాణలో టిడిపి 15 అసెంబ్లీ, 1 పార్లమెంట్ స్థానంలో విజయం సాధించింది. అయితే తెలంగాణలో టిడిపి ఎమ్మెల్యేలను టిఆర్ఎస్ ఫిరాయింపులను ప్రోత్సహించింది. టిడిపి ఎమ్మెల్యేలు టిఆర్ఎస్‌లో చేరారు. అయితే అదే సమయంలో జరిగిన ఎమ్మెల్సీ ఎన్నికల్లో టిడిపి అభ్యర్థిగా వేం నరేందర్‌రెడ్డిని బరిలోకి దింపింది. అయితే నామినేటేడ్ ఎమ్మెల్యే స్టీఫెన్‌సన్‌కు డబ్బులు ఇస్తూ ఏసీబీకి రేవంత్‌రెడ్డి చిక్కారు. అయితే టిఆర్ఎస్ ప్రభుత్వం పన్నిన కుట్రే ఏసీబీ కేసు అని రేవంత్ రెడ్డి అంటుంటారు.

మంచి ఫాలోయింగ్ ఉన్న నేత

మంచి ఫాలోయింగ్ ఉన్న నేత

తెలంగాణ ముఖ్యమంత్రి కెసిఆర్ తన మాటలతో ప్రజలను మంత్ర ముగ్దులను చేస్తారు. రేవంత్ రెడ్డి కూడ తన ప్రచారంతో ప్రజలను ఆకట్టుకొంటారు. రాష్ట్ర ప్రభుత్వం అనుసరిస్తున్న విధానాలపై రేవంత్ ఒంటికాలితో విమర్శలు ఎక్కుపెట్టేవారు. తెలంగాణలో ముఖ్యమంత్రి కెసిఆర్ తర్వాత జనాధరణలో రేవంత్ రెడ్డి ద్వితీయ స్థానంలో ఉన్నారని సర్వేనివేదికలు వెల్లడిస్తున్నాయి. అయితే టిడిపిని వీడి కాంగ్రెస్‌లో చేరితే రేవంత్ రెడ్డికి కాంగ్రెస్ పార్టీ ఏ రకమైన గౌరవాన్ని ఇస్తోందనే విషయమై స్పష్టత రావాల్సి ఉంది.

English summary
Telangana Tdp working president Revanth Reddy may join in Tdp soon. There is a spreading a rumour Revanth reddy met AICC vice president Rahul Gandhi at Delhi on Tuesday.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X