రేపు తెలంగాణ టెట్ ఫలితాలు

హైదరాబాద్: తెలంగాణ రాష్ట్రంలో ఉపాధ్యాయు అర్హత పరీక్ష (TET) ఫలితాలు సెప్టెంబర్ 27న వెలువడనున్నాయి. సెప్టెంబర్ 15న టెట్ పరీక్ష జరిగిన విషయం తెలిసిందే. పేపర్-1కు 2.26 లక్షల మంది అభ్యర్థులు, పేపర్-2కు 1.90 లక్షల మంది హాజరయ్యారు. సెప్టెంబ్ 27న ఫలితాలు ఇచ్చేందుకు సిద్ధంగా ఉన్నామని, తుది నిర్ణయం ఉన్నతాధికారులు తీసుకుంటారని ఎస్‌సీఈఆర్టీ వర్గాలు వెల్లడించాయి.

కాగా, సెప్టెంబర్ 15న విద్యాశాఖ రాష్ట్రవ్యాప్తంగా 2,052 కేంద్రాల్లో ఉపాధ్యాయ అర్హత పరీక్షను నిర్వహించిన విషయం తెలిసిందే. పరీక్ష కోసం దాదాపు 4,78,055 మంది అభ్యర్థులు దరఖాస్తు చేసుకున్నారు. ఇందులో పేపర్‌-1కు 2,69,557 మంది, పేపర్‌-2కు 2,08,498 మంది చేసుకున్నారు.

 Telangana TET 2023 results will be released tomorrow.

పేపర్-1 పరీక్షను 2,26,744 (84.12శాతం) రాశారు. బీఈడీ విద్యార్థులకే అర్హత ఉన్న పేపర్-2 పరీక్షను 91.11 శాతం మంది రాశారు. ఉదయం 9.30 నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకు పేపర్‌-1 పరీక్ష జరుగగా.. మధ్యాహ్నం 2.30 నుంచి సాయంత్రం ఐదు గంటల వరకు పేపర్‌-2 రాతపరీక్ష నిర్వహించింది.

పేపర్-1కు 2 లక్షల 69 వేల 557 మంది దరఖాస్తు చేయగా.. 1139 కేంద్రాలు ఏర్పాటు చేశారు. పేపర్ టూ 2 లక్షల 8 వేల 498 రాయగా.. 913 పరీక్ష కేంద్రాలను సిద్ధం చేశారు. మొబైల్ ఫోన్లు, ఎలక్ట్రానిక్ పరికరాలను ఎగ్జామ్ హాల్​లోకి అనుమతించలేదు. సెప్టెంబర్ 27న టెట్ ఫలితాలు విడుదల కానున్నాయి. కాగా, ప్రభుత్వ ఉపాధ్యాయులుగా నియమితులు కావాలంటే టెట్‌లో క్వాలిఫై కావడం తప్పనిసరి అని తెలిసిందే.

సీటీఈటీ ఫలితాలు విడుదల

ఆగస్టు 20న నిర్వహించిన కేంద్ర ఉపాధ్యాయ అర్హత పరీక్ష (సీటీఈటీ) ఫలితాలను సెంట్రల్ బోర్డ్ ఆఫ్ సెకండరీ ఎడ్యుకేషన్ విడుదల చేసింది. ఫలితాల కోసం https://ctet.nic.in ను సంప్రదించవచ్చని సీబీఎస్ఈ సూచించింది.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+