హైదరాబాద్ లో 100 కు పైగా ఎకరాల్లో..

ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కీలక ప్రకటన చేశారు. డిసెంబర్ 2027 నాటికి తెలంగాణ హైకోర్టు నూతన భవన సముదాయ నిర్మాణం పూర్తి చేయనున్నట్లు వెల్లడించారు. హైకోర్టు కాంప్లెక్స్‌తో పాటు రాష్ట్రంలోని వివిధ నగరాలు, పట్టణాల్లో మొత్తం 49 కోర్టులు, నివాస భవనాల నిర్మాణ పనులను ప్రభుత్వం చేపడుతోందని తెలిపారు. తమ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన వెంటనే తీసుకున్న తొలి నిర్ణయాల్లో కొత్త హైకోర్టు సముదాయ నిర్మాణం ఒకటని గుర్తు చేశారు.

రంగారెడ్డి జిల్లా రాజేంద్రనగర్‌లోని తెలంగాణ హైకోర్టు జోన్-2 కాంప్లెక్స్ శంకుస్థాపన కార్యక్రమంలో రేవంత్ రెడ్డి పాల్గొన్నారు. సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ సూర్యకాంత్ ఈ భవన సముదాయాల నిర్మాణానికి శంకుస్థాపన చేశారు. రేవంత్ రెడ్డితో పాటు సుప్రీంకోర్టు న్యాయమూర్తులు జస్టిస్ పీఎస్ నరసింహ, జస్టిస్ ఉజ్జల్ భుయాన్, జస్టిస్ ఎస్ వీ భట్టి, జస్టిస్ అలోక్ ఆరాధే హాజరయ్యారు.

Telangana to Complete New High Court Complex by 2027 Setting a National Benchmark in Justice Infra

తెలంగాణ హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ అపరేష్ కుమార్ సింగ్, జస్టిస్ పీ శామ్ కోషి, ఇతర హైకోర్టు న్యాయమూర్తులు, మాజీ సీజేఐ జస్టిస్ ఎన్ వీ రమణ, జస్టిస్ సుభాష్ రెడ్డి, ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి రామకృష్ణ రావు, డీజీపీ బీ శివధర్ రెడ్డి సహా పలువురు మాజీ న్యాయమూర్తులు, న్యాయ నిపుణులు, ఉన్నతాధికారులు కూడా ఈ వేడుకలో పాల్గొన్నారు.

ప్రతిపాదిత 100 ఎకరాల జ్యుడీషియల్ సిటీలో భాగమైన జోన్-2 కాంప్లెక్స్‌కు భూమిపూజ ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా నిర్మించబోయే భవనాల నమూనా ప్రదర్శనను కూడా అతిథులు పరిశీలించారు. ఈ సందర్భంగా రేవంత్ రెడ్డి మాట్లాడారు. ఈ భవన సముదాయం కోసం రాజేంద్రనగర్‌లో 100 ఎకరాలకు పైగా భూమిని కేటాయించినట్లు వివరించారు. జోన్- 1లో పనులు వేగంగా జరుగుతున్నాయని పేర్కొన్నారు.

ఇందులో భాగంగా జోన్-2 కింద నివాస భవనాలకు శంకుస్థాపన పూర్తయిందని, 2027 డిసెంబర్ నాటికి అన్ని పనులను పూర్తి చేయడమే లక్ష్యమని ఆయన స్పష్టం చేశారు. న్యాయవ్యవస్థకు అత్యుత్తమ మౌలిక సదుపాయాలను కల్పించడం కార్యనిర్వాహక వ్యవస్థకు కీలక బాధ్యత అని వ్యాఖ్యానించారు రేవంత్ రెడ్డి. ప్రతిపాదిత కాంప్లెక్స్ దేశంలోనే అతిపెద్ద వాటిలో ఒకటిగా నిలుస్తుందని, ఆధునిక సదుపాయాలు, మౌలిక వసతులకు ఒక రోల్ మోడల్ గా నిలుస్తుందని అన్నారు.

ప్రజాస్వామ్యంలో శాసనసభ, కార్యనిర్వాహకవర్గం, న్యాయవ్యవస్థ పరస్పర గౌరవంతో, ఆధారపడటంతో పనిచేస్తాయని, న్యాయం కోరే పౌరులకు కోర్టులే అంతిమ వేదిక అని పేర్కొన్నారు. కొత్త హైకోర్టు భవనం న్యాయానికి, ప్రజాస్వామ్యానికి ప్రతీకగా నిలుస్తుందని, తరతరాలుగా నిరుపేదలు, బలహీన వర్గాలు, అట్టడుగు వర్గాలకు సేవలందిస్తుందని రేవంత్ రెడ్డి అన్నారు. కోర్టు సముదాయాన్ని నిర్మించడం అనేది న్యాయానికి అంకితమైన పవిత్ర స్థలాన్ని సృష్టించడంతో సమానం గా అభివర్ణించారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+