సివిల్స్ అభ్యర్థుల పైశాచికమిదే: సరదా కోసం షాపులకు నిప్పుపెట్టారు(పిక్చర్స్)

హైదరాబాద్‌: వారిద్దరూ సివిల్స్‌ పరీక్షలకు సన్నద్ధమవుతున్నవారే. కానీ ఆ ఇద్దరు యువకులు తాగినమత్తులో..పైశాచికానందంలో ఐదు దుకాణాలకు నిప్పుపెట్టారు. సీసీ కెమెరా ఫుటేజీ ఆధారంగా ఇద్దరు నిందితులను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఉత్తరమండలం డీసీపీ ప్రకాశ్‌రెడ్డి బుధవారం మీడియా సమావేశంలో వివరాలను వెల్లడించారు.

కొండాపూర్‌లోని 8వ బెటాలియన్‌లో డీఎస్పీగా పనిచేస్తున్న టివి హనుమంతరావు కుమారుడు టి చిరంజీవి(23) కొద్దినెలల నుంచి సివిల్స్‌, స్టాఫ్‌ సెలక్షన్‌ కమిషన్‌ పరీక్షల కోసం సిద్ధమవుతున్నాడు. తెలంగాణ వైద్యవిధాన పరిషత్‌లో ఇంజినీర్‌గా విధులు నిర్వహిస్తున్న కెవి ష్ణంరాజు కుమారుడు జయేంద్రవర్మ(24).. చిరంజీవి క్లాస్‌మేట్. వీరిద్దరూ కలిసి గదిలో చదుకోవడం, బయటకు వెళ్లడం, పుస్తకాలు తీసుకోవడం వంటివి చేసేవారు.

అంతేగాక, తల్లిదండ్రులకు తెలీకుండా రాత్రి వేళల్లో బయట తిరుగుతూ మద్యం తాగి జల్సాలు చేస్తుండేవారు. ఈ క్రమంలోనే సోమవారం రాత్రి చిరంజీవి, జయేంద్రవర్మలు నాగోల్‌ క్రాస్‌రోడ్స్‌ వద్ద మోతాదుకు మించి మద్యం సేవించారు. అర్ధరాత్రి దాటాక 2.30గంటలకు మార్కెట్‌ పోలీస్‌ స్టేషన్ వద్దకు చేరుకుని ఠాణా ప్రహరీకి అనుకుని ఉన్న రెండు దుకాణాలకు నిప్పుపెట్టారు.

అగ్నిమాపక యంత్రం వచ్చేవరకూ అక్కడే ఉండి అనంతరం సికింద్రాబాద్‌ రైల్వేస్టేషన్‌ ఎదురుగా ఉన్న ఆల్ఫాహోటల్‌ వద్దకు చేరుకున్నారు. మంగళవారం తెల్లవారుజామున 4గంటల ప్రాంతంలో అక్కడ మరో మూడు దుకాణాలకు నిప్పుపెట్టారు. ఆల్ఫాహోటల్‌ కాపలాదారు మంటలను గమనించి పోలీసులకు సమాచారమివ్వగా... వారు ఘటనా స్థలానికి చేరుకున్నారు.

అగ్నిమాపక యంత్రాన్ని రప్పించి మంటలను ఆర్పించారు. ఆ సమయంలో అక్కడే ఉన్న చిరంజీవి, జయేంద్రవర్మలను పోలీసులు ప్రశ్నించి, వివరాలు తీసుకుని పంపించేశారు. అనంతరం సీసీటీవీ కెమెరా ఫుటేజీని పరిశీలించగా... జయేంద్రవర్మ అగ్గిపెట్టెతో అంటించిన దృశ్యాలు కనిపించాయి.

దీంతో మరిన్ని సాక్ష్యాధారాలు సేకరించిన అనంతరం మంగళవారం సాయంత్రం ఇద్దరు యువకులను అదుపులోకి తీసుకుని విచారించారు. వారు నేరాన్ని అంగీకరించడంతో బుధవారం కేసు నమోదు చేసి జ్యుడిషియల్‌ కస్టడీకి తరలించారు. కాగా, చిరంజీవి, జయేంద్రవర్మలు మార్చి 16న ఆల్ఫాహోటల్‌ సమీపంలో కారు నిర్లక్ష్యంగా నడిపినందుకు రూ.1000 జరిమానా కూడా చెల్లించినట్లు పోలీసులు తెలిపారు.

సరదా కోసం షాపులకు నిప్పుపెట్టారు

సరదా కోసం షాపులకు నిప్పుపెట్టారు

వారిద్దరూ సివిల్స్‌ పరీక్షలకు సన్నద్ధమవుతున్నవారే. కానీ ఆ ఇద్దరు యువకులు తాగినమత్తులో..పైశాచికానందంలో ఐదు దుకాణాలకు నిప్పుపెట్టారు.

సరదా కోసం షాపులకు నిప్పుపెట్టారు

సరదా కోసం షాపులకు నిప్పుపెట్టారు

సీసీ కెమెరా ఫుటేజీ ఆధారంగా ఇద్దరు నిందితులను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఉత్తరమండలం డీసీపీ ప్రకాశ్‌రెడ్డి బుధవారం మీడియా సమావేశంలో వివరాలను వెల్లడించారు.

సరదా కోసం షాపులకు నిప్పుపెట్టారు

సరదా కోసం షాపులకు నిప్పుపెట్టారు

కొండాపూర్‌లోని 8వ బెటాలియన్‌లో డీఎస్పీగా పనిచేస్తున్న టివి హనుమంతరావు కుమారుడు టి చిరంజీవి(23) కొద్దినెలల నుంచి సివిల్స్‌, స్టాఫ్‌ సెలక్షన్‌ కమిషన్‌ పరీక్షల కోసం సిద్ధమవుతున్నాడు.

సరదా కోసం షాపులకు నిప్పుపెట్టారు

సరదా కోసం షాపులకు నిప్పుపెట్టారు

తెలంగాణ వైద్యవిధాన పరిషత్‌లో ఇంజినీర్‌గా విధులు నిర్వహిస్తున్న కెవి ష్ణంరాజు కుమారుడు జయేంద్రవర్మ(24).. చిరంజీవి క్లాస్‌మేట్. వీరిద్దరూ కలిసి గదిలో చదుకోవడం, బయటకు వెళ్లడం, పుస్తకాలు తీసుకోవడం వంటివి చేసేవారు.

సరదా కోసం షాపులకు నిప్పుపెట్టారు

సరదా కోసం షాపులకు నిప్పుపెట్టారు

అంతేగాక, తల్లిదండ్రులకు తెలీకుండా రాత్రి వేళల్లో బయట తిరుగుతూ మద్యం తాగి జల్సాలు చేస్తుండేవారు. ఈ క్రమంలోనే సోమవారం రాత్రి చిరంజీవి, జయేంద్రవర్మలు నాగోల్‌ క్రాస్‌రోడ్స్‌ వద్ద మోతాదుకు మించి మద్యం సేవించారు.

సరదా కోసం షాపులకు నిప్పుపెట్టారు

సరదా కోసం షాపులకు నిప్పుపెట్టారు

అర్ధరాత్రి దాటాక 2.30గంటలకు మార్కెట్‌ పోలీస్‌ స్టేషన్ వద్దకు చేరుకుని ఠాణా ప్రహరీకి అనుకుని ఉన్న రెండు దుకాణాలకు నిప్పుపెట్టారు.

సరదా కోసం షాపులకు నిప్పుపెట్టారు

సరదా కోసం షాపులకు నిప్పుపెట్టారు

అగ్నిమాపక యంత్రం వచ్చేవరకూ అక్కడే ఉండి అనంతరం సికింద్రాబాద్‌ రైల్వేస్టేషన్‌ ఎదురుగా ఉన్న ఆల్ఫాహోటల్‌ వద్దకు చేరుకున్నారు. మంగళవారం తెల్లవారుజామున 4గంటల ప్రాంతంలో అక్కడ మరో మూడు దుకాణాలకు నిప్పుపెట్టారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+