వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

ఆపద: ఫిలిప్పీన్ మహిళని ఆదుకున్న 'తెలంగాణ', మెదక్‌లో హరీష్.. (పిక్చర్స్)

By Srinivas
|
Google Oneindia TeluguNews

హైదరాబాద్/మెదక్: ఆపదలో ఉన్న ఫిలిప్పీన్స్ మహిళకు తెలంగాణ పర్యాటక శాఖ బాసటగా నిలిచింది. ఆమెకు అవసరమైన వైద్యసాయం అందించడంతో పాటు స్వదేశానికి పంపించేందుకు టిక్కెట్ కొనుగోలు చేసి ఇచ్చింది. ఫిలిప్పీన్స్‌కు చెందిన గ్రేస్ అలెగ్జాండ్రియా దుబాయ్‌లో నర్సుగా పని చేస్తోంది.

నిండు గర్భిణి అయిన ఆమె గత నెల 17న తన తల్లిదండ్రుల వద్దకు వెళ్లేందుకు దుబాయ్ నుంచి ఫిలిప్పీన్స్ రాజధాని మనీలాకు బయలుదేరింది. విమానంలోనే ప్రసవించిన ఆమె ఆడబిడ్డకు జన్మను ఇచ్చింది. శిశువు పరిస్థితి విషమంగా ఉండటంతో పైలట్ విమానాన్ని శంషాబాద్ విమానాశ్రయంలో ఎమర్జెన్సీ ల్యాండింగ్ చేశారు.

అక్కడి సిబ్బంది తల్లిని, బిడ్డను అపోలో ఆసుపత్రికి తరలించారు. మూడు రోజుల క్రితం పాప చనిపోయింది. దుఖంలో ఉన్న ఆ మహిళకు.. చిన్నారి అంత్యక్రియలకు ఆటంకాలు ఎదురయ్యాయి. పోలీసుల ద్వారా సమాచారం తెలుసుకున్న పర్యాటక శాఖ కార్యదర్శి బుర్రా వెంకటేశం ఆసుపత్రికెళ్లి మహిళను పరామర్శించారు.

బుర్రా వెంకటేశం

బుర్రా వెంకటేశం

ఆపదలో ఉన్న ఫిలిప్పీన్స్ మహిళను ఆదుకునేందుకు తెలంగాణ పర్యాటక శాఖ ముందుకు వచ్చింది. పర్యాటక శాఖ కార్యదర్శి బుర్రా వెంకటేశం బాధిత మహిళను ఆసుపత్రిలో పరామర్శిస్తున్న దృశ్యం.

మెదక్ ప్రమాదం ప్రాంతంలో హరీష్ రావు

మెదక్ ప్రమాదం ప్రాంతంలో హరీష్ రావు

మరోవైపు, మెదక్ జిల్లా కంగ్టి మండలం దేవ్లాతండా వద్ద ఆదివారం రాత్రి జరిగిన విద్యుత్ షాక్ ప్రమాదంలో ఏడుగురు మృతిచెందిన ఘటనలో బాధిత కుటుంబాలకు ఒక్కొక్కరికీ రూ.6 లక్షల చొప్పున పరిహారం అందచేస్తామని, మంగళవారంలోపే బాధిత కుటుంబ సభ్యులకు ఇస్తామని మంత్రి హరీశ్ రావు చెప్పారు.

మెదక్ ప్రమాదం ప్రాంతంలో హరీష్ రావు

మెదక్ ప్రమాదం ప్రాంతంలో హరీష్ రావు

సోమవారం మధ్యాహ్నం రాంసింగ్‌తండాలో మృతుల అంత్యక్రియలకు మంత్రి హరీశ్‌రావు, డిప్యూటీ స్పీకర్ పద్మా దేవేందర్ రెడ్డితో కలిసి హాజరయ్యారు. ఈ సందర్భంగా హరీశ్‌రావు మాట్లాడారు. ఈ ఘటన దురదృష్టకరమని, ఒకే కుటుంబంలోని ఐదుగురు ప్రా ణాలు కోల్పోవడం విచారకరమన్నారు.

 మెదక్ ప్రమాదం ప్రాంతంలో హరీష్ రావు

మెదక్ ప్రమాదం ప్రాంతంలో హరీష్ రావు

అంత్యక్రియల ఖర్చును కూడా ప్రభుత్వమే భరిస్తుందని చెప్పారు. గాయపడిన 15 మంది పూర్తిగా కోలుకునే వరకు ప్రభుత్వ ఖర్చుతోనే మెరుగైన చికిత్స అందిస్తామన్నారు.

మెదక్ ప్రమాదం ప్రాంతంలో హరీష్ రావు

మెదక్ ప్రమాదం ప్రాంతంలో హరీష్ రావు

వారి పిల్లల చదువు బాధ్యతను ప్రభుత్వమే చూసుకుంటుందన్నారు. బాధిత కుటుంబాలు కోలుకునే వరకు పూర్తి సహకారం అందించేందుకు ఇద్దరు రెవెన్యూ అధికారుల ను ప్రత్యేకంగా నియమిస్తున్నట్లు చెప్పారు.

 మెదక్ ప్రమాదం ప్రాంతంలో హరీష్ రావు

మెదక్ ప్రమాదం ప్రాంతంలో హరీష్ రావు

విద్యుత్ తీగల కారణంగా జరిగిన ఈ దుర్ఘటన బాధ్యులపై చర్యలు తీసుకుంటామన్నారు. ఇవి పునరావృతం కాకుండా అదనపు నిధులు వెచ్చించైనా విద్యుత్ లైన్లను క్రమబద్ధీకరిస్తామన్నారు. మృతుల కుటుంబీకులను చూసి హరీష్ రావు చలించిపోయారు.

 మెదక్ ప్రమాదం ప్రాంతంలో హరీష్ రావు

మెదక్ ప్రమాదం ప్రాంతంలో హరీష్ రావు

ఆదుకోవడం ప్రభుత్వ బాధ్యతని మంత్రి హరీష్ రావు భరోసా ఇచ్చారు. హరీష్ రావుతో పాటు జహీరాబాద్ ఎంపీ బీబీ పాటిల్, ఎమ్మెల్యే భూపాల్ రెడ్డి, కలెక్టర్ రోనాల్డ్ రాస్, జేసీ వెంకట్రామ్ రెడ్డి తదితరులు అంత్యక్రియల్లో పాల్గొన్నారు.

ఆమె పరిస్థితిని చూసి, విని బుర్రా వెంకటేశం చలించిపోయారు. ప్రభుత్వం తరఫున ఆదుకుంటామని చెప్పారు. తిరుమలగిరి స్మశానంలో మృతదేహానికి అంత్యక్రియలు నిర్వహించారు. ఆ మహిళ గ్రేస్ అలెగ్జాండిర్యాకు వైద్య చికిత్సలో రాయితీ ఇచ్చేందుకు ఆసుపత్రి వర్గాలు అంగీకరించాయి. మిగిలిన మొత్తాన్ని తాము చెల్లిస్తామని బుర్రా వెంకటేశం చెప్పారు. దీంతో పాటు ఆమె ఫిలిప్పీన్స్ వెళ్లేందుకు విమాన టిక్కెట్ కొనుగోలు చేసి ఇచ్చారు.

English summary
Telangana Tourism secretary helps Philippines woman.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X