కెసిఆర్ మెప్పుకోసం.. అలాంటి గ్రామాల వెతుకులాటలో నాయకులు?
హైదరాబాద్: తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర రావు సోమవారం నాడు గ్రామజ్యోతి కార్యక్రమాన్ని ప్రారంభించారు. వరంగల్ జిల్లా గంగదేవిపల్లిలో దీనిని ప్రారంభించారు. ప్రజాప్రతినిధులు ఒక్కో గ్రామాన్ని దత్తత తీసుకోవాలని ఆయన సూచించారు.
ఈ నేపథ్యంలో పలువురు టిఆర్ఎస్ నేతలు, ఎమ్మెల్సీలు, ఇతర నాయకులు త్వరగా అభివృద్ధి అయ్యే గ్రామాలను లేదా బాగా ఉన్న గ్రామాలను దత్తత తీసుకునే యోచనలో ఉన్నట్లుగా వార్తలు వస్తున్నాయి.
తాము దత్తత తీసుకున్న గ్రామాలను త్వరగా అభివృద్ధి చేయడం లేదా అభివృద్ధి జరగడం ద్వారా తాము ముఖ్యమంత్రి కెసిఆర్ దృష్టిలో పడవచ్చునని పలువురు భావిస్తున్నారంటున్నారు.

ఒక్కో మంత్రి కనీసం ఐదు గ్రామాలను దత్తత తీసుకోవాలని,క ఒక్కో ఎమ్మెల్యే తమ నియోజకవర్గంలోని ప్రతి మండలంలో ఓ గ్రామాన్ని దత్తత తీసుకోవాలని, అదేవిధంగా ఎమ్మెల్సీ సొంత గ్రామాన్ని లేదా జిల్లాలోని ఓ గ్రామాన్ని దత్తత తీసుకోవాలని చెబుతున్నారు.
గ్రామాలను దత్తత తీసుకునేందుకు టిఆర్ఎస్ నాయకులు గ్రామాల వెతుకులాటలో పడ్డారని అంటున్నారు. 'బాగా' ఉన్న గ్రామాలను దత్తత తీసుకొని, త్వరగా అభివృద్ధిని చూపించడం ద్వారా కెసిఆర్ కళ్లల్లో పడాలని భావిస్తున్నారని చెబుతున్నారు. ఇందుకోసం ఆయా గ్రామాల నాయకుల నుండి ఫీడ్ బ్యాక్ తీసుకుంటున్నారని తెలుస్తోంది.












Click it and Unblock the Notifications