మోడీతో కెసిఆర్ భేటీ ఫలితం: ఏటా రూ.3వేల కోట్ల అదనపు సాయం!

Subscribe to Oneindia Telugu

న్యూఢిల్లీ/హైదరాబాద్: ఇటీవల ఢిల్లీలో జరిగిన అంతరాష్ట్ర భద్రతా మండలి సమావేశానికి హాజరైన సందర్భంలో తెలంగాణ ముఖ్యమంత్రి కె చంద్రశేఖర్‌రావు.. ప్రధాని నరేంద్ర మోడీతో జరిపిన ప్రత్యేక భేటీ ఫలితాలు రూపుదాల్చుతున్నాయి. ప్రధాని దృష్టికి తీసుకెళ్లిన ప్రధానమైన అంశాలలో దాదాపు అన్నింటిపైనా కేంద్రం సానుకూలంగా స్పందించినట్టు రాష్ట్రానికి తీపికబురు అందింది.

కాగా, ద్రవ్య పరిపతి యాజమాన్య నిర్వహణ (ఎఫ్‌ఆర్‌బిఎం) పెంపు, ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి రాజీవ్ శర్మ పదవీకాలం పెంపు, మిషన్ కాకతీయకు ఆర్థిక సాయం, మిషన్ భగీరథకు కేంద్రం పూచికత్తువంటి అన్ని అంశాలపై కేంద్రం సానుకూలంగా స్పందించినట్టు తెలంగాణకు సమాచారం చేరింది.

ఎఫ్‌ఆర్‌బిఎం పరపతి పెంచడంతో రాష్ట్రం ఏటా అదనంగా రూ.3 వేల కోట్ల ఆర్థిక సాయం పొందేందుకు వెసులుబాటు లభించనుంది. దీనికి సంబంధించిన ఉత్తర్వులు త్వరలో వెలువడనున్నట్టు తెలిసింది. రాష్ట్ర పర్యటనకు వచ్చిన కేంద్ర ఆర్థిక మంత్రి అరుణ్‌జైట్లీ ముఖ్యమంత్రితో భేటీ అయిన సందర్భంలో కేంద్రం నిర్ణయాలను తెలియజేసినట్టు సమాచారం.

ఎఫ్‌ఆర్‌బిఎం పరిమితి ఏమేరకు పెంచాలో కేంద్ర కేబినెట్ ఆమోదించిన విషయాన్నీ సీఎం కెసిఆర్‌కు వివరించినట్టు అధికార వర్గాల సమాచారం. మిగులు బడ్జెట్ కలిగిన రాష్ట్రాలకు మాత్రమే ఎఫ్‌ఆర్‌బిఎం పరిమితి పెంపు వర్తిస్తుంది. దేశంలో మిగులు బడ్జెట్ కలిగిన రాష్ట్రాలు గుజరాత్, తెలంగాణ మాత్రమే. ఈ రెండు రాష్ట్రాలకు ఎఫ్‌ఆర్‌బిఎం 3.5 శాతం పెంచాలని నీతి ఆయోగ్ సిఫారసు చేసింది.

ఈ సిఫారసును గత బుధవారం జరిగిన కేంద్ర మంత్రి మండలి ఆమోదించడంతో ఎంతోకాలంగా తెలంగాణ ప్రభుత్వం చేస్తున్న డిమాండ్ ఫలించినట్టయ్యింది. రాష్ట్రానికి చెందిన ముఖ్యమైన పెండింగ్ అంశాల్లో ఎఫ్‌ఆర్‌బిఎం పరిమితి పెంపు ఒకటి.

కొత్తగా ఏర్పడిన తమ రాష్ట్రంలో సాగునీటి ప్రాజెక్టులకు పెద్దమొత్తంలో నిధులు (ఏటా రూ.25 వేల కోట్లు) కేటాయించడంతో పాటు మిషన్ కాకతీయ, మిషన్ భగీరథ పథకాలకు 30నుంచి 40 వేల కోట్లు ఖర్చు చేస్తున్నామని, వీటివల్ల తమపై పడిన ఆర్థిక భారాన్ని కొంతలో కొంత తగ్గించుకోవడానికి ఎఫ్‌ఆర్‌బిఎం దోహదపడుతుందని ప్రధాని మోడీకి సిఎం కెసిఆర్ విజ్ఞప్తి చేశారు.

ప్రధాన మంత్రితో సిఎం కెసిఆర్ భేటీ సందర్భంగా ఆయన దృష్టికి తీసుకెళ్లిన అంశాలలో హైకోర్టు విభజన ఒక్కటి సుప్రీంకోర్టు పరిధిలో ఉండటంవల్ల, ఇప్పటికిప్పుడే నిర్ణయం తీసుకోలేమని, మిగిలిన అంశాలు అన్నింటిపైనా కేంద్రం నుంచి సానుకూల సంకేతాలు అందినట్టు అధికార వర్గాల ద్వారా తెలిసింది.

కాగా, మిషన్ కాకతీయకు కేంద్ర సాయం అందించడంతో పాటు, మిషన్ భగీరథ పథకానికి కేంద్రం పూచికత్తుతో రుణం పొందడానికి అవకాశం కల్పించే అంశాన్ని ఆగస్టు 7న రాష్ట్ర పర్యటనకు రానున్న ప్రధాని మోడీ స్వయంగా ప్రకటించనున్నారని సమాచారం.

మోడీ-కెసిఆర్

మోడీ-కెసిఆర్

ఇటీవల ఢిల్లీలో జరిగిన అంతరాష్ట్ర భద్రతా మండలి సమావేశానికి హాజరైన సందర్భంలో తెలంగాణ ముఖ్యమంత్రి కె చంద్రశేఖర్‌రావు.. ప్రధాని నరేంద్ర మోడీతో జరిపిన ప్రత్యేక భేటీ ఫలితాలు రూపుదాల్చుతున్నాయి.

మోడీ-కెసిఆర్

మోడీ-కెసిఆర్

ప్రధాని దృష్టికి తీసుకెళ్లిన ప్రధానమైన అంశాలలో దాదాపు అన్నింటిపైనా కేంద్రం సానుకూలంగా స్పందించినట్టు రాష్ట్రానికి తీపికబురు అందింది.

మోడీ-కెసిఆర్

మోడీ-కెసిఆర్

ద్రవ్య పరిపతి యాజమాన్య నిర్వహణ (ఎఫ్‌ఆర్‌బిఎం) పెంపు, ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి రాజీవ్ శర్మ పదవీకాలం పెంపు, మిషన్ కాకతీయకు ఆర్థిక సాయం, మిషన్ భగీరథకు కేంద్రం పూచికత్తువంటి అన్ని అంశాలపై కేంద్రం సానుకూలంగా స్పందించినట్టు తెలంగాణకు సమాచారం చేరింది.

మోడీతో కెసిఆర్

మోడీతో కెసిఆర్

ఎఫ్‌ఆర్‌బిఎం పరపతి పెంచడంతో రాష్ట్రం ఏటా అదనంగా రూ.3 వేల కోట్ల ఆర్థిక సాయం పొందేందుకు వెసులుబాటు లభించనుంది. దీనికి సంబంధించిన ఉత్తర్వులు త్వరలో వెలువడనున్నట్టు తెలిసింది.

ఇంకా వివాహం చేసుకోలేదా? తెలుగు మ్యాట్రిమోనిలో నేడే రిజిస్టర్ చేసుకోండి - రిజిస్ట్రేషన్ ఉచితం!

English summary
It said that Telangana state will get more funds from centre soon.

Oneindia బ్రేకింగ్ న్యూస్
రోజంతా తాజా వార్తలను పొందండి