ఏపీలో జూనియర్ సివిల్ జడ్జీగా తెలంగాణ యువతి ఎంపిక
హైదరాబాద్/అమరావతి: ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో సీనియర్ సివిల్ జడ్జీగా తెలంగాణ యువతిగా ఎంపికయ్యారు. ఏపీ హైకోర్టు నిర్వహించిన జూనియర్ సివిల్ జడ్జీ నియామక పరీక్ష ఫలితాల్లో తెలంగాణ రాష్ట్రానికి చెందిన యువతి అలేఖ్య(24) ప్రథమ స్థానం సాధించారు. హనుమకొండకు చెందిన మాదవీలత, పరిమి మనోజ్ కుమార్ దంపతుల కుమార్తె అలేఖ్య హైదరాబాద్ పెండేకంటి కాలేజీలో 2022లో న్యాయశాస్త్ర విభాగంలో ఉత్తీర్ణత సాధించారు.
ప్రస్తుతం ఉస్మానియా విశ్వవిద్యాలయంలో పీజీ రెండో సంవత్సరం చదువుతున్నారు. రంగారెడ్డి జిల్లా న్యాయస్థానంలో సీనియర్ సివిల్ జడ్జీగా పనిచేస్తున్న తల్లి మాధవీలతను స్ఫూర్తిగా తీసుకుని తానూ జడ్జీ కావాలని ఆకాంక్షించారు. ఆ దిశగా తన ప్రయత్నాలను కొనసాగించి అనుకున్న లక్ష్యం సాధించారు.

ఈ క్రమంలో గత సంవత్సరం ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర హైకోర్టు నియామకాల్లో అలేఖ్య ప్రథమ స్థానంలో నిలిచింది. దీంతో ఏపీ జూనియర్ సివిల్ జడ్జీగా ఎంపికయ్యారు. ఆమెను రంగారెడ్డి జిల్లా కోర్టుల న్యాయవాదుల సంఘం అధ్యక్షుడు దీకొండ రవీందర్, ప్రధాన కార్యదర్శి పట్టోళ్లమాధవరెడ్డి అభినందనలు తెలిపారు. చిన్న వయస్సులోనే జడ్జీగా ఎంపికైన అలేఖ్యకు నలువైపుల నుంచి అభినందనలు వెల్లువెత్తుతున్నాయి.












Click it and Unblock the Notifications