విషాదం: కారులో ప్రయాణిస్తూ వరదలో కొట్టుకుపోయిన ఎన్టీవీ జర్నలిస్టు జమీరుద్దీన్
హైదరాబాద్: తెలంగాణలో భారీ వర్షాలు కారణంగా రాష్ట్రంలోని చాలా ప్రాంతాల్లో వరద పరిస్థితులు నెలకొన్నాయి. కాగా, జగిత్యాల జిల్లాలో ఓ తెలుగు న్యూస్ ఛానెల్‌లో పనిచేస్తున్న జర్నలిస్ట్ తన సహోద్యోగితో కలిసి ప్రయాణిస్తున్న కారు వరద నీటిలో కొట్టుకుపోవడంతో గల్లంతయ్యాడు.
బోర్నపల్లి వద్ద ఎన్డీఆర్ఎఫ్ సిబ్బంది.. గోదావరి వరదల్లో చిక్కుకున్న తొమ్మిది మంది కూలీలను రక్షించిన తర్వాత ఎన్టీవీ తెలుగు జర్నలిస్టు అయిన జమీరుద్దీన్ తన స్నేహితుడితో కలిసి జగిత్యాలకు తిరిగి వస్తున్నారు.

మంగళవారం అర్థరాత్రి రాయికల్ మండలం రామోజీపేట, భూపతిపూర్ గ్రామాల మధ్య నీటి ప్రవాహంలో వీరిద్దరూ ప్రయాణిస్తున్న కారు కొట్టుకుపోయిందని పోలీసులు తెలిపారు. వాగుపై వరదలున్న వంతెనను దాటేందుకు ప్రయత్నించిన సమయంలో ఈ ఘటన చోటుచేసుకుంది. వాహనం రోడ్డుపై పడి వరద నీటిలో కొట్టుకుపోయింది.
చెట్టును పట్టుకుని లతీఫ్ తప్పించుకోగా.. జమీర్ మాత్రం కనిపించకుండా పోయాడు. రెస్క్యూ బృందాలు తప్పిపోయిన జర్నలిస్టు కోసం గాలింపుప్రారంభించాయి. అయితే బుధవారం మధ్యాహ్నం వరకు అతని ఆచూకీ లభ్యం కాలేదు.
స్థానిక అధికారులు సెర్చ్ ఆపరేషన్ కోసం నిపుణులైన ఈతగాళ్ల సేవలను ఉపయోగిస్తున్నారు. వరద తీవ్రత సెర్చ్ ఆపరేషన్‌కు ఆటంకం కలిగిస్తోందని అధికారులు తెలిపారు. రెస్క్యూ టీమ్‌లు కారును గుర్తించి క్రేన్ సహాయంతో బయటకు తీసేందుకు ప్రయత్నిస్తున్నారు.
తాను కారు డోర్ తెరిచానని.. అయితే ఒక చెట్టును పట్టుకునే వరకు వరద ప్రవాహంలో కొట్టుకుపోయానని లతీఫ్ చెప్పాడు. జమీర్ బయటకు రాగలిగాడా? లేదా వాహనంలో ఇరుక్కుపోయాడా? అనేది లతీఫ్‌కు తెలియదు.












Click it and Unblock the Notifications