ఆరో ర్యాంకు: అమెరికాలో సత్తా చాటిన తెలుగు తేజం

హైదరాబాద్: నల్గొండకు చెందిన ప్రసన్న అనే అమ్మాయి అమెరికాలో ఉచిత వైద్య విద్యకు... వందశాతం ఉపకారవేతనానికి ఎంపికైంది. అమెరికాలోని న్యూజెర్సీ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ కాలేజీ మార్చిలో నిర్వహించిన పరీక్షకు ప్రపంచ వ్యాప్తంగా 10 మిలియన్ల మంది విద్యార్ధులు హాజరయ్యారు.

జూన్ నెలలో ఈ పరీక్షకు సంబంధించి ఫలితాలు వచ్చాయి. నల్గొండకు చెందిన తాటి ప్రసన్నకు 2400 మార్కులకు గాను 2350 మార్కులు సాధించి ఆరో ర్యాంకుని సొంతం చేసుకుంది.

ప్రతిభ చాటిన తాటి ప్రసన్న ఏడేళ్లలో వైద్య విద్య కోర్సును పూర్తి చేయడానికి ఖర్చు అంతా అక్కడి ప్రభుత్వమే భరిస్తుంది. ప్రతి ఏడాది 40 వేల డాలర్ల ఫీజు రాయితీతో పాటు, స్కాలర్ షిప్‌ను కూడా అందుకుంటుంది.

Telugu girl awarded for medical scholarship in america

అమెరికాలో విద్య కోసం అందించే వందశాతం స్కాలర్ షిప్‌కు ఎంపికైన ప్రసన్న గురించి అక్కడి మీడియా ప్రముఖంగా ప్రస్తావించింది. ఇకపోతే ప్రసన్న తండ్రి శ్రీనివాసరావు ఇంజనీర్, తల్లి పుష్పలత అధ్యాపకురాలిగా అమెరికాలో స్ధిరపడ్డారు.

సూర్యాపేటకు చెందిన వీరు చాలా కాలం కిందట న్యూజెర్సీకి వెళ్లారు. ప్రసన్న చిన్నప్పటి నుంచి చదువులో మంచి ప్రతిభను చాటుకుంటోంది. హైస్కూల్‌లో వరుసగా మూడేళ్ల పాటు వంద శాతం మార్కులు సాధించిన ప్రసన్న అమెరికా ప్రెసిండెంట్ నుంచి గోల్డ్ స్టార్ బహుమతిని కూడా అందుకుంది.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+