స్కూల్స్ లో తెలుగు తప్పనిసరి.. తెలంగాణా ప్రభుత్వం సంచలన నిర్ణయం.. ఉత్తర్వులు!

రోజు రోజుకి తెలుగు భాషను మాట్లాడేవాళ్లు తగ్గిపోతున్నారు. తెలుగు నేర్చుకోవాలని ఆసక్తి కూడా విద్యార్థులలో కనిపించడం లేదు. తెలుగు వాళ్ళుగా పుట్టిన ప్రతి ఒక్కరు తెలుగు మాట్లాడవలసిన అవసరం ఉన్నచోట తెలుగు రానట్టుగా ఇంగ్లీష్ మీడియం లో చదువుతున్న తీరు తెలుగు వాళ్ళ మనుగడను ప్రశ్నిస్తోంది.

తెలుగు భాష విషయంలో తెలంగాణా ప్రభుత్వం సంచలన నిర్ణయం
ప్రస్తుతం మన తెలుగు రాష్ట్రాలలోనే తెలుగు రానివాళ్ళు, తెలుగులో మాట్లాడలేని వాళ్ళు చాలా మంది ఉన్నారు. కనీసం బస్సు మీద రాసిన ఊరిపేరు కూడా చదవలేని దారుణమైన పరిస్థితిలో కొందరు ఉన్నారు. ఈ క్రమంలో తెలంగాణ ప్రభుత్వం తాజాగా తెలుగు భాష విషయంలో ఒక సంచలన నిర్ణయం తీసుకుంది.

Telugu is mandatory in schools Sensational decision of Telangana government key Orders

తెలుగు మాధ్యమాన్ని తప్పనిసరిగా బోధించాలని ప్రభుత్వం నిర్ణయం
తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న పాఠశాలలలో తెలుగు మాధ్యమాన్ని తప్పనిసరిగా బోధించాలని ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. సి బి ఎస్ సి, ఐసిఎస్సి, ఐబి సహా ఇతర బోర్డు పాఠశాలలలో కూడా తెలుగును తప్పనిసరిగా బోధించాలని ఆదేశాలు జారీ చేసింది. ఇక తొమ్మిదవ తరగతి వారికి 2025 2026 విద్యా సంవత్సరం నుంచి అమలు చేసేలా చూడాలని విద్యాశాఖకు సూచనలు కూడా చేసింది.

అమలుకు నిర్ణయం
పదో తరగతికి 2026 - 2027 విద్యా సంవత్సరం నుంచి అమలు చేయాలని ఉత్తర్వులలో పేర్కొంది. ఈ మేరకు విద్యాశాఖకు మార్గదర్శకాలను జారీ చేసింది. తెలంగాణ ప్రభుత్వం.
ఇక ఈ నిర్ణయంతో తప్పనిసరిగా ప్రతి ఒక్కరు తెలుగు చదవాలని చెప్పడంతో తెలుగు భాషకు కొంత జవసత్వాలు వచ్చే అవకాశం ఉందని తెలుగు పండితులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు

ప్రభుత్వ నిర్ణయంతో ఉద్యోగ, ఉపాది అవకాశాలు పెరుగుతాయ్
అంతేకాదు తెలుగు భాషను చదువుకున్న వారికి ప్రభుత్వం తీసుకున్న ఈ నిర్ణయంతో ఉద్యోగ ఉపాధి అవకాశాలు కలుగుతాయని వారు ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు. అన్ని పాఠశాలలలో తెలుగు సబ్జెక్టును తప్పనిసరిగా బోధించాలని తెలంగాణ ప్రభుత్వం నిర్ణయించడం తెలుగు భాషకు పట్టం కట్టడమేనని పలువురు అభిప్రాయపడుతున్నారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+