ప్రముఖ తెలుగు కథా రచయిత ఇచ్చాపురపు కన్నుమూత
హైదరాబాద్: ప్రముఖ తెలుగు కథా రచయిత ఇచ్ఛాపురపు జగన్నాథరావు కన్నుమూశారు. ఆయనకు 86ఏళ్లు. హైదరాబాదులోని బంజారాహిల్స్‌లోని తన స్వగృహంలో బుధవారం సాయంత్రం గుండెపోటుతో తుదిశ్వాస విడిచారు.
1931 సెప్టెంబరు 10న విశాఖ జిల్లా నర్సీపట్నంలో జగన్నాథరావు జన్మించారు. 1955లో ఆంధ్రా విశ్వవిద్యాలయం నుంచి ఎంఏ (ఆర్థిక శాస్త్రం)లో ఎంఏలో స్వర్ణ పతకం సాధించారు. ఆ తర్వాత ఆంధ్రప్రదేశ్ కస్టమ్స్ అండ్ ఎక్సైజ్ శాఖలో ఉద్యోగంలో చేరారు. విద్యార్థి దశ నుంచే కథలు రాయడం మొదలు పెట్టారు.

జగన్నాథరావు రచించిన కథానికలు, నవలలు, నాటికలు మొత్తం 13 సంపుటాలుగా వెలువడ్డాయి. ఆంధజ్ర్యోతి, ఆంధ్రభూమి పత్రికల్లో వీక్లీ కాలమ్స్ రాశారు. కొన్ని తెలుగు కథలను హిందీలోకి అనువదించారు. సాహిత్య అకాడమీ ముద్రించిన 'కథాసాగర్' (హిందీ), '60 ఏళ్ల కథానికలు'లో జగన్నాథరావు రచనలు అచ్చయ్యాయి.
కస్టమ్స్, అబ్కారీ శాఖ కలెక్టర్‌గా, కేంద్ర స్థాయి హోదాలోనూ పలు బాధ్యతలు చేపట్టిన జగన్నాథరావు 1991లో ఉద్యోగ విరమణ అనంతరం హైదరాబాద్‌లో స్థిరపడ్డారు. ఆయనకు భార్య, నలుగురు కూతుళ్లు ఉన్నారు. 1999లో తెలుగు విశ్వవిద్యాలయం ప్రతిభాపురస్కారాన్ని అందుకున్నారు. బుధవారం సాయంత్రం పంజాగుట్ట శ్మశానవాటికలో జగన్నాథరావు అంత్యక్రియలు జరిగాయి.












Click it and Unblock the Notifications