అమెరికా వెనక్కి పంపడం బాధిస్తోంది, కావాలంటే కలుస్తా: సుష్మాకు కెటిఆర్ లేఖ
హైదరాబాద్: చట్టబద్ధంగా హైదరాబాద్ కాన్సులేట్ ఇచ్చిన వీసా, అనుమతి పత్రాలు ఉన్నప్పటికీ అమెరికా నుంచి తెలుగు విద్యార్థులను పంపించడం, అక్కడి అధికారులు విద్యార్థులతో ప్రవర్తించిన తీరు బాధించిందని తెలంగాణ రాష్ట్ర మంత్రి కల్వకుంట్ల తారక రామారావు బుధవారం అన్నారు.
ఆయన కేంద్రమంత్రి సుష్మా స్వరాజ్‌కులేఖ రాశారు. వీసా, చట్టబద్ద అనుమతులున్నా విద్యార్థులను వెనక్కి పంపించడం అన్యాయమన్నారు. విద్యార్థులను వెనక్కి పంపించినందున వారి తల్లిదండ్రులు ఆర్థిక సంక్షోభంలో కూరుకుపోతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు.
విద్యార్థులతో అక్కడి అధికారుల ప్రవర్తన బాధించిందన్నారు. విద్యార్థుల భవిష్యత్తు దృష్ట్యా అమెరికా ప్రభుత్వంతో మాట్లాడి సమస్యను పరిష్కరించాలని సుష్మాకు రాసిన లేఖలో విజ్ఞప్తి చేశారు. ఈ విషయమై అవసరమైతే తాను స్వయంగా సుష్మా స్వరాజ్‌ను కలుస్తానని చెప్పారు.

అమెరికాలో రాష్ట్ర విద్యార్థులకు జరుగుతున్న అన్యాయంపై దృష్టి సారించాలని సుష్మాను కోరారు. డిపోర్టేషన్ వలన విద్యార్థుల కుటుంబాలు తీవ్ర సంక్షోభంతో కురుకుపోయాయన్నారు. అమెరికా విద్య కోసం విద్యార్థులు వివిధ బ్యాంకుల నుంచి రుణాలు తీసుకున్నారన్నారు.
తెలంగాణలో ప్రజాపంపిణీ వ్యవస్థను పరిశీలించిన జార్ఖండ్ మంత్రి
తెలంగాణ రాష్ట్రంలో ప్రజా పంపిణీ వ్యవస్థ పని తీరును జార్ఖండ్ పౌరసరఫరాల శాఖ మంత్రి సూర్యారాయ్ తెలుసుకున్నారు. ఈ మేరకు రాష్ట్ర పౌర సరఫరాలశాఖ మంత్రి ఈటెల రాజేందర్‌తో సచివాలయంలో భేటీ అయిన సూర్యారాయ్ జాతీయ ఆహార భద్రత చట్టం అమలు విషయమై చర్చించారు.
పేదలకు అందాల్సిన నిత్యావసరాలను దళారుల చేతికి వెళ్లకుండా తీసుకుంటున్న చర్యల గురించి పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ద్వారా జార్ఖండ్ మంత్రికి వివరించారు. ఆహార భద్రత కోసం రూ.3,500 కోట్లు ఖర్చు చేస్తున్న ప్రభుత్వం రానున్న మూడు నెలల్లో మరిన్ని విప్లవాత్మక మార్పులు తీసుకురానున్నట్లు వివరించారు.












Click it and Unblock the Notifications