కారణమిదే: అమెరికాలో తెలుగుకు మూడో స్థానం

Posted By:
Subscribe to Oneindia Telugu

హైదరాబాద్: అమెరికాలో తెలుగు భాషను ఉపయోగించే వారి సంఖ్య బాగానే ఉందని సర్వేలు వెల్లడిస్తున్నాయి. ఇటీవల నిర్వహించిన సర్వేలో ఈ మేరకు ఫలితాలు వెల్లడయ్యాయి.ఇండియాకు చెందిన భాషల్లో ఎక్కువగా ఉపయోగిస్తున్న భాషగా తెలుగు గుర్తింపు పొందింది.

అమెరికాలో ఇండియన్లు కూడ ఎక్కువగానే ఉంటున్నారు. సాఫ్ట్ వేర్ కంపెనీలు ఎక్కువగా ఉన్న చోట ఇండియన్ల సంఖ్య కూడ గణనీయంగా పెరుగుతోందని కొంత కాలంగా అమెరికన్లు ఆందోళన చెందుతున్నారు.

అమెరికా అధ్యక్షుడుగా ట్రంప్ బాధ్యతలు స్వీకరించిన తర్వాత ఇండియన్లతో పాటు ఇతర ప్రాంతాల నుండి వచ్చే వారిపై వీసా నిబంధనలను మరింత కఠినతరం చేశారు.

హెచ్ 1 బీ వీసాల విషయంలో కూడ ఆంక్షలు విధించడంతో ఇండియాకు చెందిన సాఫ్ట్‌వేర్ కంపెనీలు కొంత ఇబ్బందిపడ్డాయి.అమెరికాలో నిర్వహించిన తాజా సర్వేలో ఇండియాకు చెందిన భాషల్లో ఎక్కువగా ఉపయోగించే మూడో భాషగా తెలుగు గుర్తింపు పొందింది.

అమెరికాలో ఉపయోగిస్తున్న ఇండియన్ భాషల్లో తెలుగుకు గుర్తింపు

అమెరికాలో ఉపయోగిస్తున్న ఇండియన్ భాషల్లో తెలుగుకు గుర్తింపు

అమెరికాలో ఎక్కువగా ఉపయోగిస్తున్న ఇండియన్ భాషల్లో మూడో భాషగా తెలుగుకు గుర్తింపు పొందింది. ఈ మేరకు అమెరికా నిర్వహించిన సర్వే నివేదికలు వెల్లడిస్తున్నాయి. అమెరికన్ కమ్యూనిటీ సర్వే 2016లో సర్వే నిర్వహించింది. ఈ సర్వే నివేదికను ఈ ఏడాది సెప్టెంబర్‌లో విడుదల చేసింది.ఈ నివేదిక ప్రకారంగా అమెరికాలో ఎక్కువగా ఉపయోగించే ఇండియాకు చెందిన భాషల్లో మూడో భాషగా తెలుగుకు గుర్తింపు లభించింది.

హిందీ మాట్లాడేవారు ఎక్కువ

హిందీ మాట్లాడేవారు ఎక్కువ

అమెరికాలో ఇండియాకు చెందిన భాషల్లో ఎక్కువగా హిందీ మాట్లాడేవారు ఉన్నారని ఈ సర్వే నివేదిక వెల్లడించింది.ఆ తర్వాతీ స్థానాన్ని గుజరాతీ భాష ఆక్రమించింది. అయితే ఇండియాకు చెందిన ఇతర భాషలను తోసిపుచ్చుతూ తెలుగు మూడో స్థానంలోకి ఎగబాకింది. బెంగాలీ, తమిళ్ భాషలను మాట్లాడేవారి కంటే తెలుగు భాష మూడో స్థానంలో నిలిచిందని ఈ సర్వే నివేదిక వెల్లడించింది.

అమెరికాలో 3.65 లక్షల మంది తెలుగులోనే

అమెరికాలో 3.65 లక్షల మంది తెలుగులోనే

అమెరికాలో నివసిస్తున్నవారిలో ఇంటివద్ద సుమారు 3,65,566 మంది తెలుగులోనే మాట్లాడుతారని ఈ సర్వే నివేదిక వెల్లడించింది.అమెరికాలో నివసిస్తున్న ఐదేళ్ళకు పైబడిన వయస్సున్నవారిలో 0.12 శాతంగా ఉందని ఈ నివేదిక తేటతెల్లం చేస్తోంది.అమెరికాలో ఐదేళ్ళ వయస్సుపైబడినవారిలో సుమారు 30,33,28,961 మంది నివసిస్తున్నారు.బెంగాలీ, ఉర్దూ,తమిల్ భాషలను మాట్లాడే వారి సంఖ్య కూడ గణనీయంగా ఉందని ఈ సర్వే నివేదిక తేటతెల్లం చేస్తోంది.

ఏటా 80వేల హెచ్ 1 బీ వీసాలు

ఏటా 80వేల హెచ్ 1 బీ వీసాలు

ప్రతి ఏటా 80వేల హెచ్ 1 బీ వీసాలు అమెరికా జారీ చేస్తోంది. అయితే 2001లో 50 శాతం వీసాలు తెలుగు ప్రజలు పొందారని అంటున్నారు.అయితే ఈ నివేదికలు తెలుగు ప్రజలను కలవరపడుతున్నారు. అయితే సర్వేలో కొందరు తమ భాషల గురించి తప్పుడు సమాచారం ఇచ్చి ఉండి ఉండవచ్చనే అభిప్రాయాన్ని వ్యక్తం చేసేవారు కూడ లేకపోలేదు.

ఇంకా వివాహం చేసుకోలేదా? తెలుగు మ్యాట్రిమోనిలో నేడే రిజిస్టర్ చేసుకోండి - రిజిస్ట్రేషన్ ఉచితం!

English summary
Walking the streets of any US city, the chances of hearing someone yelling Bhaga Unnava' are very high. This is because the American Community Survey has said that data for 2016 which were released in September 2017 say Telugu is the third most widely spoken Indian language in the US.

Oneindia బ్రేకింగ్ న్యూస్
రోజంతా తాజా వార్తలను పొందండి