Weather Report: తెలంగాణలో ఉష్ణోగ్రతలు భారీగా పడిపోతున్నాయి..

తెలుగు రాష్ట్రాల్లో చలి తీవ్రత క్రమంగా పెరుగుతోంది. ముఖ్యంగా తెలంగాణలో ఉష్ణోగ్రతలు భారీగా పడిపోయాయి. చాలా ప్రాంతాల్లో సాధారణం కంటే 2 నుంచి 4 డిగ్రీల తక్కువ ఉష్ణాగ్రత నమోదు అవుతుంది. గత ఐదేళ్లతో పోలిస్తే ఈసారి అతి తక్కువ ఉష్ణోగ్రతలు నమోద అవుతున్నాయి. వాతావరణశాఖ చెబుతోంది. ముఖ్యంగా ఉత్తర తెలంగాణలో అత్యల్ప ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. కొద్ది రోజుల క్రితం తుఫాన్ కారణంగా ఉష్ణాగ్రతలు సాధారణంగానే నమోదు అయ్యాయి.

ఆ తర్వాత క్రమంగా తగ్గుతూ వస్తున్నాయి. ఉత్తర, ఈశాన్య దిశల నుంచి వీస్తున్న గాలుల ప్రభావంతో చలి తీవ్రత పెరుగుతున్నట్లు వాతావరణ శాఖ చెబుతుంది. శుక్రవారం కుమురంభీం ఆసిఫాబాద్‌ జిల్లా గిన్నెదారిలో 6.8 డిగ్రీ అత్యల్ప ఉష్ణోగ్రత నమోదు అయింది.రంగారెడ్డిలో 7.2, సంగారెడ్డిలో 7.3, సిద్దిపేటలో 8.2, ఆదిలాబాద్‌లో 8.5, మేడ్చల్‌ మల్కాజ్‌గిరి, నిర్మల్‌లో 8.6, మెదక్‌లో 8.7, వికారాబాద్‌లో 8.9, కామారెడ్డి, సిరిసిల్లలో 9 డిగ్రీల కనిష్ఠ ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి.

Temperatures are falling heavily in Telangana

మెదక్, హన్మకొండలో సాధారణం కంటే 4 డిగ్రీలు తక్కువగా కనిష్ట ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. హైదరాబాద్, నల్లగొండ, రామగుండంలో, అదిలాబాద్‌ కనిష్ట ఉష్ణోగ్రతలు 3 డిగ్రీల మేర తక్కువగా, ఇతర ప్రాంతాల్లో 2 డిగ్రీల మేర తక్కువగా నమోదై నట్లు వాతావరణ శాఖ పేర్కొంది. పడిపోతున్న ఉష్ణోగ్రతలతో వృద్ధులు, చిన్నపిల్లలు ఎక్కువగా ఇబ్బంది పడుతున్నారు. కొందరు న్యూమోనియా, ఇతర శ్వాససంబంధిత జబ్బులబారిన పడుతున్నారు. కరోనా కేసులు కూడా పెరుగుతున్నాయి.

వచ్చే రెండు రోజుల్లో కూడా తెలంగాణ అత్యల్ప ఉష్ణోగ్రతలు నమోదయ్యే అవకాశం ఉందని వాతావరణ శాఖ అంచనా వేస్తోంది. వృద్ధులు, పిల్లలు జాగ్రత్తగా ఉండాలని వైద్యులు సూచిస్తున్నారు. రాత్రి పూట బయటకు తిరుగొద్దని చెబుతున్నారు. అత్యవసర పని ఉంటే చెవులు కవర్ అయ్యే విధంగా క్యాప్ పెట్టుకోవాలని.. అలాగే స్వెట్టర్ ధరించాలని సూచిస్తున్నారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+