మేయర్ చాంబర్ వద్ద బీజేపీ కార్పొరేటర్ల నిరసన: అడ్డుకున్న పోలీసులు, ఉద్రిక్తత
హైదరాబాద్: నగరంలోని హైదరాబాద్ మహానగర పాలక సంస్థ(జీహెచ్ఎంసీ) ప్రధాన కార్యాలయం వద్ద బీజేపీ కార్పొరేటర్లు మెరుపు ఆందోళనకు దిగారు. మేయర్ ఛాంబర్‌లోకి వెళ్లేందుకు యత్నించడంతో ఉద్రిక్తత వాతావరణం ఏర్పడింది. దీంతో పోలీసులు రంగ ప్రవేశం చేసి వారిని అడ్డుకున్నారు. దీంతో తోపులాట చోటు చేసుకుంది.
జనరల్ బాడీ మీటింగ్ పెట్టాలని, ప్రజా సమస్యలను పరిష్కరించాలని డిమాండ్ చేస్తూ బీజేపీ కార్పొరేటర్లు, కార్యకర్తలు నిరసన తెలిపారు. ఐదు నెలల క్రితం వర్చువల్ మీటింగ్ పెట్టినా పనులు జరగలేదని వారు ఆగ్రహం వ్యక్తం చేశారు. ఉద్రిక్త పరిస్థితుల నేపథ్యంలో బీజేపీ శ్రేణులను అరెస్ట్ చేసిన పోలీసులు స్టేషన్‌కు తరలించారు.

జనరల్ బాడీ మీటింగ్ జరిగితే మేయర్, టీఆర్ఎస్ కార్పొరేటర్ల అవకతవకల బయటపడతాయనే నిర్వహించడం లేదని బీజేపీ కార్పొరేటర్లు ఆరోపించారు. అభివృద్ధి పనులకు సంబంధించి బిల్లులు మంజూరు చేసి కాంట్రాక్టర్లకు డబ్బులివ్వలేదని మండిపడ్డారు.
మేయర్ ప్రజా సమస్యలను పట్టించుకోవడం లేదని ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. ఇప్పటికైనా జనరల్ బాడీ మీటింగ్ ఏర్పాటు చేయాలని, తగిన చర్యలు చేపట్టకపోతే ఆందోళనలు తీవ్రతరం చేస్తామని బీజేపీ కార్పొరేటర్లు హెచ్చరించారు.
దాడి చేయడం దారుణమంటూ మేయర్ విజయలక్ష్మి
మేయర్ కార్యాలయంపై బీజేపీ నేతలు దాడి చేయడం దారుణం అన్నారు మేయర్ విజయలక్ష్మీ. మంగళవారం ఆమె మీడియాతో మాట్లాడుతూ.. బీజేపీ నేతలకు బుధ్ది ఉందా? అని విమర్శించారు. బీజేపీ కార్పొరేటర్లకు మేయర్ కార్యాయలంలోకి దూసుకురావడం కరెక్ట్ కాదన్నారు మేయర్ .
అరెస్ట్ చేస్తారా? ఇక జీహెచ్ఎంసీ ఎందుకంటూ బండి సంజయ్ ఫైర్
జీహెచ్ఎంసీ బీజేపీ కార్పొరేటర్ల అరెస్ట్ ను ఖండించారు ఆ పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్. అరెస్టు చేసిన వారిని బేషరతుగా విడుదల చేయాలని డిమాండ్ చేశారు. జీహెచ్ఎంసీ ఎన్నికలు జరిగి ఏడాదైనా ఇంతవరకు జనరల్ బాడీ మీటింగ్ పెట్టకపోవటమేంటని ప్రశ్నించారు. ప్రజాప్రతినిధులన్న కనీస స్పృహ లేకుండా.. బీజేపీ కార్పొరేటర్ల పట్ల.. పోలీసులు దురుసుగా వ్యవహరించారని ఆగ్రహం వ్యక్తం చేశారు.
టీఆర్ఎస్ పాలనలో ప్రజాప్రతినిధుల పరిస్థితే ఇలా ఉంటే సామాన్యుల సంగతేంటో చెప్పాల్సిన పనిలేదన్నారు. గత సాంప్రదాయాలు, నిబంధనలు పట్టించుకోకుండా.. తమ అనుకూల సభ్యులతో.. స్టాండింగ్ కమిటీ ఏర్పాటు చేయటం.. టీఆర్ఎస్ నియంతృత్వానికి నిదర్శనమన్నారు సంజయ్. బీజేపీ కార్పొరేటర్లకు అభివృద్ధి, సంక్షేమ పథకాల్లో భాగస్వామ్యం కల్పించకపోవటం అప్రజాస్వామికమని విమర్శించారు.
కరోనా సాకుతో నామమాత్రంగా సర్వసభ్య సమావేశం ఏర్పాటు చేసి.. జీహెచ్ఎంసీ పాలనను గాలికొదిలేశారని బండి సంజయ్ మండిపడ్డారు. టీఆర్ఎస్, మున్సిపల్ మంత్రి చెప్పినట్లే జీహెచ్ఎంసీ పనిచేస్తే.. కార్పొరేటర్లు, జీహెచ్ఎంసీ పాలకవర్గం ఎందుకున్నట్టని ప్రశ్నించారు. రాష్ట్ర ప్రభుత్వమే జీహెచ్ఎంసీని నడిపించదల్చుకుంటే.. జీహెచ్ఎంసీ ఎన్నికలు ఎందుకు నిర్వహించారని నిలదీశారు.
-
జీవన్ రెడ్డి బీఆర్ఎస్ లో చేరిక వేళ బీజేపీ బిగ్ ట్విస్ట్, రూట్ క్లియర్..!! -
ఇక ఒక్క మిస్డ్ కాల్తో గ్యాస్ బుకింగ్: కొత్త నంబర్లు ఇవే! -
ఏప్రిల్ నెలలో మేషరాశి, వృషభ రాశి జాతక ఫలం -
బంగారం ధరలకు పూర్వవైభవం- పరుగులు -
ఈ రాత్రికి ఆయనొక్క మాట చెబితే చాలు.. బంగారం తలకిందులే! -
కుంభరాశి వారికి ఉగాది నుండి జరిగేదిదే! -
ఇరాన్ వార్ నుంచి తప్పుకుంటాం కానీ..! ఎదురుదెబ్పల వేళ ట్రంప్ సంకేతం..! -
60 ఏళ్ల క్రితం ఏం జరిగింది? పరాభవ నామ సంవత్సరం.. పేరులోనే కీడు? -
ఉత్తరాభాద్ర నక్షత్రంలో శని సంచారం: కుంభరాశితో పాటు వీరికి సకల సంపదలు! -
తీవ్ర సంక్షోభంలో పాకిస్తాన్- ప్రధాని షరీఫ్ అనూహ్య ఆదేశాలు -
హార్మూజ్ జలసంధిని అమెరికా టచ్ చేయలేదు.. కారణం ఇదే..? -
రైతులకు భారీ గుడ్ న్యూస్, పరిమితి రూ 5 లక్షలకు పెంపు - విధి విధానాలు..!!












Click it and Unblock the Notifications