రోజంతా ఉత్కంఠ: ఎమ్మెల్యే శంకర్ నాయక్ తీరుపై వెల్లువెత్తిన నిరసన
జిల్లా కలెక్టర్ ప్రీతిమీన చేసిన ఫిర్యాదు మేరకు ఎమ్మెల్యే శంకర్‌నాయక్‌పై పట్టణ పోలీసు స్టేషన్‌లో బుధవారం రాత్రి కేసు నమోదైన సంఘటన జిల్లాలో ఉత్కంఠ రేకెత్తించింది.
మహబూబాబాద్ : జిల్లా కలెక్టర్ ప్రీతిమీన చేసిన ఫిర్యాదు మేరకు ఎమ్మెల్యే శంకర్‌నాయక్‌పై పట్టణ పోలీసు స్టేషన్‌లో బుధవారం రాత్రి కేసు నమోదైన సంఘటన జిల్లాలో ఉత్కంఠ రేకెత్తించింది. ఓ వైపు ఎమ్మెల్యే పోలీసు స్టేషన్‌కు వచ్చి వెళ్లడం, వివిధ పార్టీల నేతలు ఎమ్మెల్యేను పదవి నుంచి తొలగించాలంటూ నిరసన కార్యక్రమాలు నిర్వహించడంతో పట్టణంలో ఉద్రిక్త వాతావరణం నెలకొంది.
జిల్లా మేజిస్ట్రేట్ అయిన కలెక్టర్, శాసనసభ సభ్యుడి మధ్య ఈ సంఘటన జరగడంతో అధికారుల్లోనూ ఆందోళన చోటు చేసుకుంది. రాజకీయ, అధికార వర్గాలను సమన్వయ పరుస్తూనే పట్టణంలో శాంతిభద్రతలను అదుపులో ఉంచేందుకు జిల్లా ఎస్పీ నంద్యాల కోటిరెడ్డి ఆదేశాల మేరకు పోలీసులు వ్యూహాత్మకంగా వ్యవహరించారు.

ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు తలెత్తకుండా పట్టణంలో ముందు జాగ్రత్త చర్యలు తీసుకున్నారు. హరితహారం కార్యక్రమంలో భాగంగా బుధవారం మధ్యాహ్నం స్థానిక ఎన్టీఆర్ స్టేడియంలో మొక్కలు నాటేందుకు గిరిజన సంక్షేమ శాఖ మంత్రి అజ్మీరా చందూలాల్, ఎంపీ సీతారాంనాయక్, ఎమ్మెల్యే శంకర్‌నాయక్ పాల్గొన్న సంగతి విదితమే.
మొక్కలు నాటి తిరిగి వెళుతున్న సందర్భంలో ఎమ్మెల్యే శంకర్‌నాయక్ కలెక్టర్ ప్రీతిమీనా చేతిని పట్టుకొని పక్కకు నెట్టివేసినట్టు వచ్చిన ఆరోపణలు జిల్లాలో కలకలం సృష్టించింది. ఈ విషయంలో ఎమ్మెల్యే కలెక్టర్‌కు క్షమాపణ చెప్పారు. అయినప్పటికీ కలెక్టర్ పట్టణ పోలీసు స్టేషన్‌లో ఫిర్యాదు చేసిన నేపధ్యంలో పోలీసుల ఎమ్మెల్యైపై కేసు నమోదు చేశారు.
Recommended Video

ఈ నేపధ్యంలో గురువారం ఉదయం ఎమ్మెల్యేను అరెస్టు చేస్తారనే ప్రచారం జిల్లాలో వ్యాపించింది. దీంతో పట్టణ పోలీసు స్టేషన్ పరిసరాల్లో, ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయం వద్ద పోలీసులు భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు. అప్పటికే ఎమ్మెల్యే ముఖ్య అనుచరులు ఒక్కొక్కరుగా స్టేషన్ సమీపానికి చేరుకున్నారు. ఈ సమయంలో ఎమ్మెల్యేను అదుపులోకి తీసుకున్న పోలీసులు ఈ సంఘటన విచారణాధికారిగా నియామకమైన తొర్రూరు డీఎస్పీ రాజారత్నంతో పాటు మహబూబాబాద్ డీఎస్పీ రాజమహేంద్రనాయక్ సంఘటన వివరాలను ఎమ్మెల్యే ద్వారా తెలుసుకున్నారు.
ఎమ్మెల్యే హోదాలో ఉన్న శంకర్‌నాయక్‌కు సుప్రీం కోర్టు సూచనల మేరకు నోటీసులు ఇచ్చి తమ పరిధి మేర ఆయనను పోలీసులు సొంత పూచీకత్తుపై విడుదల చేయడంతో ఉత్కంఠతకు తెరపడింది. పట్టణ పోలీసు స్టేషన్ నుంచి నేరుగా క్యాంపు కార్యాలయానికి శంకర్ నాయక్ వెళ్లారు. అక్కడ నుంచి కేసముద్రం మండలంలోని తహసీల్దార్, ఎంపీడీవో కార్యాలయాల్లో నిర్వహించిన హరితహారం కార్యక్రమంలో పాల్గొనేందుకు పోలీసు బందోబస్తు మధ్య తన అనుచరులతో భారీ వాహణ శ్రేణితో వెళ్లారు.
ఆ తర్వాత ముఖ్యమంత్రి కేసీఆర్ పిలుపు మేరకు ఎమ్మెల్యే హైదరాబాద్‌కు వెళ్లినట్లు సమాచారం. మరోవైపు కలెక్టర్ ప్రీతిమీనా తొర్రూరులోని కస్తూర్బాగాంధీ విద్యాలయాన్ని తనిఖీ చేసి ఆ తర్వాత హైదరాబాద్‌లో జరుగనున్న ఐఏఎస్ అధికారుల సంఘం సమావేశానికి వెళ్లినట్లు సమాచారం. ఈ సంఘటనపై పోలీసులు విచారణ ప్రారంభించినట్లు సమాచారం.
-
రేషన్ లబ్దిదారులకు కేంద్రం గుడ్ న్యూస్- మూడు నెలల కోటా ఒకేసారి పంపిణీ -
బంగారం ధరల అంచనాలు తలకిందులు -
మేషరాశి, సింహరాశి, వృశ్చిక రాశి, ధనుస్సు రాశులకు ఏప్రిల్ నెలలో రాజయోగం -
బంగాళాఖాతంపై ఆవర్తనం- ఏపీలోని ఈ జిల్లాల్లో భారీ వర్షాలు -
తులారాశి వార్షిక ఫలం 2026-27: ఈ ఏడాది వీరికి తిరుగేలేదు.. ఈ విషయంలో జాగ్రత్త! -
త్వరలో తిరుపతి, హైదరాబాద్‌కు నేరుగా రైళ్లు: ఆ జిల్లాకు కేంద్రమంత్రి తీపికబురు! -
రామ్ చరణ్ బర్త్ డేకు బిగ్ సర్ ప్రైజ్: `పెద్ది` నుంచి -
తిరుమలలో సీఎం చంద్రబాబుకు భక్తుల స్పెషల్ రిక్వెస్ట్, అక్కడే ఆదేశాలు..!! -
మహేష్ బాబు కాకుండా ఆ హీరో అంటే చాలా ఇష్టం - కృష్ణ -
ఇరాన్ కు ట్రంప్ డెడ్ లైన్- కౌంట్ డౌన్ బిగిన్స్ -
'ధురంధర్' యలీనా గుట్టురట్టు: నిజమా.. కల్పితమా? -
ఎట్టకేలకు జీవన్ రెడ్డి చేరే పార్టీ ఖరారు, అదే బాటలో..!!












Click it and Unblock the Notifications