ఎనుమాముల మార్కెట్ లో మిర్చి రైతుల కన్నెర్ర.. అసలేం జరుగుతుందంటే!!

వరంగల్ జిల్లా ఎనుమాముల వ్యవసాయ మార్కెట్ యార్డులో మిర్చి రైతులు కన్నెర్ర చేశారు. తమకు గిట్టుబాటు ధర రావటం లేదని రోడ్డెక్కారు. వ్యవసాయ మార్కెట్ యార్డు ఎదుట మిర్చి రైతులు ధర్నాకు దిగారు. వ్యాపారస్తులు అంతా కుమ్మక్కై రైతులను మోసం చేస్తున్నారని ఆరోపిస్తూ మిర్చి రైతులు వ్యవసాయ మార్కెట్ గేటు ముందు బైఠాయించి ధర్నా చేపట్టారు.

ఆరుగాలం శ్రమించి పంట పండించినా అన్నదాతల కష్టాలు తీరటం లేదు. ఈ దఫా కూడా మిర్చి రైతులకు అకాల వర్షాలు, అధిక వర్షాలు, తెగుళ్లు పెద్దగా ఆశించిన దిగుబడులను ఇవ్వలేదు. అయినప్పటికీ కష్టపడి పండించిన పంటను మార్కెట్ కు తీసుకువస్తే మార్కెట్లో వ్యాపారస్తులు అందరూ కుమ్మక్కై కనీసం మద్దతు ధర కూడా చెల్లించకుండా తక్కువ ధరకు కొనుగోలు చేస్తున్నారని మిర్చి రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు .

Tension with mirchi farmers protest in enumamula market

తేజ రకం మిర్చి క్వింటాలకు 21,000 రూపాయలు మార్కెట్లో పలుకుతుంటే, తమ వద్ద కేవలం 13 వేల రూపాయలకే కొనుగోలు చేయడానికి అడుగుతున్నారని, రూ.25 వేల వండర్‌ హాట్‌ రకం మిర్చిని రూ.15 వేలకు కొనుగోలుచేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. మార్కెట్లో వ్యాపారస్తులు అంతా సిండికేట్ అయి తమకు నష్టం చేస్తున్నారని మిర్చి రైతులు మండిపడుతున్నారు.

తమకు జరుగుతున్న అన్యాయాన్ని మార్కెట్ అధికారులు పట్టించుకోవడంలేదని మార్కెట్ ప్రధాన గేటు ముందు రహదారిపై బైఠాయించి ధర్నా చేపట్టారు. దీంతో కొద్దిసేపు మార్కెట్ దగ్గర వాహన రాకపోకలకు తీవ్ర అంతరాయం ఏర్పడింది. ఇప్పటికైనా అధికారులు ఈ వ్యవహారంపై దృష్టి సారించాలని, రైతులకు గిట్టుబాటు ధర ఇచ్చి మిర్చిని కొనుగోలు చేసేలాగా చర్యలు తీసుకోవాలని రైతులు డిమాండ్ చేస్తున్నారు.

అప్పులు తెచ్చి పంట పండించిన తాము ఇలాగైతే అప్పుల ఊబి నుండి ఎలా బయటపడతామని వారు ఆవేదన చెందుతున్నారు. రైతుల ఆందోళనల నేపధ్యంలో మార్కెట్ కార్యాలయ అధికారుల సమాచారంతో రంగంలోకి దిగిన పోలీసులు పరిస్థితి అదుపులోకి తెచ్చే ప్రయత్నం చేశారు. ఇప్పటికైనా మద్దతు ధరలు ఇవ్వాలని, లేదంటే మిర్చి రైతుల ఆందోళనల సెగ తగలక తప్పదని రైతులు హెచ్చరిస్తున్నారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+