రైతులకు రేవంత్ పండుగ లాంటి వార్త - ఇక నుంచి..!!
ముఖ్యమంత్రి రేవంత్ కీలక నిర్ణయం తీసుకున్నారు. ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీల మేర కు రైతులకు ధరణి పోర్టల్ స్థానంలో భూ భారతి పోర్టల్ అందుబాటులోకి తీసుకొచ్చారు. తొలుత నాలుగు మండలాల్లో ప్రయోగాత్మకంగా అమలు చేయాలని నిర్ణయించారు. పోర్టల్‌పై అవగాహన కల్పించేందుకు అన్ని రైతులమండలాల్లో సదస్సులు నిర్వహించనున్నారు. అనంతరం రాష్ట్ర వ్యాప్తంగా ఈ సేవలను విస్తరించనున్నారు. ధరణి పోర్టల్ ద్వారా రైతులు ఎదుర్కొన్న సమస్యలకు ఈ కొత్త పోర్టల్ ద్వారా పరిష్కారం లభిస్తుందని మంత్రులు హామీ ఇస్తున్నారు.
భూ భారతి పోర్టల్ రైతులకు అందుబాటులోకి రానుంది. జూన్ 2 నుంచి రాష్ట్ర వ్యాప్తంగా పోర్టల్ అందుబాటులోకి తీసుకురావాలని ప్రభుత్వం నిర్ణయించింది. తొలుత ఎంపిక చేసిన మూడు మండలాల్లో ప్రయోగాత్మకంగా అందుబాటులోకి తీసుకురావాలని ప్రభుత్వం నిర్ణయించింది. పోర్టల్‌పై అవగాహన కల్పించేందుకు అన్ని రైతులమండలాల్లో సదస్సులు నిర్వహించనున్నారు. అనంతరం రాష్ట్రవ్యాప్తంగా ఈ సేవలను విస్తరించనున్నారు. భూ సమస్యల పరిష్కారం, లావా దేవీలకు చెందిన సమాచారం రైతులకు, ప్రజలకు సులభంగా అందబాటులో ఉండేలా భూ భారతి పోర్టల్ ఉంటుందని ముఖ్యమంత్రి రేవంత్ వెల్లడించారు. భూభారతికి చెందిన పలు అంశాలను అధికారులకు ఆయన సూచించారు.

ఈ పోర్టల్‌ను పూర్తిస్థాయిలో అమలులోకి తీసుకొచ్చేందుకు రాష్ట్రంలో మూడు మండలాల్లో పైలట్ ప్రాజెక్టులుగా ఎంపిక చేసుకొని అక్కడ కలెక్టర్ల ఆధ్వర్యంలో ప్రజలకు, రైతులకు భూభారతిపై అవగాహన కల్పించాలని సీఎం సూచించారు. ఆయా సదస్సుల్లో ప్రజల నుంచి వచ్చే సందేహాల ను నివృత్తి చేయాలో అధికారులకు సూచించారు. అదేవిధంగా ఈ భూ భారతిపై అవగాహన కల్పించేందుకు రాష్ట్రంలోని ప్రతి మండలంలోనూ కలెక్టర్ల ఆధ్వర్యంలో సదస్సులు నిర్వహించా లని సీఎం ఆదేశించారు. ప్రజలు, రైతులకు అర్ధమయ్యేలా, సులభమైన భాషలో పోర్టల్ ఉండాలని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆదేశించారు. పోర్టల్ బలోపేతానికి ప్రజల నుంచి వచ్చే సలహాలు, సూచనలు స్వీకరిస్తూ ఎప్పటికప్పుడు అప్‌డేట్ చేయాలని సీఎం అధికారులకు సూచించారు. వెబ్ సైట్‌తో పాటు యాప్‌ను పటిష్టంగా నిర్వహించాలని సీఎం ఆదేశించారు.












Click it and Unblock the Notifications