రుణమాఫీ పెండింగ్ నిధుల జమపై ప్రభుత్వం తాజా నిర్ణయం..!!
రైతు రుణమాఫీ పై ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. ఈ నెల 18న ప్రభుత్వం రైతుల ఖాతాల్లో రుణమాఫీ నిధులు విడుదల చేసింది. లక్ష రూపాయాల వరకు తొలి విడతలో అర్హత ఉన్న రైతుల ఖాతాల్లో జమ చేస్తూ నిర్ణయం తీసుకుంది. మూడు విడతల్లో రూ 2 లక్షల వరకు రుణాలను మాఫీ చేస్తామని ముఖ్యమంత్రి రేవంత్ ప్రకటించారు. అందులో భాగంగా రెండో విడత మాఫీ నిధులను విడుదల చేసేందుకు ప్రభుత్వం తాజాగా ముహూర్తం ఖరారు చేసింది.
రెండో విడత నిధులు
ముఖ్యమంత్రి రేవంత్ మరోసారి రుణమాఫీ నిధుల జమ గురించి స్పష్టత ఇచ్చారు. తాజాగా బడ్జెట్ లోనూ వ్యవసాయ రంగానికి దాదాపు రూ 72 వేల కోట్ల నిధులు ప్రతిపాదించారు. రూ 31 వేల కోట్లతో రుణమాఫీ అమలు చేస్తున్నట్లు మంత్రి భట్టి ప్రకటించారు. అధికారంలోకి వస్తే రూ 2 లక్షల వరకు రుణమాఫీ చేస్తామని ఇచ్చిన హామీని నిలబెట్టుకుంటున్నామని చెప్పుకొచ్చారు. అందులో భాగంగా రుణం ఉన్న ప్రతీ రైతు కుటుంబానికి రూ 2 లక్షల మేర మాఫీ చేస్తున్నట్లు చెప్పుకొచ్చారు.

లక్షాన్నార వరకు మాఫీ
ఇప్పటికే రూ లక్ష వరకు రుణం ఉన్న రైతుల ఖాతాల్లో నిధులు జమ అయ్యాయి. అన్ని రకాల బ్యాంకుల్లో ఉన్న రుణాలను మాఫీ చేస్తున్నారు. కొన్ని సాంకేతిక కారణాల వలన జమ కాని రైతుల ఖాతాల్లో ప్రభుత్వం పరిశీలించి సహకార బ్యాంకుల్లోనూ జమ చేస్తోంది. ఇక..రెండో విడతలో లక్షన్నార వరకు ఉన్న రుణాలను మాఫీ చేయాలని నిర్ణయించింది. రేపు (మంగళవారం) ఈ మేరకు అర్హులైన రైతుల ఖాతాల్లో నిధులు జమ అయ్యేలా ప్రభుత్వం మార్గదర్శకాలు జారీ చేసింది. రేపు అసెంబ్లీలోనూ రుణమాఫీ పైన చర్చ జరగనుంది.
అసెంబ్లీలో చర్చ
మూడో విడతగా రూ 2 లక్షల వరకు ఉన్న రుణాలను ఆగస్టు 15 లోగా జమ చేస్తామని ప్రభుత్వం హామీ ఇచ్చింది. ముఖ్యమంత్రి రేవంత్ వచ్చే నెల విదేశీ పర్యటనకు వెళ్లనున్నారు. రాగానే రుణమాఫీ మొత్తం నిధులు రైతుల ఖాతాల్లో జమ అవుతాయని తాజాగా చెప్పుకొచ్చారు. అయితే, కొందరు రైతులు తమకు అర్హత ఉన్నా రుణమాఫీ జరగలేదంటూ అధికారులకు ఫిర్యాదులు చేస్తున్నారు. ప్రబుత్వం మాత్రం అర్హత ఉన్న ప్రతీ రైతుకు రుణమాఫీ అవుతుందని హామీ ఇస్తోంది. దీంతో..రెండో విడత రైతు రుణమాఫీ నిధుల విడుదలకు రంగం సిద్దమవుతోంది.












Click it and Unblock the Notifications