ప్రయాణికులకు టీజీఎస్ఆర్టీసీ గుడ్‌న్యూస్
రాష్ట్ర ప్రయాణికులకు తెలంగాణ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ (TGSRTC) గుడ్‌న్యూస్ చెప్పింది. ఈ-గరుడ బస్సు టిక్కెట్ ధరలను తగ్గిస్తూ టీజీఎస్ఆర్టీసీ నిర్ణయం తీసుకుంది. ఈ-గరుడ బస్సులను రాజధాని ఏసీ బస్ టికెట్ ధరలతో నడపాలని ఆర్టీసీ యాజమాన్యం నిర్ణయించిందని రంగారెడ్డి రీజియన్ రీజనల్ మేనేజర్ శ్రీలత తెలిపారు.
ఈ కొత్త ఆఫర్ సెప్టెంబర్ 30 నాటికి బుకింగ్ చేసిన ప్రయాణాలకు అమల్లో ఉంటుందని ఆమె తెలిపారు. ప్రయాణికులకు మెరుగైన సౌకర్యాన్ని తక్కువ ధరలో అందించేందుకే సంస్థ ఈ నిర్ణయం తీసుకున్నట్లు ఆర్‌ఎం శ్రీలత తెలిపారు.

ఆర్టీసీ ఉద్యోగుల భాగస్వాములకు ఉచిత వైద్య పరీక్షలు
ఆర్టీసీలో పని చేస్తున్న ఉద్యోగుల కుటుంబాలకు శుభవార్త చెప్పింది టీజీఎస్ఆర్టీసీ. గ్రాండ్ హెల్త్ ఛాలెంజ్‌లో భాగంగా ఆర్టీసీ ఉద్యోగుల జీవిత భాగస్వాములకు కూడా ఉచితంగా వైద్య పరీక్షలు నిర్వహించాలని యాజమాన్యం నిర్ణయించిందని టీజీఎస్ఆర్టీసీ ఎండీ వీసీ సజ్జనార్ తెలిపారు. ఆగస్టులో వైద్య పరీక్షలను ప్రారంభించి వారి హెల్త్ ప్రొఫైల్స్‌ను రూపొందించేలా సంస్థ ప్లాన్ చేస్తోందని పేర్కొన్నారు.
హైదరాబాద్‌లో బాగ్‌లింగంపల్లిలోని ఆర్టీసీ కళాభవన్‌లో మంగళవారం రాష్ట్రస్థాయి హెల్త్ వాలంటీర్ల సమావేశం జరిగింది. ఈ సమావేశానికి ముఖ్య అతిథిగా టీజీఎస్ఆర్టీసీ ఎండీ వీసీ సజ్జనార్ హాజరయ్యారు. దేశంలో ఏ ప్రభుత్వ రంగ సంస్థ చేయని విధంగా ఆర్టీసీలోని ప్రతి ఒక్క ఉద్యోగికి ఉచితంగా వైద్య పరీక్షలు నిర్వహించి వారి హెల్త్ ప్రొఫైల్స్‌ను సిద్దం చేసినట్లు సజ్జనార్ తెలిపారు. మొదటి ఛాలెంజ్‌లో అద్దె బస్సు డ్రైవర్లతో సహా 47 వేల సంస్థ సిబ్బందికి, రెండో ఛాలెంజ్‌లో 45 వేల ఉద్యోగులకు వైద్య పరీక్షలు నిర్వహించినట్లు వెల్లడించారు.












Click it and Unblock the Notifications