ఉచిత బస్సు ప్రయాణం లబ్దిదారులకు ఆర్టీసీ కీలక సూచన, ఇక నుంచి..!!
తెలంగాణ ఆర్టీసీ కీలక నిర్ణయం తీసుకుంది. మహాలక్ష్మీ పథకం పక్కాగా అమలు చేస్తున్న వేళ వరుస నిర్ణయాలను అమలు చేస్తోంది. మహిళలకు ఉచిత బస్సు పథకం రెండేళ్లు పూర్తి చేసుకుంది. ఈ పథకానికి రాష్ట్ర వ్యాప్తంగా ఊహించని స్పందన కనిపించింది. ప్రభుత్వం సైతం మహాలక్ష్మీ పథకాన్ని ప్రతిష్టాత్మకంగా అమలు చేసింది. కాగా, నేటితో రెండేళ్లు పూర్తి అయిన వేళ.. ఆర్టీసీ ప్రయాణీకుల కోసం కొత్త విధానం అమల్లోకి తెచ్చింది.
తెలంగాణ ఆర్టీసీ ప్రయాణీకుల సేవల కోసం కీలక నిర్ణయాలు తీసుకుంటోంది. ప్రయాణీకులకు అందిస్తున్న సేవలను మెరుగుపర్చాలని డిసైడ్ అయింది. అందులో భాగంగా ప్రయాణీకులకు ఎప్పటికప్పుడు ఫిర్యాదులు.. సూచనలు ఇచ్చేందుకు వీలుగా కొత్త విధానం అందుబాటులోకి తెస్తూ నిర్ణయం తీసుకుంది. మహాలక్ష్మీ పథకం ద్వారా ఇప్పటివరకు 251 కోట్ల మంది మహిళలు ఉచితంగా బస్సుల్లో ప్రయాణం చేసి.. 8459 కోట్ల విలువైన ప్రయాణాన్ని ఉచితంగా పొందినట్లు అధకారులు వెల్లడించారు. దీంతో.. ఆర్టీసీ ప్రయాణీకులు సమయానికి రావాల్సిన ఆర్టీసీ బస్సు రాకపోయినా, దూర ప్రాంత బస్సు బాగా ఆలస్యంగా వెళుతున్నా ఆర్టీసీ యాజమాన్యం దృష్టికి తీసుకెళ్లే విధంగా అవకాశం కల్పిస్తున్నారు. అదే విధంగా బస్సు లోపల సీట్లు సౌకర్యంగా, పరి శుభ్రంగా లేకపోయినా, వర్షం నీరు లోపలకు వస్తున్నా, డ్రైవర్, కండక్టర్ దురుసుగా వ్యవహరించి నా, మీరు ఎక్కాల్సిన స్టాప్‌లో బస్సు ఆపకపోయినా సమస్యను వెంటనే వివరించేందుకు వెసులుబాటు కల్పించారు.

ఆర్టీసీ సిబ్బంది ప్రవర్తన.. కొన్నిసార్లు అదనపు ఛార్జీలు వసూలు చేస్తారు. ఇలాంటి సమయాల్లో సమస్యను అధికారుల దృష్టికి తీసుకెళ్లొచ్చు. ఫిర్యాదులో మీ పేరు, ఫోన్ నంబర్, ప్రయాణించిన బస్సు నంబర్, ప్రయాణ రూట్, డిపో తదితర వివరాలు రాయాలి. సంఘటన జరిగిన సమయం పేర్కొనాలి. మీరు తీసుకున్న టికెట్‌లో ప్రయాణించిన బస్సు, సిబ్బంది వివరాలు ఉంటాయి. ఆ సంఘటనకు సంబంధించిన ఫొటోలు కానీ, వీడియోలు కానీ ఉంటే ఆధారాలుగా జత చేయవచ్చు. టోల్ ఫ్రీ, కస్టమర్ కేర్ నంబర్లు : 040-6944 0000/2345 0033, ఈ-మెయిల్: [email protected], సోషల్ మీడియాలో: www.facebook.com/TGSRTCHQ;
ఎక్స్ ఖాతా: TGSRTCHQ, కాల్‌సెంటర్ వాట్సప్ నం: 94409 70000 ద్వారా తెలియ చేసే అవకాశం ఉందని అధికారులు వెల్లడించారు.












Click it and Unblock the Notifications