జూబ్లీహిల్స్ ఉపఎన్నికలో గెలుపు ఆ పార్టీదే.. సంచలన సర్వే!
జూబ్లీహిల్స్ నియోజకవర్గంలో ఉప ఎన్నికల పోరు హోరాహోరీగా సాగుతుంది. అధికార ప్రతిపక్ష పార్టీల నేతలు ఎన్నికల ప్రచారంలో దూకుడుగా ముందుకు సాగుతున్నారు. ఈ నియోజకవర్గంలో ఎమ్మెల్యేగా ఉన్న మాగంటి గోపీనాథ్ అనారోగ్యంతో కన్నుమూయడం వల్ల నియోజకవర్గంలో ఉప ఎన్నిక అనివార్యంగా మారింది. దీంతో బి ఆర్ ఎస్ పార్టీ నుండి మాగంటి గోపీనాథ్ సతీమణి మాగంటి సునీత ఎన్నికల బరిలోకి దిగగా కాంగ్రెస్ పార్టీ నవీన్ యాదవ్ ను రంగంలోకి దించింది.
జూబ్లీహిల్స్ ఉప ఎన్నికలకు ఆసక్తికర సర్వే
ఇక బిజెపి నుండి లంకల దీపక్ రెడ్డి ఎన్నికల బరిలోకి దిగారు. అయితే హోరాహోరీగా ఎన్నికల ప్రచారం సాగిస్తున్న సమయంలో తాజాగా జూబ్లీహిల్స్ ఉప ఎన్నికలకు సంబంధించి ఒక ఆసక్తికర సర్వే వెలుగులోకి వచ్చింది. ఈ సర్వే జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల బరిలో గెలిచేదెవరు అనేది తేల్చేసింది . ఆర్ఆర్ పొలిటికల్ సర్వే మూడ్ ఫర్ ది పబ్లిక్ అండ్ ది పీపుల్ జూబ్లీహిల్స్ నియోజకవర్గం హైదరాబాద్ జిల్లా సర్వే షాకింగ్ రిపోర్ట్ ఇచ్చింది.

ఆయనకే విజయావకాశాలు
జూబ్లీహిల్స్ నియోజకవర్గంలో మాగంటి గోపీనాథ్ మృతితో మాగంటి సునీత మీద సానుభూతి వ్యక్తం అవుతున్నా, ప్రస్తుతం ప్రభుత్వ పాలన పైన కాంగ్రెస్ పార్టీ పైన ప్రజలలో వ్యతిరేకత ఉన్నప్పటికీ కాంగ్రెస్ పార్టీ నుంచి పోటీ చేసిన నవీన్ యాదవ్ కి ఎక్కువ విజయ అవకాశాలు ఉన్నాయని సర్వే నివేదిక తేల్చింది.
36 వేల మెజారిటీ
నవీన్ యాదవ్ గతంలో రెండుసార్లు పోటీ చేసి ఓటమిపాలైన క్రమంలో ప్రజలలో అతని పట్ల ఉన్న సానుభూతి, స్థానికంగా సామాజిక సేవా కార్యక్రమాలతో అతను ప్రజలకు దగ్గర కావడం, అందరితోను సన్నిహిత సంబంధాలు కలిగి ఉండడం వంటి కారణాలు ఇక్కడ నవీన్ యాదవ్ కు ప్లస్ అవుతాయని సర్వే నివేదిక పేర్కొంది. జూబ్లీహిల్స్ నియోజకవర్గంలో కాంగ్రెస్ పార్టీ నుండి పోటీ చేసిన నవీన్ యాదవ్ కు 36 వేల మెజారిటీ వస్తుందని ఈ సర్వే వెల్లడించింది.
జూబ్లీహిల్స్ నియోజకవర్గం లో ఎమ్మెల్యేగా ఎవరంటే
జూబ్లీహిల్స్ నియోజకవర్గం లో ఎమ్మెల్యేగా ఎవరు ఉండాలి అన్న దానిపైన ప్రజాభిప్రాయం ప్రకారం 33.35 శాతం సునీతకు జై కొడితే, 49.55 శాతం మంది నవీన్ యాదవ్ కు ఓటు వేస్తామని చెప్పారని, ఇక 12.5 శాతం మంది తెలీదు, చెప్పలేమని సమాధానం చెప్పినట్టుగా సర్వే నివేదిక వెల్లడించింది. ఇక జూబ్లీహిల్స్ నియోజకవర్గం లో ఏ పార్టీకి అధికారం కట్టబెట్టాలి అన్న దానిపైన కూడా ప్రజాభిప్రాయం సర్వే ద్వారా చేశారు.
పార్టీ వారీగా ఎవరికి అవకాశం ఉందంటే
కాంగ్రెస్ పార్టీకి 50. 65%, బి ఆర్ ఎస్ పార్టీకి 32. 46% బిజెపికి 11.99 శాతం, హెచ్వైసీ కి 1.03 శాతం, ఇతరులు 1.8%, నోటాకు 2.8 శాతం మంది అనుకూలంగా సమాధానం చెప్పారు. మొత్తంగా చూస్తే జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల్లో గెలుపు కాంగ్రెస్ పార్టీదేనని ఆర్ఆర్ పొలిటికల్ సంచలన సర్వే రిపోర్ట్ ను వెల్లడించింది.
-
రోజా పవర్ ప్యాక్డ్ పంచ్ లు -
టీడీపీలో విషాదం, సీనియర్ నేత కన్నుమూత..!! -
జగన్ బిగ్ ప్లాన్, 2019 కాంబో రిపీట్ - మారుతున్న లెక్కలు..!! -
ఏప్రిల్ రెండో వారంలో తెలంగాణాకు ప్రధాని మోదీ.. బీజేపీ బిగ్ ప్లాన్ ఇదే! -
పాతాళానికి బంగారం ధరలు- రంజాన్ పండగ వేళ -
తమిళనాడులో ఆ పార్టీదే అధికారం: విజయ్ రాకతో మారిన ఈక్వేషన్లు -
పల్నాడు, సింహాద్రి ప్రయాణీకులకు రైల్వే గుడ్ న్యూస్, ఇక నుంచి..!! -
3000 ఏళ్ల సంప్రదాయం.. యుద్ధం మధ్యే నూతన సంవత్సరం -
విడాకులపై మెగా డాటర్ "నిహారిక" కామెంట్స్.. అసలు కాంటాక్ట్ కూడా లేదు ?? -
40 ఏళ్లలో లేని అతిపెద్ద పసిడి పతనం. 1983 సీన్ రిపీట్! -
ఏప్రిల్ నెలలో సింహరాశి, కన్యారాశి జాతక ఫలం -
'దురంధర్ 2' ఓ చెత్త సినిమా: స్టార్ హీరోయిన్












Click it and Unblock the Notifications