చంపడం భలే థ్రిల్ గా ఉంది: పాక్ ఉగ్రవాది
కాశ్మీర్: భారతీయులను, సైన్యాన్ని చంపడం చాల థ్రిల్ గా ఉంటుందని, అందుకే తాను ఉగ్రవాది అయ్యానని పట్టుబడిన పాక్ ఉగ్రవాది మహమ్మద్ నావెద్ అలియాస్ ఉస్మాన్ ఖాన్ అలియాస్ ఖాసీం ఖాన్ అంటున్నాడని పోలీసు అధికారులు తెలిపారు.
అమర్ నాథ్ యాత్ర, జమ్మూ కాశ్మీర్ సరిహద్దులలో ఉన్న భారత సైన్యమే తమ టార్గెట్ అని, అందుకే అంతం చెయ్యడానికి వచ్చామని ఉగ్రవాది అంగీకరించాడు. తాను పక్కా పాకిస్థాన్ జాతీయుడినని అతను అంగీకరించాడని పోలీసు అధికారులు చెప్పారు. అంతే కాకుండా ఇంకా కొందరిని అంతం చేసి ఉంటే చాలబాగుండేదని అతను అంటున్నాడు.
తుపాకితో సైన్యం మీద కాల్పులు జరపడం, ప్రజలను అంతం చెయ్యడం చాలా సరదాగా ఉందని, అందుకే తాను ఉగ్రవాదిని అయ్యాయని అతను చెప్పడంతో పోలీసు అధికారులు షాక్ కు గురైనారు. మీ చేతిలో (సైన్యం) చని పోయి ఉంటే అది అల్లా దయ అన్నాడు.

తాను బ్రతకడం అల్లా దయే అన్నాడు. అల్లా అప్పగించిన పని పూర్తి చెయ్యడానికి ప్రయత్నించి చిక్కిపోయానని అతను అంటున్నాడని దర్యాప్తు చేస్తున్న అధికారులు తెలిపారు.
ఇది ఉగ్రవాది బ్యాక్ గ్రౌండ్..............!
పాకిస్థాన్ లోని ఫైస్లాబాద్ పట్టణంలోని గులాం ముస్తఫాబాద్ ప్రదేశంలో మహమ్మద్ నావెద్ యాకూబ్ (20) నివాసం ఉంటున్నాడని జుమ్మూ ఐజీపీ ధనీష్ రాణా చెప్పారు. ఇతనికి ఒక సోదరి, ఇద్దరు సోదరులు ఉన్నారని విచారణలో వెలుగు చూసింది.
ఒక సోదరుడు టీచర్ గా పని చేస్తున్నాడని, ఇంకో సోదరుడు బట్టల వ్యాపారం చేస్తున్నాడని విచారణలో వెలుగు చూసిందని ఐజీపీ ధనీష్ రాణా అన్నారు. సైన్యంపై దాడి చేసి పట్టుబడిన మహమ్మద్ నావెద్ యాకూబ్ కు కోంచెం కూడ భయం లేదని, చాల హాయిగా ఉంటున్నాడని పోలీసు అధికారులు తెలిపారు.
-
అంచనాలను తలకిందులు చేస్తోన్న బంగారం ధరలు -
ఉగాది నుంచి వృషభరాశి, మేషరాశి వారి జాతక ఫలం -
Work From Home ఇచ్చేశారు. ప్రభుత్వం, ఐటీ దిగ్గజాల కీలక ప్రకటన! -
ICC T20I ర్యాంకింగ్స్: దూసుకొచ్చిన సంజూ, ఇషాన్ - అభిషేక్ ఏ స్థానంలో..!! -
రైతులకు శుభవార్త.. రైతు భరోసాపై కీలక ప్రకటన చేసిన మంత్రి! -
తమిళ నాట అధికారం వారిదే, విజయ్ కు దక్కే సీట్లెన్ని- తేల్చేసిన కేకే సర్వే..!! -
2024 నాటి భీభత్సం మళ్లీ వస్తుంది: ఈ వేసవి చాలా కాలం ఉంటుంది! -
ఉగాది నుంచి మిథున రాశి, కర్కాటక రాశి వారి జాతక ఫలం -
ఇన్నాళ్లూ ఆచితూచి- ఇప్పుడు ప్రధాని మోదీపై సీఎం డైరెక్ట్ అటాక్? -
భారత్‌పై అమెరికా దర్యాప్తు. సెక్షన్ 301 ప్రయోగించిన ట్రంప్ -
దేశంలో తొలి `కారుణ్య మరణం`- తీర్పు చెబుతూ కన్నీళ్లు పెట్టిన సుప్రీంకోర్టు ధర్మాసనం -
తెలంగాణ నూతన డీజీపీ ఖరారు, అనూహ్య ఎంపిక..!!












Click it and Unblock the Notifications