తెలంగాణలో కాషాయ జెండా రెపరెపలాడటం ఖాయం.!టీఆర్ఎస్ ప్రజాధరణ కోల్పోయిందన్న రాజాసింగ్.!

హైదరాబాద్ : ప్రధానమంత్రి నరేంద్రమోదీ మాట్లాడివన్నీ అక్షర సత్యాలేనన్నారు బీజేపీ శాసనసభాపక్ష నేత రాజాసింగ్. నిజాలు మాట్లాడితే రాష్ట్ర మంత్రులు, టీఆర్ఎస్ నేతలు ఎందుకు ఉలిక్కిపడుతున్నారని ప్రశ్నించారు. సీఎం చంద్రశేఖర్ రావు కుటుంబ పాలనతో తెలంగాణ ధ్వంసమైన మాట వాస్తవం కాదా అని నిలదీసారు. సంపన్న రాష్ట్రంగా ఉన్న తెలంగాణను అప్పుల కుప్పగా మార్చి, ఉద్యోగులకు జీతాలు కూడా ఇవ్వలేని దుస్థితికి తీసుకొచ్చింది సీఎం చంద్రశేఖర్ రావు కదా అని ధ్వజమెత్తారు.

 కేసీఆర్ పాలనలో తెలంగాణ ధ్వంసమైంది.. మండిపడ్డ రాజాసింగ్

కేసీఆర్ పాలనలో తెలంగాణ ధ్వంసమైంది.. మండిపడ్డ రాజాసింగ్


మజ్లిస్ నేతలతో అంటకాగుతూ 15 శాతం ఓట్ల కోసం హిందూ సమాజాన్ని విచ్ఛిన్నం చేస్తున్నది టీఆర్ఎస్ నేతలు కాదా అని మండిపడ్డారు రాజాసింగ్. చంద్రశేఖర్ రావు కుటుంబం ఉద్యమాలు చేసి జైలుకు పోయిందంటూ రాష్ట్ర మంత్రులు సిగ్గు లేకుండా పచ్చి అబద్దాలు వల్లిస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేసారు రాజాసింగ్.
టీఆర్ఎస్ ను తరిమికొట్టే రోజులు రాబోతున్నయన్నారు రాజాసింగ్.

 వాస్తవాలు మాట్లాడితే టీఆర్ఎస్ నేతలకు ఉలుకెందుకు? నిలదీసిన బీజేపి ఎమ్మెల్యే

వాస్తవాలు మాట్లాడితే టీఆర్ఎస్ నేతలకు ఉలుకెందుకు? నిలదీసిన బీజేపి ఎమ్మెల్యే


తెలంగాణ ఉద్యమంలో 1200 మంది బలిదానాలు చేసుకున్నారని, వేలాది మంది జైలుకు పోయారని, వారి త్యాగాల పునాదులపై తెలంగాణ వస్తే అధికారం చెలాయిస్తున్న మాత్రం చంద్రశేఖర్ రావు కాదా అని తూర్పారబట్టారు. స్వరాష్ట్ర ఉద్యమంలో ఒక్కనాడైనా సీఎం జైలుకు పోయాడా? దొంగ దీక్షలు, అసత్యపు మాటలతో ప్రజలను రెచ్చగొట్టి తెలంగాణ యువత చావుకు కారణమైన మాట వాస్తవం కాదా అన్నారు.

 తెలంగాణలో టీఆర్ఎస్ ప్రజాధరణ కోల్పోయింది. అందుకే కేసీఆర్ దేశపర్యటనలన్న రాజాసింగ్

తెలంగాణలో టీఆర్ఎస్ ప్రజాధరణ కోల్పోయింది. అందుకే కేసీఆర్ దేశపర్యటనలన్న రాజాసింగ్


టీఆర్ఎస్ నేతలకు సిగ్గూ,శరం లేకుండా నోటికొచ్చినట్లు అబద్దాలు చెబుతూ ప్రజలను మరోసారి మోసం చేయాలని చూస్తున్నారని రాజాసింగ్ మండిపడ్డారు. తెలంగాణ ప్రజలకు సీఎం చంద్రశేఖర్ రావు భాగోతం మొత్తం తెలిసిపోయిందని, అందుకే టీఆర్ఎస్ ను ఛీ కొడుతున్నారన్నారు. ఈ విషయం తెలిసి దేశ రాజకీయాలు, సంచలనాలంటూ కల్లబొల్లి మాటలు చెబుతూ సీఎం చంద్రశేఖర్ రావు పబ్బం గడుపుతున్నారన్నారు రాజాసింగ్.

 ఎప్పుడు ఎన్నికలొచ్చినా బీజేపిదే విజయం.. ధీమా వ్యక్తం చేసిన రాజాసింగ్

ఎప్పుడు ఎన్నికలొచ్చినా బీజేపిదే విజయం.. ధీమా వ్యక్తం చేసిన రాజాసింగ్


సీఎం చంద్రశేఖర్ రావు తల కింద పెట్టి కాళ్లు పైకిపెట్టి తపస్సు చేసినా జనం ఆయన మాటలు నమ్మరన్నారు రాజాసింగ్. తెలంగాణలో ఎప్పుడు ఎన్నికలొచ్చినా టీఆర్ఎస్ ను తరిమికొట్టడం తథ్యమన్నారు బీజేపి ఎమ్మెల్యే. తెలంగాణలో కాషాయ జెండా రెపరెపలాడటం ఖాయమని ధీమా వ్యక్తం చేసారు గోషామహల్ బీజేపి ఎమ్మెల్యే రాజాసింగ్.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+