తెలంగాణలో లోక్ సభ ఎన్నికల బరిలో 17 స్థానాల్లో బీజేపీ .. నేడు హస్తిన వేదికగా ప్రణాళిక
లోక్ సభ ఎన్నికల నగారా మోగింది. తెలంగాణ రాష్ట్రంలో ముందస్తు జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో ఒకే ఒక స్థానాన్ని గెలిచి ఉనికి కోల్పోయిన బిజెపి రానున్న లోక్సభ ఎన్నికలకు సిద్ధమవుతోంది. వచ్చే ఎన్నికల్లో తెలంగాణ రాష్ట్రంలో 17 లోక్సభ స్థానాలలోనూ బిజెపి పోటీ చేస్తుందని బిజెపి రాష్ట్ర అధ్యక్షుడు లక్ష్మణ్ తెలిపారు.
టిఆర్ఎస్ పార్టీ 16 స్థానాలను సొంతం చేసుకున్న కేంద్ర సహకారం లేకుంటే ఏం చేయలేదని చెప్పిన లక్ష్మణ్ వచ్చే ఎన్నికల్లో బీజేపీ విజయఢంకా మోగించి కేంద్రంలో మరోమారు ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తుందని ధీమా వ్యక్తం చేశారు.

లోక్ సభ ఎన్నికల నేపథ్యంలో నేడు ఢిల్లీలోని బిజెపి జాతీయ అధ్యక్షుడు అమిత్ షా తో లక్ష్మణ్, కిషన్ రెడ్డి, బండారు దత్తాత్రేయలు భేటీ కానున్నారు. లోక్ సభ ఎన్నికలలో పోటీ చేసే అభ్యర్థుల ఎంపికపై కసరత్తు చేయనున్నారు. ఒకపక్క షెడ్యూల్ విడుదల కావడంతో త్వరితగతిన అభ్యర్థులను ప్రకటించాలని భావిస్తున్న నేపథ్యంలోనే హస్తిన వేదికగా లోక్ సభ ఎన్నికల కార్యాచరణను తెలంగాణా బిజెపి నాయకులు రూపొందిస్తున్నారు.












Click it and Unblock the Notifications