కాంగ్రెస్ Vs బీఆర్ఎస్, అక్కడే "మ్యాజిక్"- గెలుపు పై క్లారిటీ..!!
తెలంగాణ ఎన్నికల పోరు ఉత్కంఠగా మారుతోంది. పోలింగ్ సమయం సమీపిస్తున్న వేళ కొత్త లెక్కలు తెర మీదకు వస్తున్నాయి. కాంగ్రెస్ వర్సస్ బీఆర్ఎస్ మధ్య పోటీ నువ్వా నేనా అన్నట్లుగా మరింది. బీజేపీ అగ్రనాయకత్వం తెలంగాణలో మొహరించింది. కాంగ్రెస్ కు అనుకూలంగా తాజా ట్రెండ్స్ కనిపిస్తున్నాయి. సీఎం కేసీఆర్ తమదే విజయం అంటున్నారు. ప్రధాని మోదీ తొలి సారి బీజేపీ ప్రధాని మోదీ తెలంగాణ లో తొలిసారి బీజేపీదే ప్రభుత్వం అని చెబుతున్నారు. అసలు తాజా రిపోర్ట్స్ ఏం చెబుతున్నాయి.
హోరా హోరీ పోరు: తెలంగాణలో కాంగ్రెస్ వర్సస్ బీఆర్ఎస్ మధ్య ప్రధాన పోరు కొనసాగుతోంది. రెండు పార్టీలు హోరా హరీగా తలపడుతున్నాయి. తమకు క్షేత్ర స్థాయిలో పరిస్థితి అనుకూలంగా ఉందని కాంగ్రెస్ ధీమాతో ఉంది. 80 సీట్లు ఖాయమని చెబుతోంది. అదే సమయంలో బీఆర్ఎస్ తమ హ్యాట్రిక్ విజయం ఖాయమని ప్రచారం చేస్తోంది. ఈ సమయంలోనే మూడో స్థానంలో బీజేపీ ఉందని భావిస్తున్న సమయంలో ఆసక్తి కర రిపోర్ట్స్ బయటకు వస్తున్నాయి.

ఇప్పుడు ప్రజల్లో కాంగ్రెస్ కు అనుకూల ట్రెండ్స్ వస్తున్నాయి. పలు సర్వే సంస్థలు ఇదే అంశం తేల్చి చెప్పాయి. బీఆర్ఎస్ మాత్రం తమ అనుకూలత గురించి పెద్ద ఎత్తున ప్రచారం చేస్తోంది. అయితే, ఇప్పుడు అధికారం దక్కించుకోవాల్సిన మ్యాజిక్ ఫిగర్ పైన కీలక అంశాలు వెలుగులోకి వస్తున్నాయి.
మ్యాజిక్ ఫిగర్ కోసం: మొత్తం 119 స్థానాల్లో 6-7 స్థానాలు ఎంఐఎం గెలుచుకుంటుందనేది అందరూ అంగీకరిస్తున్న అంశం. ఇక, అధికారం దక్కించుకోవాలంటే ఏ పార్టీకి అయినా 60 స్థానాలు దక్కాలి. హోరా హోరీ పోరులో ప్రతీ సీటు కీలకం కానుంది. ఈ సమయంలో బీజేపీకి వచ్చే సీట్లు..పోలయ్యే ఓట్లు డిసైడిండ్ ఫ్యాక్టర్ గా మారనున్నాయి. తాజాగా అందుతున్న రిపోర్ట్స్ ప్రకారం బీజేపీ 30 స్థానాల్లో ప్రభావితం చేసేవిగా చెబుతున్నారు. ఈ స్థానాల్లో బీజేపీ గెలవటం లేదా ప్రత్యర్ధి పార్టీల గెలుపు, ఓటమలును ప్రభావితం చేస్తుందని లెక్కలు స్పష్టం చేస్తున్నాయి.
బీజేపీకి వచ్చే ఓట్లు బీఆర్ఎస్ వ్యతిరేకంగా పోలయ్యేవనే ఒక లెక్క ఉంది. అయితే, కాంగ్రెస్ కు పడే ఓట్లను బీజేపీ తమ వైపు తిప్పుకోలేదని..రెండు పార్టీల ఓటర్లు వేర్వేరు అనేది మరో విశ్లేషణ. ఇదే సమయంలో బీజేపీకీ బీసీ సీఎం నినాదం..ఎస్సీ వర్గీకరణ అంశాలు ఏ మేర ఓట్లను ఆ పార్టీకి తెచ్చి పెడతాయనేది ఈ హోరా హోరీ పోరులో ఉత్కంఠ పెంచుతున్నాయి.

బీజేపీ కీలకంగా మారేనా: ప్రధాని మోదీ సైతం తెలంగాణలో తొలి సారి బీజేపీ ప్రభుత్వం ఏర్పాటు కాబోతోందని ప్రతీ సభలో చెబుతున్నారు. బీఆర్ఎస్, కాంగ్రెస్ రెండు పార్టీలకు మ్యాజిక్ ఫిగర్ రాకుంటే తమకు వచ్చే సీట్లే కీలకం అవుతాయనే అంచనాల్లోనూ బీజేపీ నేతలు కనిపిస్తున్నారు. బీఆర్ఎస్ కు అవసరమైతే ఎంఐఎం మద్దతు ఉంటుందనే అభిప్రాయం ఉంది.
కాంగ్రెస్ - బీజేపీ కలిసే అవకాశం లేదు. బీజేపీ మద్దతు నిజంగా అవసరమైతే అప్పుడు తెలంగాణ రాజకీయం కీలక టర్న్ తీసుకొనే అవకాశం ఉంది. కానీ, కాంగ్రెస్ నేతలు మాత్రం హంగ్ అవకాశమే లేదని..తెలంగాణ ప్రజలకు తమకే పట్టం కట్టాలని డిసైడ్ అయ్యారని గట్టిగా చెబుతున్నారు. దీంతో, పోలింగ్ కు మరో మూడు రోజులే సమయం ఉంది. ఈ సమయంలో వెల్లడువుతున్న ట్రెండ్స్..అంచనాలు రాజకీయంగా ఆసక్తిని పెంచుతున్నాయి.
-
బీహార్ నూతన సీఎం గా అనూహ్య ఎంపిక, నితీశ్ 'ఫిక్స్' - మోదీ మార్క్ నిర్ణయాలు..!! -
టీఆర్ఎస్ గా మారనున్న బీఆర్ఎస్..? -
కటౌట్ కు తగ్గ పర్ఫెక్ట్ ఫిల్మ్- టైటిల్ గూస్ బంప్స్: విజువల్ వండర్ -
AP Inter Results: ఏపీలో ఇంటర్ ఫలితాల ముహూర్తం ఫిక్స్, అఫీషియల్..!! -
పాకిస్థాన్ కు ఎగిరి గంతేసే వార్త.. ఒకేసారి రూ. 41,500 కోట్లు సాయం అందింది..!! -
కెరీర్ లోనే ఫస్ట్ ప్లాఫ్.. ఎలా తట్టుకుంటున్నావ్ అన్నా..!! -
రాజ్యసభకు టీడీపీ, బీజేపీ నుంచి ఊహించని అభ్యర్దులు- జనసేన నుంచి ఆయనే..!! -
వాస్తు ప్రకారం ఏ రాశివారికి ఏ దిక్కులో ఉండే ఇళ్లు కలిసివస్తాయి? -
వారి గ్రీన్ కార్డులు అవుట్ -
US Visa: స్లాట్లు ఓపెన్. కానీ ప్రయాణం సేఫ్ కాదు! -
సీనియర్ ఎన్టీఆర్కు బాగా ఇష్టమైన చిరంజీవి సినిమా -
కలియుగ వైకుంఠంలో అద్భుతం; తిరుమల చరిత్రలో తొలిసారి..












Click it and Unblock the Notifications