దారుణం ...ఇటుకలతో కొట్టి కన్నబిడ్డలనే కడతేర్చిన తల్లి

పెద్దపల్లి జిల్లా గోదావరిఖనిలో దారుణం జరిగింది. ఓ తల్లి తన కొడుకులపై ఇటుకలతో దాడి చేసిన ఘటనలో ఇద్దరు చిన్నారులు మృతిచెందారు. దాడిలో పెద్ద కుమారుడు అజయ్‌(11) అక్కడికక్కడే మృతి చెందగా, చిన్న కుమారుడు ఆర్య(8) తీవ్ర గాయాలతో ఆసుపత్రిలో చికిత్స పొందుతూ చనిపోయాడు. మానసిక వ్యాధితో బాధపడుతున్న కారణంగానే తల్లి ఈ ఘాతుకానికి పాల్పడినట్లుగా తెలుస్తుంది.

పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. గోదావరిఖని సప్తగిరి కాలనీలో నివాసం ఉండే శ్రీకాంత్, రమాదేవి దంపతులకు ఇద్దరు కుమారులు. రమాదేవి టీచర్ గా ఒక ప్రైవేట్ స్కూల్ లో పని చేసేది.కొద్ది రోజులు ప్రైవేటు టీచర్‌గా పనిచేసిన ఆమె పిల్లల పట్ల దురుసుగా వ్యవహరించడంతో టీచర్ ఉద్యోగం నుంచి యాజమాన్యం తొలగించింది. మానసిక వ్యాధితో బాధపడుతున్న రమాదేవి తరచూ భర్తతో పాటు పిల్లలతో గొడవ పడుతోంది. దీంతో ఆమె మానసిక పరిస్థితిపై భర్త వైద్యులను సంప్రదించాడు.
ఆమెమనోవ్యాధికి మందులు వాడుతోంది.

The brutal ... the mother who killed their two sons with the bricks

ఈ క్రమంలో సోమవారం ఉదయం భర్త శివరాత్రి సందర్భంగా పూజా సామగ్రి కోసం బయటకు వెళ్ళాడు .
అదే సమయంలో రమాదేవి ఇటుకలతో పిల్లల తలపై కొట్టింది. తలకు తీవ్ర గాయమై రక్తస్రావం కావడంతో అజయ్‌ అక్కడికక్కడే మృతి చెందాడు. తాళం వేసి ఉన్న గేటును చూసి శ్రీకాంత్ లోపలికి వెళ్లాడు. అక్కడ ప్రాణాపాయ స్థితిలో ఉన్న కుమారులను చూసి అరవడంతో స్థానికులు వచ్చారు. ఆర్యకు తీవ్రంగా గాయాలు కావడంతో చికిత్స నిమిత్తం కరీంనగర్ తరలించారు. అక్కడ చికిత్స పొందుతూ ఆర్య కూడా మృతిచెందాడు. సమాచారం అందుకున్న పోలీసులు సంఘటనా స్థలాన్ని పరిశీలించి రమాదేవిని అదుపులోకి తీసుకున్నారు. ఈ సంఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసుల తెలిపారు. మనోవ్యాధితో కడుపున పుట్టిన బిడ్డల్నే కడతేర్చుకుంది ఆ తల్లి .

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+