కేంద్రం రివార్డులతో పాటు నిధులు కూడా ఇవ్వాలి.!స్వచ్ఛ భారత్‌ మిషన్‌ అవార్డుల నేపథ్యంలో ఎర్రబెల్లి.!

హైదారాబాద్ : ముఖ్యమంత్రి చంద్రశేఖర్ రావు, యువ మంత్రి కల్వకుంట్ల తారాకరామారావుల అశేష కృషి వల్ల తెలంగాణ రాష్ట్రం అభివృద్దిలో దూసుకెళ్తోందని అంతేకుండా అనేక రంగాల్లో తగిన గుర్తింపు రావడమే కాకుండా ఇతర రాష్ట్రాలకు తెలంగాణ ఆదర్శంగా నిలుస్తోంది పంచాయతీ శాఖా మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు స్పష్టం చేసారు. సీఎం చంద్రశేఖర్ రావు, మంత్రి కేటీఆర్ జోక్యంతో రాష్ట్రానికి అనేక స్వచ్ఛ అవార్డులు లభించాయని హర్షం వ్యక్తం చేసారు ఎర్రబెల్లి.

 అవార్డుల్లో కాదు.. నిధుల అంశంలో కూడా కేంద్ర సహకారం కావాలన్న ఎర్రబెల్లి

అవార్డుల్లో కాదు.. నిధుల అంశంలో కూడా కేంద్ర సహకారం కావాలన్న ఎర్రబెల్లి

ఈ సందర్బంగా మంత్రి తారాకరామారావు, సంబంధిత శాఖ అధికారులు, సిబ్బందికి మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు శుభాకాంక్షలు తెలిపారు. కేంద్ర ప్రభుత్వం అవార్డులు, రివార్డులతో పాటు, రాష్ట్రానికి తగినన్ని నిధులిచ్చి ప్రోత్సహించాలని కేంద్రానికి దయాకర్ రావు సూచించారు. వివిధ పన్నుల రూపంలో తెలంగాణ రాష్ట్రానికి రావాల్సిన నిధులు కూడా విడుదలకు నోచుకోవడం లేదని, విభజన చట్టం ప్రకారం రావాల్సిన నిధులు కూడా పెండింగ్ లో ఉన్నాయని కేంద్రం ఈ అంశాలపై దృష్టి కేంద్రీకరిస్తే రాష్ట్రాన్ని మరింత ప్రోత్సహించిన వారవుతారని మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు కేంద్రానికి సూచించారు.

 అవార్డులు, రివార్డులు రావడానికి సీఎం కారణం.. కేటీఆర్ కష్టానికి ఫలితమన్న మంత్రి ఎర్రబెల్లి

అవార్డులు, రివార్డులు రావడానికి సీఎం కారణం.. కేటీఆర్ కష్టానికి ఫలితమన్న మంత్రి ఎర్రబెల్లి

అంతే కాకుండా స్వచ్ఛ భారత్‌ మిషన్‌లోని పలు విభాగాల్లో తెలంగాణ దేశంలోనే ఉత్తమ రాష్ట్రంగా నిలవడం, కేంద్రం ప్రకటించిన అవార్డుల్లో రాష్ట్రాల క్యాటగిరీలో తెలంగాణకు 12 అవార్డులు రావడం పట్ల రాష్ట్ర పంచాయతీరాజ్ గ్రామీణాభివృద్ధి గ్రామీణ మంచి నీటి సరఫరా శాఖల మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు హర్షం వ్యక్తం చేశారు. ఇదంతా రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రశేఖర్ రావు, పురపాలక, పట్టణాభివృద్ధి శాఖల మంత్రి తారక రామారావు కృషి ఫలితమని మంత్రి అన్నారు. దేశంలోనే వినూత్నంగా చంద్రశేఖర్ రావు చేపట్టిన పట్టణ ప్రగతి కార్యక్రమం వల్లే ఇది సాధ్యమైందని అన్నారు. మంత్రి కేటీఆర్ కి, సంబంధిత శాఖ అధికారులు, సిబ్బందికి ఎర్రబెల్లి అభినందనలు తెలిపారు.

 స్వచ్చ భారత్ మిషన్ పలు విబాగాల్లో అవార్డుల పంట.. మొత్తం 12 రివార్డులు సొంతం చేసుకున్న తెలంగాణ

స్వచ్చ భారత్ మిషన్ పలు విబాగాల్లో అవార్డుల పంట.. మొత్తం 12 రివార్డులు సొంతం చేసుకున్న తెలంగాణ

స్వచ్ఛ సర్వేక్షణ్‌లో లభించిన 9 అవార్డులకు తోడు రాష్ట్రాల క్యాటగిరీ, సఫాయి మిత్ర సురక్ష, గార్బేజ్‌ ఫ్రీ సిటీ విభాగాల్లో మరో 3 అవార్డులు దక్కాయని, సఫాయి మిత్ర సురక్ష చాలెంజ్‌లో భాగంగా రాష్ట్రాల క్యాటగిరీలో తెలంగాణను ఎంపికచేశారని, ఇదే విభాగం కింద మూడు లక్షల జనాభా కంటే తక్కువ ఉన్న పట్టణాల్లో కరీంనగర్‌ మున్సిపల్‌ కార్పొరేషన్‌ ఎంపికైందని, కాగా గ్రేటర్‌ హైదరాబాద్‌... గార్బేజ్‌ ఫ్రీ సిటీ విభాగంలో ఎంపికైందని మంత్రి వివరించారు. తొలిసారిగా పారిశుద్ధ్య కార్మికుల భద్రత, పారిశుద్ధ్యాన్ని మెరుగుపరిచే ఉద్దేశంతో ప్రవేశపెట్టిన సఫాయి మిత్ర సురక్ష చాలెంజ్‌ అవార్డు కూడా దక్కడం మన తెలంగాణ ప్రభుత్వ పనితీరుకు నిదర్శనమని మంత్రి ఎర్రబెల్లి పేర్కొన్నారు.

 నిధులు కూడా ఇస్తే మరింత ఉత్సాహం వస్తుంది.. కేంద్రానికి ఎర్రబెల్లి విజ్ఞప్తి

నిధులు కూడా ఇస్తే మరింత ఉత్సాహం వస్తుంది.. కేంద్రానికి ఎర్రబెల్లి విజ్ఞప్తి

సీఎం చంద్రశేఖర్ రావు మేధోమథనం చేసి ప్రవేశపెట్టిన మిషన్ భగీరథ, మిషన్ కాకతీయ, పల్లె, పట్టణ ప్రగతి, రైతు బంధు, రైతు బీమా, దళిత బంధు, కెసిఆర్ కిట్లు వంటి అనేక పథకాలు విజయవంతంగా అమలు అవుతూ, దేశానికి ఆదర్శంగా నిలిచాయన్నారు. ఆయా పథకాలను కేంద్రం, పలు రాష్ట్రాలు యధాతథంగా అమలు చేస్తున్నాయని మంత్రి ఎర్రబెల్లి చెప్పారు. ఇప్పటికే మన పథకాలను అనుకరిస్తూ, అనుసరిస్తూ, అనేక అవార్డులు, రివార్డులు ఇస్తున్న కేంద్రం లోని బీజేపీ ప్రభుత్వం, మన రాష్ట్రం పట్ల వివక్ష చూపిస్తోందని, అభినందనలు తప్ప నిధులు ఇవ్వడం లేదని, ఇప్పటికైనా తగినన్ని నిధులు ఇచ్చి, తెలంగాణ రాష్ట్రానికి తగిన ప్రోత్సాహం ఇవ్వాలని మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు కేంద్రానికి విజ్ఞప్తి చేశారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+